జాతీయం

ఆర్‌ఆర్‌బీ రైల్వే లోకో పైలట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ పరీక్ష తేదీ ఇదే.. వెబ్‌సైట్‌లో సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు

ఆర్‌ఆర్‌బీ అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ) 2024 సీబీటీ2 పరీక్షలు మార్చి 19, మే 2, 6వ తేదీల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవలే పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రైల్వేశాఖ కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌కు షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థుల హాల్‌టికెట్‌ నంబర్‌లతో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్ధులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి స్కోర్‌కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. స్కోర్‌ కార్డులను జులై 2 నుంచి 7వ తేదీ వరకు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. లోకోపైలట్‌ పరీక్షలకు …

Read More »

ఇషా ఫౌండేషన్‌ను సందర్శించిన కేంద్ర మంత్రి జువల్‌..! గ్రామీణాభివృద్ధిలో ఇషా కృషికి ప్రశంసలు..

ఇషా ఫౌండేషన్ మద్దతుతో తమిళనాడులోని గిరిజన మహిళలు ఆర్థికంగా స్వతంత్రులై, పన్నులు చెల్లిస్తున్నారు. రూ.200లతో ప్రారంభించిన వ్యాపారాలు కోట్లలో టర్నోవర్‌ను సాధించాయి. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువెల్ ఓరం ఈ మహిళల ప్రగతిని ప్రశంసించారు. ఇషా ఫౌండేషన్ గ్రామీణాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు. ఇషా ఫౌండేషన్ మద్దతుతో గిరిజన మహిళలు లక్షాధికారులుగా మారడం, ఇప్పుడు ఆదాయపు పన్ను చెల్లిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు విక్షిత్ భారత్‌కు మార్గం సుగమం చేస్తాయి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సద్గురు దార్శనికతను నెరవేరుస్తాయని కేంద్ర గిరిజన …

Read More »

మహా పాలిటిక్స్‌లో సూపర్ సీన్.. 20ఏళ్ల తర్వాత ఒకే వేదికపై అన్నదమ్ములు..

మహారాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు నెలకొంటున్నాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అన్నదమ్ములు ఇద్దరూ ఒకే వేదికపై కనిపించారు. అంతేకాకుండా ఒకొరిని ఒకరు హగ్ చేసుకోవడం అక్కడ ఉన్నవారిని ఆకట్టుకుంది. ఇంతకీ ఆ అన్నదమ్ములు ఎవరు అనుకుంటున్నారా..? ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రే. 2005లో చివరిసారిగా ఒకే వేదికపై కలిసి కనిపించిన ఈ ఇద్దరూ.. మళ్లీ 20 ఏళ్ల తర్వాత కనిపించారు. ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం వల్ల ఈ ఇద్దరు అన్నదమ్ములు కలిశారు. దీంతో బాల్ థాక్రే అభిమానులు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. …

Read More »

చియా సీడ్స్‌ ఇలా తిన్నారంటే మీ గుండె పదిలం.. ఎనర్జీ డబుల్‌.. మలబద్ధకం పరార్.. !

తరచూ చియా సీడ్స్‌ తినడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. నీరసం, అలసట సమస్యలతో బాధపడేవారికి ఇవి ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తాయి. రోజంతా శక్తిని అందిస్తాయి. ఇవి తింటే రోజంతా యాక్టివ్‌గా ఉంటారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఫైబర్ అధికంగా ఉండే చియా గింజలు జీర్ణక్రియకు సహాయపడతాయి. మలబద్ధకాన్ని నివారిస్తాయి.  చియా సీడ్స్‌.. ప్రస్తుతం చాలా మంది వీటిని తమ రోజువారి ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. చూసేందుకు చిన్నగా నల్లని రంగులో కనిపించే చియా సీడ్స్‌.. పుష్కలమైన పోషకాలు నిండి …

Read More »

బత్తాయి పండ్లు తిన్నాక.. వీటిని పొరపాటున కూడా తినకండి..! అది విషమేనట..

బత్తాయి పండులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందుకే జీర్ణ సమస్యలు, అజీర్తితో బాధపడేవారు బత్తాయిని ఎక్కువగా తినకూడదు. గ్యాస్‌ సంబంధిత సమస్యలు ఉన్నవారిలో పుల్లటి తేన్పులు వచ్చే ప్రమాదముంది. అందుకే.. ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఎక్కువగా తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. బత్తాయిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం వంటి పోషకాలు పుష్కకలంగా ఉంటాయి. ఇవి.. వివిధ రోగాలు రాకుండా అడ్డుకుంటాయి. నీరసానికి గురైనప్పుడు బత్తాయి జ్యూస్ తాగితే తక్షణ శక్తి వస్తుంది. నీరసం దరిచేరదు. అయితే, …

Read More »

9 నెలలుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది.. రికార్డు స్థాయికి భారత్..!

ప్రపంచంలో అత్యధిక ఫారెక్స్ నిల్వలు కలిగిన నాల్గవ దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. చైనా, జపాన్, స్విట్జర్లాండ్ మాత్రమే భారతదేశం కంటే ముందు ఉన్నాయి. భారతదేశ కేంద్ర బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి గణాంకాలను విడుదల చేసింది. మరోవైపు, భారతదేశ విదేశీ కరెన్సీ ఆస్తులు భారీగా పెరిగాయి. భారతదేశం గత 9 నెలలుగా ఎదురుచూస్తున్న రోజు చివరకు రానే వచ్చింది. అక్టోబర్ 2024 తర్వాత మొదటిసారిగా, దేశ ఫారెక్స్ నిల్వలు 700 బిలియన్ డాలర్లను దాటాయి. జీవితకాల గరిష్ట రికార్డును బద్దలు …

Read More »

 బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా కొలువులకు నోటిఫికేషన్‌.. ఎంపికైతే రూ.లక్ష వరకు జీతం!

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచుల్లో.. రెగ్యులర్ ప్రాతిపదికన లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 2,500 పోస్టులను భర్తీ చేయనుంది.. బ్యాంక్ ఆఫ్ బరోడా.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న బ్రాంచుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం …

Read More »

సరికొత్త రాజకీయ వ్యూహం.. మహిళకు బీజేపీ అధ్యక్ష బాధ్యతలు..? రేసులో ఆ ముగ్గురు..!

దేశవ్యాప్తంగా పుల్‌ స్వింగ్‌లో ఉంది కమలం పార్టీ..! వరుసబెట్టి విజయాలు సాధిస్తూ.. ఓ రేంజ్‌లో హవా కంటిన్యూ చేస్తోంది. మరి అలాంటి పార్టీకి కాబోయే కొత్త చీఫ్‌ ఎవరు..? అమిత్‌షా, రాజ్‌నాథ్, నడ్డా లాంటి అగ్రనేతల తర్వాత ఆ పీఠాన్ని ఎక్కబోయే నాయకుడెవరు..? అన్నదీ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా వినిపిస్తున్న ముగ్గురిలో ఎవరా బిగ్ లక్కీ హ్యాండ్..? హ్యాట్రిక్‌ విక్టరీతో అధికారంలోకి వచ్చిన కమలం పార్టీ అదే జోష్‌ కంటిన్యూ చేస్తోంది. ప్రత్యర్థులకందని వ్యూహాలతో అన్ని రాష్ట్రాల్లోనూ బలోపేతమవుతోంది. …

Read More »

కథన సీమలో కొదమ సింహం.. మన ‘ఆకాష్’ వైపు బ్రెజిల్ చూపు..!

పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన తర్వాత, బ్రెజిల్ ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, ఇతర భారతీయ రక్షణ సాంకేతికతలపై ఆసక్తిని వ్యక్తం చేసింది. బ్రెజిల్ ప్రభుత్వం యుద్ధభూమి సాంకేతికత, జలాంతర్గాములు, తీర రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతోంది. పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో పాకిస్థాన్‌, పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను హతం చేసింది. ఉగ్రవాదలుపై దాడికి ప్రతిదాడిగా భారత్‌పై పాకిస్థాన్‌ దాడులకు …

Read More »

దలైలామాకు మాత్రమే ఆ హక్కుంది.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్

దలైలామా వారసుడిని తమ అనుమతితోనే ఎంపిక చేయాలన్న చైనా ప్రకటనపై భారత్ స్పందించింది. దీనిపై డ్రాగన్ కంట్రీకి గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇప్పటికే 15వ దలైలామా ఎంపికలో చైనా జోక్యం ఉండదని.. చైనా అవతల జన్మించిన వ్యక్తే తన వారసుడు అవుతాడని దలైలామా ప్రకటించారు. ఇప్పుడు భారత్ కూడా చైనాకు కౌంటర్ ఇవ్వడం ఆసక్తిగా మారింది. బౌద్ధ మత గురువు దలైలామా తన వారసుడి ఎంపిక ప్రక్రియపై చేసిన ప్రకటన చైనాకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. తన వారసుడిని ఎంపిక చేసే అధికారం గాడెన్ …

Read More »