కీర దోసకాయ లాభాలు మనందరికీ తెలిసిందే. అయితే, కీర దోసకాయ గింజలు కూడా అనేక రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తాయంటున్నారు పోషకాహార నిపుణులు. ఇది మన శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. హై బీపీ నుంచి డయాబెటిస్ వరకు అన్నింటికీ దివ్యౌషధంగా పనిచేస్తుంది. దోసకాయ గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకుందాం..దోసకాయలో విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ …
Read More »డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ కొలువులు.. ఎంపికైతే నెలకు రూ.40 వేల జీతం
ముంబైలోని ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్.. డిగ్రీ అర్హత కలిగిన నిరుద్యోగుల నుంచి ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన వారు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు..ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్… దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐఏసీఎల్ శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ సంక్షిప్త ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది.గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైన అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. …
Read More »కొరుకుడుపడని కొయ్యగా మారిన దేశ రాజధాని.. ఈసారైనా కమలనాథుల కల నెరవేరేనా..?
భారతీయ జనతా పార్టీ (BJP) కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. కానీ దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం మూడు దశాబ్దాలుగా అధికారం ఆ పార్టీకి అందని ద్రాక్షగా మిగిలిపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కలిసి పోటీ చేసినా సరే క్లీన్ స్వీప్ చేసిన కమలదళం అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి చతికిలపడుతోంది. చివరిసారిగా 1993లో గెలుపొందిన ఆ పార్టీ, మళ్లీ ఇప్పటి వరకు అధికారం చేజిక్కించుకోలేకపోయింది. మరో రెండు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా …
Read More »నకిలీ ప్రొఫైల్స్.. నిజమైన నష్టాలు..! వాట్సాప్ డీపీ తో 5 లక్షలు స్వాహా..
సాధారణంగా స్నేహితులంటే అమితమైన ప్రేమ ఉన్నవారు అడగంగానే ఏదైనా చేసేస్తారు. అందులో భాగంగానే పాపం ఈ స్నేహితుడు తన స్నేహితుడి ఫోటో ఉన్న వాట్సాప్ నుంచి డబ్బులు అవసరం అంటూ మెసేజ్ రావడంతోనే 500000 పంపేశాడు. తీరా అది స్నేహితుడు కాదని తెలుసుకుని అవాక్కయ్యాడు.. వినటానికి మరి విడ్డూరంగా ఉన్న.. నిజమైన ప్రేమ గుడ్డిది అన్నట్లుమోసపోయేవారు ఉంటే మోసం చేసేవారికి హద్దే లేదు… ఈ మధ్యకాలంలో మోసపోయిన తర్వాత గాని ఇలా కూడా మోసం చేస్తారా అనేలా ఉన్నాయి ప్రస్తుత రోజుల్లో జరుగుతున్న మోసాలు …
Read More »అయ్యోపాపం..స్కూల్ కు వెళ్తున్న టీచర్ ను కిడ్నాప్ చేశారు.. ఆ తర్వాత ఏం చేశారో చూడండి..!
అతడు స్కూల్ కు వెళ్తుండగా కొంత మంది వ్యక్తులు రెండు స్కార్పియో వాహనాల్లో వచ్చి అతడిని అడ్డుకున్నారు. గన్స్ తో బెదిరించి కిడ్నాప్ చేశారు. అక్కడి నుంచి అతడిని ఓ ఆలయం వద్దకు తీసుకెళ్లి అక్కడ గుంజన్ అనే మహిళతో బలవంతంగా పెళ్లి చేశారు. బలవంతంగా వివాహం చేయిస్తున్న వీడియో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఉదయాన్నే స్కూల్‌కి వెళ్తున్న ఓ ఉపాధ్యాయుడిని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేశారు. రోజూ మాదిరిగానే స్కూల్‌కి వెళ్తున్న టీచర్‌ని కొందరు వ్యక్తులు బలవంతంగా ఎత్తుకెళ్లారు. తుపాకులతో బెదిరించి …
Read More »దసలి పట్టు అంటే ఏంటి? దానికి ఎందుకంత క్రేజ్ ?
శతాబ్దాల చరిత్ర కలిగిన పట్టు.. దేవాది దేవతలకు మాత్రమే పరిమితమైన పట్టు.. ఆనాడు నిజాంను మంత్రముగ్దున్ని చేసి నేడు మగువల మనసులనూ కనికట్టు చేస్తోంది. ప్రాణహిత గోదావరి తీరం వెంట పుట్టిన ఈ పట్టు.. నేడు ఫ్యాషన్ ప్రపంచాన్నీ ఓ పట్టు పడుతోంది.ఆదివాసీ ఖిల్లాలో అరుదైన పరిశ్రమగా.. శ్రమే ఆయుదంగా సాగిస్తున్న ఈ పంట గిరిజన రైతుల పాలిట కల్పతరువుగా మారుతోంది. ఇంకాస్త ప్రభుత్వాల ప్రోత్సాహం అదనమైతే ఈ పట్టు తెలంగాణ వస్త్రరాజంగా పట్టాభిషేకం చేసుకోవడం ఖాయం. ఇంతకీ ఏంటా పట్టు కథ అంటారా.. …
Read More »దంచికొట్టిన మాజీ కేంద్రమంత్రి.. పాలిటిక్స్‌లోకి కాకుండా క్రికెట్‌లోకి వస్తే కథ వేరే ఉండు..
Anurag Thakur: లోక్‌సభ స్పీకర్ ఎలెవన్, రాజ్యసభ చైర్మన్ ఎలెవన్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో అనురాగ్ ఠాకూర్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 111 పరుగులు చేసి జట్టును 73 పరుగుల తేడాతో విజయతీరాలకు చేర్చాడు. తన అద్భుతమైన ప్రదర్శనతో అనురాగ్ ఠాకూర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా కూడా ఎంపికయ్యాడు.టీబీకి వ్యతిరేకంగా నిర్వహించిన క్రికెట్ మ్యాచ్లో మాజీ కేంద్రమంత్రి అనురాగ్ ఠాగుర్ సెంచరీ చేశారు. లోక్‌సభ స్పీకర్ XI, రాజ్యసభ ఛైర్మన్ XI జట్ల మధ్య స్నేహపూర్వక మ్యాచ్ జరిగింది. ఇందులో లోక్‌సభ …
Read More »‘దేశం కోసం మోడీ మూడు గంటలు మాత్రమే నిద్రపోతున్నారు’.. ప్రధానిపై దేవర విలన్ ప్రశంసలు
దిగ్గజ నటుడు రాజ్ కపూర్ శత జయంతిని పురస్కరించుకుని కపూర్ ఫ్యామిలీ ఇటీవల ప్రధాని మోడీని ప్రత్యేకంగా కలిసింది. కరీనా, సైఫ్, రణ్ బీర్ ,అలియా, కరిష్మా.. ఇలా అందరూ ప్రధానితో భేటీ అయ్యారు. తాజాగా ఈ సమావేశానికి సంబంధించిన విశేషాలను దేవర విలన్ సైఫ్ అలీఖాన్ అందరితో పంచుకున్నారు.దివంగత నటుడు రాజ్ కపూర్ శత జయంతి సందర్భంగా కపూర్ కుటుంబం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించింది. ఈ ఈవెంట్ కు ప్రధాని మోడీని కూడా ఆహ్వానించారు. ఇందుకోసం ఇటీవలే కపూర్ ఫ్యామిలీ ఢిల్లీ వెళ్లి …
Read More »అతుల్ ఆత్మహత్య.. తెరపైకి కొత్త డిమాండ్.. ఆ చట్టం తేవాలని..
బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ భార్య వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది.భార్య టార్చర్ తట్టుకోలేక బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. ఆత్మహత్య చేసుకునే ముందు 40 పేజీల లేఖ రాసి.. మరో 80 నిమిషాల వీడియో తీసి.. తాను ఏ విధంగా వేధింపులకు గురవుతున్నానని విషయాన్ని ప్రస్తావించడం… …
Read More »ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ దూకుడు.. మొత్తం 70 మంది అభ్యర్ధులను ప్రకటించిన కేజ్రీవాల్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం ఆమ్‌ఆద్మీ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్ధుల ఎంపికను ఆప్ పూర్తి చేసింది. మొత్తం 70 స్థానాల్లో అభ్యర్దులను ప్రకటించారు కేజ్రీవాల్. తుదిజాబితాలో 38 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న న్యూఢిల్లీ సీటు నుంచి బరి లోకి దిగారు. కల్కాజీ నుంచి సీఎం అతిషి పోటీ చేస్తున్నారు. బీజేపీ , కాంగ్రెస్ కంటే వేగంగా అభ్యర్ధుల ఎంపికను పూర్తి చేసిన కేజ్రీవాల్ ప్రచారంపై దృష్టి …
Read More »