ఈ వేసవిలో కొత్త గ్రీన్ ట్రెండ్ బాగా నడుస్తోంది. వేసవి వేడిని చల్లబరిచేందుకు హైదరాబాద్, విజయవాడలో ఇలాంటి ఓ సరికొత్త ఐడియా జనాలను ఆకర్షిస్తోంది. మొక్కల అద్దె సేవలు! ఇంటిని అందంగా, చల్లగా మార్చే ఈ ట్రెండ్ యువతలో సందడి చేస్తోంది? ఆన్‌లైన్‌లో బుక్ చేస్తే మొక్కలు మీ ఇంటికి చేరతాయి.. సీజన్ తర్వాత తిరిగి తీసుకెళతారు. ఈ పర్యావరణ హిత ఆలోచన గురించి పూర్తిగా తెలుసుకోండి!మొక్కల అద్దె.. ఒక్క క్లిక్‌తో మీ ఇంటికి మొక్కలు డెలివరీ! Ugaoo, Greenly లాంటి వెబ్‌సైట్లు, స్థానిక …
Read More »‘ఒకే గుడి, ఒకే బావి, ఒకే శ్మశానం’.. RSS చీఫ్ భగవత్ సామాజిక ఐక్యతా మంత్రం
అలీఘర్‌లో ఐదు రోజుల పర్యటనలో ఉన్న RSS చీఫ్ మోహన్ భగవత్ వరుస సమావేశాల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఆయన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ కుల విభజన నిర్మూలనకు ‘అందరకీ ఒకే ఆలయం, ఒకే బావి, ఒకే శ్మశానం’ అనే సూత్రాన్ని అవలంభించాలని పిలుపునిచ్చారు. తద్వారా సామాజిక ఐక్యత సాధ్యమవుతుందని అన్నారు..హిందూ సమాజంలోని కుల విభజనలను తొలగించాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఆదివారం (ఏప్రిల్ 20) ఓ కార్యక్రమంలో అన్నారు. కుల విభజన నిర్మూలనకు ‘అందరకీ ఒకే ఆలయం, ఒకే …
Read More »యువనేతకు అరుదైన గుర్తింపు.. గ్లోబల్ యంగ్ లీడర్‌గా రామ్మోహన్ నాయుడు..!
భారతదేశపు అతి పిన్న వయస్కుడైన కేబినెట్ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది.. 2025 సంవత్సరానికి ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) గ్లోబల్ యంగ్ లీడర్‌లలో ఒకరిగా గుర్తింపు పొందారు. ప్రపంచవ్యాప్తంగా తమ రంగాల్లో ఉత్తమ నాయకత్వం కనబరిచిన యువ నాయకులను వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎంపిక చేస్తుంది. ఈ జాబితాలో రామ్మోహన్ నాయుడుకు చోటు దక్కింది. ప్రపంచంలోని అత్యంత చైతన్యవంతమైన, దూరదృష్టి గల నేతగా నిలిచారు. ప్రభావవంతమైన మార్పుని కలిగించే వినూత్న పాలన ఉద్దేశ్యంతో ప్రజా సేవలో …
Read More »నేడే జేఈఈ మెయిన్ తుది ర్యాంకుల విడుదల.. కటాఫ్ ఎంత ఉంటుందంటే?
జేఈఈ మెయిన్ 2025 తుది విడత ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) గురువారం (ఏప్రిల్ 17) విడుదల చేయనుంది. ఈ ఏడాది జనవరిలో జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు జరుగగా.. ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు తుది విడత పరీక్షలు జరిగాయి. ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో పేపర్-1 (బీఈ/ బీటెక్) పరీక్షలు, ఏప్రిల్ 9వ తేదీన పేపర్-2ఏ, 2బీ (బీఆర్క్/బీ ప్లానింగ్) ప్రవేశ పరీక్షలు జరిగాయి. అయితే ఈ రెండు విడతల పరీక్షల్లోని …
Read More »వేసవిలో ముక్కు నుంచి రక్తం ఎందుకు కారుతుంది?.. దీన్ని నిర్లక్ష్యం చేస్తే డేంజర్
వేసవిలో ముక్కు నుంచి రక్తం కారడానికి ప్రధాన కారణం వేడి. వేడి గాలి వల్ల ముక్కు లోపలి పొరలు ఎండిపోతుంటాయి. ఇది పగుళ్లకు దారితీస్తుంది. తక్కువ తేమ, అలెర్జీలు, డీహైడ్రేషన్ లేదా ముక్కు గోకడం కూడా కారణాలు కావచ్చు. అయితే, ఇలా ఎక్కువ రోజులు జరుగుతున్నా, రక్తస్రావం ఎక్కువగా అనిపించినా వెంటనే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ సమస్యకు కారణాలు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..వేసవిలో ముక్కు నుంచి రక్తస్రావం నివారించడానికి రోజూ 2-3 లీటర్ల నీరు, కొబ్బరి నీళ్లు లేదా నిమ్మరసం …
Read More »ఉమెన్ ఎంపవర్‌మెంట్ కోసం ప్రధాన మంత్రి ముద్ర యోజన ఎలా ఉపయోగపడుతోంది?
ప్రధాన మంత్రి ముద్ర యోజన (PMMY) భారత మహిళల ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. సూక్ష్మ, చిన్న వ్యాపారాలకు సబ్సిడీతో కూడిన రుణాలను అందించడం ద్వారా, ఈ పథకం మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. పేదరికాన్ని తగ్గించడంలోనూ, దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్రను పెంచడంలోనూ PMMY కీలక పాత్ర పోషిస్తోంది. ఇది మహిళలకు ఆర్థిక గౌరవాన్ని అందిస్తుంది.భారత దేశంలోని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ముద్ర యోజన (PMMY) పథకాన్ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. …
Read More »రాజ్యంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌కు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి!
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా దేశ ప్రజలు ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలు నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా దేశ ప్రజలు ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలు నివాళులర్పించారు. దేశానికి ఆయన …
Read More »గుడ్‌న్యూస్.. ఓలా, ఉబర్, ర్యాపిడో దోపిడికి చెక్.. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి సహకార్ యాప్!
ప్రధాన నగరాల్లో ఓలా, ఉబర్, ర్యాపిడోల వినియోగం బాగా పెరిగిపోయింది. విపరీతంగా పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా.. ఆయా కంపెనీలు వినియోగదారుల నుంచి భారీగా ఛార్జీలు వస్తూలు చేస్తున్నాయి. అలా అని క్యాబ్ డ్రైవర్లు అంతే మొత్తం చెల్లించడం లేదు. కస్టమర్ నుంచి తీసుకున్న ఛార్జీలో భారీగా కోత విధించి.. మిగతా డబ్బును డ్రైవర్లకు, రైడర్లకు చెల్లిస్తున్నాయి. వీటిపై డ్రైవర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సూపర్ ఐడియాతో ముందుకు వచ్చింది. సహకార్ ట్యాక్సీ పేరుతో ఒక …
Read More »విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఏప్రిల్‌లో ఎన్ని రోజులు సెలవులో తెలుసా?
పాఠశాలలకు సెలవులు వస్తున్నాయంటే చాలు విద్యార్థులు ఎగిరి గంతేస్తారు. సెలవుల్లో ఎంజాయ్ చేయాలనే ఆనందంలో మునిగిపోతారు. అయితే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ రానున్నాయి. కానీ అంతకు ముందు అంటే ఏప్రిల్ నెలలో కూడా పాఠశాలలకు సెలవులు వస్తున్నాయి. ఇందులో పండగలు, ఇతర కార్యక్రమాల సందర్బంగా సెలవులు ఉన్నాయి. అవేంటో చూద్దాం.. మార్చి 31వ తేదీ రంజాన్ పండుగ ఉంది. ఈ నేపథ్యంలో మరుసటి రోజు అంటే ఏప్రిల్ 1వ తేదీ కూడా పండుగ సెలవులు ఉంటుంది. దీంతో రంజాన్‌కు రెండు రోజులు సెలవులు రానున్నాయి. …
Read More »హిందీని రుద్దడాన్ని నేను వ్యతిరేకించాను! మరోసారి భాషా వివాదంపై స్పందించిన పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తమిళనాడు ప్రభుత్వం హిందీని బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపిస్తుండగా, పవన్ కళ్యాణ్ హిందీని వ్యతిరేకించేవారు తమ సినిమాలను హిందీలో ఎందుకు డబ్ చేస్తారని ప్రశ్నించారు. డీఎంకే నేతలు కూడా స్పందిస్తూ హిందీని బలవంతం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మరోసారి ఈ అంశంపై ట్వీట్ చేశారు.హిందీ భాషా గురించి కొనసాగుతున్న వివాదం గురించి తెలిసిందే. తమపై హిందీని బలవంతంగా కేంద్రం రుద్దుతుందని తమిళనాడు ప్రభుత్వం ఆరోపిస్తోంది. అలాంటిదేం లేదని కేంద్ర …
Read More »