Kolkata Doctor Case: దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా పెను సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనలో సీబీఐ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కోర్టు ఆదేశాలతో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ సహా మరో ఆరుగురికి పాలీగ్రాఫ్ టెస్ట్‌ను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో అతడ్ని జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలోనే జైలులోనే ఈ పాలీగ్రాఫ్ టెస్ట్‌ను సీబీఐ అధికారులు ఏర్పాటు చేశారు. మరోవైపు.. సంజయ్ రాయ్‌తోపాటు …
Read More »చంద్రయాన్-3 ప్రయోగానికి ఏడాది.. ఇస్రో కీలక నిర్ణయం
సరిగ్గా ఏడాది కిందట ఆగస్టు 23న సాయంత్రం జాబిల్లి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా చంద్రయాన్-3ను దింపి భారత్ చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకూ ఏ దేశానికీ సాధ్యం కాని ఘనతను సాధించింది. రెండు వారాల పాటు చంద్రుడిపై పరిశోధనలు సాగించిన ల్యాండర్ విక్రమ్.. రోవర్ ప్రజ్ఞాన్‌లు కీలక సమాచారాన్ని సేకరించాయి. ఈ డేటాను విశ్లేషణ కోసం తాజాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అంతర్జాతీయ శాస్త్రవేత్తలకు అందుబాటులో ఉంచింది. దక్షిణ ధ్రువంపై శివశక్తి పాయింట్ వద్ద ల్యాండర్ దిగి ఏడాది పూర్తయిన సందర్భంగా …
Read More »హడలెత్తిస్తున్న ‘హైడ్రా’.. హీరో నాగార్జున N కన్వెన్షన్ కూల్చివేత
అక్రమ నిర్మాణాల కూల్చివేతతో హాట్ టాఫిక్‌గా మారిన హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) ఎక్కడా తగ్గటం లేదు. ఎవరైతే నాకేంటి అంటూ హైడ్రా అధికారులు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. తాజాగా.. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. సినీ హీరో నాగార్జునకు చెందిన ఈ కన్వెన్షన్‌ను ఇవాళ ఉదయం భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ సెంటర్‌పై తాజాగా హైడ్రా అధికారులకు ఫిర్యాదు అందింది. తుమ్మకుంటలో చెరువును ఆక్రమించి నాగార్జున …
Read More »వైద్యురాలిపై హత్యాచారానికి ముందు ఏం జరిగింది? కీలక విషయాలు గుర్తించిన సీబీఐ
కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రెయినీ వైద్యురాలి హత్యాచార ఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ ఘటనపై సీబీఐ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఆమె సహచర వైద్యులను విచారిస్తోన్న సీబీఐ.. వారికి లై-డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. వారు పొంతనలేని వాంగ్మూలాలు ఇవ్వడమే ఇందుకు కారణం. వీరిలో ఓ హౌస్ సర్జన్, ఓ ఇంటెర్న్, ఇద్దరు మొదటి సంవత్సరం పీజీ డాక్టర్లు ఉన్నారు. ఈ నేరంలో వీరి భాగస్వాములైనట్టు కనిపించడం లేదు, కానీ …
Read More »ఘోర ప్రమాదం.. నదిలో పడిన బస్సు.. 14 మంది మృతి, 30 మంది గల్లంతు
Bus Accident: నేపాల్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తు నదిలోకి దూసుకెళ్లింది. దీంతో ఆ బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికుల్లో కొందరు ఆ నదిలో పడి గల్లంతయ్యారు. భారత్‌కు చెందిన ఆ బస్సు నేపాల్‌లో పర్యటిస్తుండగా ఈ ఘటన జరిగింది. బస్సు నదిలో పడిన సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. అందులో చిక్కుకున్న ప్రయాణికులను బయటికి తీస్తున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టారు. ఆ బస్సులో వెళ్తున్న 40 …
Read More »అంబానీకి ఊహించని షాక్.. 5 ఏళ్ల నిషేధం.. రూ.25 కోట్ల జరిమానా..!
Anil Ambani: ప్రముఖ వ్యాపారవేత్త, ముకేశ్ అంబానీ సోదరుడు అనీల్ అంబానీకి ఊహించని షాక్ ఇచ్చింది మార్కెట్ల నియంత్రణా సంస్థ సెబీ (SEBI). సెక్యూరిటీల మార్కెట్ల నుంచి ఆయనను 5 ఏళ్ల పాటు నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. అనీల్ అంబానీకి చెందిన రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ సంస్థలో కీలకంగా వ్యవహరించిన మాజీ అధికారులు, మరో 25 సంస్థల పైనా ఈ నిషేధం ఉంటుందని సెబీ శుక్రవారం వెల్లడించింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ సంస్థలో నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలోనే అనీల్ అంబానీ, మాజీ అధికారులపై చర్యలు …
Read More »మనిషి కాదు పశువు, అశ్లీల వీడియోలకు బానిస.. కోల్‌కతా నిందితుడిపై సీబీఐ అధికారి
RG Kar Hospital: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన కోల్‌కతా డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో సీబీఐ అధికారులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు జరిపిన విచారణకు సంబంధించి కోల్‌కతా పోలీసులతోపాటు సీబీఐ అధికారులు కూడా సుప్రీంకోర్టులో వేర్వేరుగా స్టేటస్ రిపోర్టులు సమర్పించారు. ఈ కేసు విచారణను సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ, కోల్‌కతా పోలీసులు.. నివేదిక అందించారు. మరోవైపు.. ఈ కేసులో విచారణ జరుపుతున్న ఓ సీబీఐ అధికారి.. నిందితుడు సంజయ్ రాయ్ గురించి సంచలన విషయాలు వెల్లడించారు. …
Read More »కొత్త చట్టం.. పెళ్లిళ్లు, విడాకులకు ముస్లింలు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందే!
Muslim Marriages: ముస్లింల పెళ్లిళ్లు, విడాకులకు సంబంధించి కీలక చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు అస్సాంలోని బీజేపీ సర్కార్ చర్యలు ప్రారంభించింది. ముస్లింల వివాహాలు, విడాకులకు సంబంధించి రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ ఓ బిల్లును తీసుకురానుంది. ఈ బిల్లును త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు హిమంత బిశ్వ శర్మ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఈ బిల్లుకు అస్సాం మంత్రివర్గం ఆమోద ముద్ర కల్పించింది. అస్సాం కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజ్ అండ్ డివోర్స్ బిల్-2024 ఆమోదం పొందితే.. ఇక ఆ రాష్ట్రంలో జరిగే ముస్లింల …
Read More »ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనలో సుప్రీంకోర్టుకు సీబీఐ ఇచ్చిన రిపోర్ట్‌లో సంచలన విషయాలు
Kolkata Case: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన పశ్చిమ బెంగాల్ ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కేసు విచారణకు సంబంధించిన పురోగతిపై సుప్రీంకోర్టుకు సీబీఐ రిపోర్ట్ సమర్పించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయూమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేడీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్‌మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. ఈ కేసును ఆగస్టు 20 వ తేదీన ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. అనంతరం ఈ కేసుకు సంబందించి వాదనలు వింటుండగా.. దీనిపై స్టేటస్ రిపోర్టు అందించాలని …
Read More »ల్యాండింగ్ వేళ ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపులు.. ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ
Air India: ల్యాండింగ్ సమయంలో విమానంలో బాంబు ఉందంటూ వచ్చిన సమాచారంతో ఎయిర్‌పోర్టులో ఫుల్ ఎమర్జెన్సీ విధించారు. 135 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న విమానం.. ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ అవుతుండగా.. బాంబు బెదిరింపు సమాచారం వచ్చింది. దీంతో వెంటనే ఎయిర్‌పోర్టు అధికారులు పైలట్‌ను అలర్ట్ చేశారు. అయితే ఆ విమానం సేఫ్‌గా ల్యాండ్ అయిన తర్వాత వెంటనే అందులో ఉన్న ప్రయాణికులను హుటాహుటిన బయటికి రప్పించారు. అనంతరం ఆ విమానంలో గాలింపు చేపట్టారు. మరోవైపు.. ఈ ఘటనతో ఎయిర్‌పోర్టు మొత్తం పూర్తిస్థాయి ఎమర్జెన్సీ విధించారు. కేరళ …
Read More »