జాతీయం

మహిళలకు శుభవార్త.. ప్రతీ నెల అకౌంట్లలోకి రూ.2100, విద్యార్థినులకు స్కూటీలు

హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ.. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా ప్రచారాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 7 గ్యారెంటీల పేరుతో ఎన్నికల మేనిఫేస్టోను విడుదల చేయగా.. తాజాగా బీజేపీ కూడా తమ మేనిఫెస్టోను ప్రకటించింది. హర్యానా వాసులకు కాంగ్రెస్ 7 గ్యారెంటీలు ఇవ్వగా.. బీజేపీ 20 హామీల వర్షం కురిపించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా.. సంకల్ప్ పత్ర పేరుతో 20 పాయింట్ల వాగ్దానాలను ప్రకటించారు. గత ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలను పూర్తిగా …

Read More »

తగ్గేదేలా అంటున్న బీఎస్‌ఎన్‌ఎల్‌.. హై స్పీడ్‌ ఇంటర్నెట్‌ కోసం BSNL సర్వత్రా పేరిట కొత్త టెక్నాలజీ ఆగయా!

BSNL Sarvatra Technology : టెలికాం ఇండస్ట్రీలో BSNL దూసుకుపోతోంది. తమ కస్టమర్లకు మెరుగైన సేవలందించేందుకు కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటోంది. సుదూర ప్రాంతాల వినియోగదారులకు కూడా హోమ్ ఫైబర్ ద్వారా హైస్పీడ్ ఇంటర్నెట్ అందించేందుకు కృషి చేస్తోంది. రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్ వంటి ప్రధాన ప్రైవేట్ టెలికాం ప్రొవైడర్లు ఇప్పటికే తమ టెలికాం, ఫైబర్ వినియోగదారులకు హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందిస్తున్నాయి. ఈ టెలికం ప్రొవైడర్లకు పోటీగా BSNL ‘సర్వత్ర’ టెక్నాలజీ (Sarvatra Technology) పేరిట మరో టెలికార రంగంలో మరో విప్లవం సృష్టించాలని ప్రయత్నాలు …

Read More »

జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో వేలు పెట్టిన పాక్.. తమదీ, కాంగ్రెస్‌దీ ఒకే వైఖరి అని వెల్లడి

జమ్మూ కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని.. అందులో ఏ దేశం జోక్యం అవసరం లేదని భారత్ ఎన్నిసార్లు చెప్పినా.. పాకిస్తాన్ మాత్రం తన మంకుపట్టు వీడటం లేదు. తరచూ భారత్‌కు సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకుంటూ.. చీవాట్లు తింటోంది. అయినా మళ్లీ మళ్లీ మన దేశ అంతర్గత విషయాలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతోంది. ఈ క్రమంలోనే బుధవారం జరిగిన జమ్మూ కాశ్మీర్ ఎన్నికల సందర్భంగా పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ …

Read More »

అమెరికా కోర్టు సంచలన నిర్ణయం.. భారత్‌కు సమన్లు జారీ!

ఖలీస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ తన హత్యకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ అమెరికా కోర్టులో సివిల్ దావా వేశారు. ఈ దావాను విచారణకు చేపట్టిన అమెరికా కోర్టు.. భారత ప్రభుత్వానికి సమన్లు జారీ చేసింది. సదరన్ న్యూయార్క్ డిస్ట్రిక్ట్ యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు.. భారత ప్రభుత్వం, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రిసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ (రా) మాజీ చీఫ్ సమత్ గోయల్, రా ఏజెంట్ విక్రమ్ యాదవ్, భారతీయ వ్యాపారవేత్త నిఖిల్ గుప్తాలకు సమన్లు జారీ అయినట్టు అంతర్జాతీయ …

Read More »

ఏపీకి కేంద్రం బిగ్ రిలీఫ్.. భారీగా నిధులు విడుదల, ఎన్ని కోట్లంటే

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఊరట ఇచ్చింది.. రాష్ట్రంలోని పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్‌లకు కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.989 కోట్లు విడుదల చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొదటి విడతగా ఈ నిధుల్ని అందిస్తున్నట్లుగా కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నిధులు వారం, పది రోజుల్లో నిధులు ఖజానాకు జమ చేసే అవకాశం ఉంది. గత నెలలో పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్‌లకు 2023-24 సంవత్సరానికి రెండో విడతగా కేంద్రం ఇచ్చిన రూ.724 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. వీటి …

Read More »

పంచాంగం • గురువారం, సెప్టెంబర్ 19, 2024

విక్రం సంవత్సరం – పింగళ 2081, భాద్రపదము 16 ఇండియన్ సివిల్ క్యాలెండర్ – 1946, భాద్రపదము 28 పుర్నిమంతా – 2081, ఆశ్వయుజము 1 అమాంత – 2081, భాద్రపదము 16 తిథి బహుళపక్షం విదియ   – Sep 19 04:19 AM – Sep 20 12:40 AM బహుళపక్షం తదియ   – Sep 20 12:40 AM – Sep 20 09:15 PM నక్షత్రం ఉత్తరాభాద్ర – Sep 18 11:00 AM – Sep 19 08:04 AM రేవతి – Sep 19 08:04 AM – Sep 20 05:15 AM అశ్విని – Sep 20 …

Read More »

పెళ్లిపై కంగనా రనౌత్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, ఫ్రైర్ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ కొత్త ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి గెలుపొంది, లోక్ సభలో అడుగు పెట్టారు కంగన. పార్లమెంట్‌‌లో ప్రజల సమస్యలపై మాట్లాడుతున్నారని, తన నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్నారని ఆమె మద్దతుదారులు, ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఎంపీగా తన బాధ్యతలను కొనసాగిస్తూనే.. తాను స్వీయ దర్శకత్వంలో నటించిన ‘ఎమర్జెన్సీ’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం అయ్యారు కంగనా. అయితే, కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల …

Read More »

ఒక్కో పేజర్‌లో 3 గ్రాముల పేలుడు పదార్థం.. హెజ్బొల్లాను పక్కా స్కెచ్‌తో దెబ్బకొట్టిన మొసాద్!

లెబనాన్‌లోని హెజ్బొల్లా ఉగ్రవాదులే లక్ష్యంగా జరిగిన పేజర్ పేలుళ్ల వెనుక ఇజ్రాయేల్ స్కెచ్ ఉన్నట్టు వెల్లడయ్యింది. మొత్తం 5 వేలకుపైగా పేజర్లు పేలిన ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా… దాదాపు 3 వేల మంది గాయపడ్డారు. ఇజ్రాయేల్ గూఢచర్య సంస్థ మొసాద్ పక్కా ప్లానింగ్‌తో దాడి చేసింది. పేలిపోయిన పేజర్లు తైవాన్‌లో తయారుకాగా.. కొద్ది నెలల కిందటే హెజ్బొల్లా గ్రూప్ ఆర్డర్ చేసిందని లెబనాన్‌కు చెందిన భద్రతా వర్గాలు రాయిటర్స్‌కు వివరించాయి. ఈ ఆపరేషన్ కోసం మొసాద్ కొద్ది నెలలుగా కార్యాచరణ …

Read More »

ఎంట్రీతోనే అదరగొట్టిన స్టాక్.. తొలిరోజే పెట్టుబడి డబుల్.. ఒక్కోలాట్‌పై రూ.1.20 లక్షల లాభం!

IPO Listing: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీఓల సందడి కొనసాగుతోంది. రోజుకో కంపెనీ స్టాక్ మార్కెట్‌ లోకి ఎంట్రీ ఇస్తోంది. మూడు రోజుల క్రితమే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ భారీ లాభాలతో లిస్టింగ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే దారిలో మరో కంపెనీ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఇన్వెస్టర్లపై కాసుల వర్షం కురిపించింది. అదే ఇన్నోమెట్ అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ లిమిటెడ్ (Innomet Advanced Materials Ltd) స్టాక్. ఈ కంపెనీ షేర్లు జాతీయ స్టాక్ ఎక్స్చేంజీలో సెప్టెంబర్ 18 బుధవారం రోజున …

Read More »

మోదీ ఓ అద్భుతం.. వచ్చే వారం కలుస్తా.. డొనాల్డ్ ట్రంప్

వచ్చేవారం తమ దేశంలో పర్యటించనున్న భారత్ ప్రధాని నరేంద్ర మోదీని తాను కలుస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మిచిగాన్‌లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ట్రంప్.. ప్రధాని మోదీ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ అద్భుతమైన వ్యక్తి అని ఆకాశనికెత్తేశారు. ‘వచ్చే వారం ఆయన ఇక్కడకు వస్తున్నారు.. నేను కలుస్తాను’ అని అన్నారు. అయితే, ఇరువురి భేటీకి సంబంధించిన వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ చివరిసారిగా 2020 ఫిబ్రవరిలో కలుసుకున్నారు. అమెరికా అధ్యక్షుడి …

Read More »