జాతీయం

హిమాచల్‌ ప్రదేశ్‌లో క్లౌడ్ బరస్ట్.. 20 మంది గల్లంతు.. భయానక దృశ్యాలు

కేరళలో ప్రకృతి ప్రకోపం మరిచిపోకముందే హిమాచల్ ప్రదేశ్‌లో మరో ఘటన చోటుచేసుకుంది. సిమ్లా సమీపంలోని రామ్‌పూర్‌లో గురువారం తెల్లవారుజామున క్లౌడ్ బరస్ట్‌ అయినట్టు కుండపోత వర్షం కురవడంతో 20 మంది గల్లంతయ్యారు. సమేజ్ ఖడ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్‌ సమీపంలో క్లౌడ్ బరస్ట్ అయినట్టు విపత్తు నిర్వహణ దళానికి సమాచారం వచ్చిందని జిల్లా అధికారులు తెలిపారు. తక్షణమే అక్కడకు విపత్తు నిర్వహణ బృందం, డిప్యూటీ కమిషనర్ అనుపమ్ కశ్యప్, ఎస్పీ సంజీవ్ గాంధీ సహా ఇతర ఉన్నతాధికారులు బయలుదేరి వెళ్లారని వెల్లడించారు. క్లౌడ్ …

Read More »

 గంటలోనే 13 సెం.మీ. వర్షం.. రెడ్ అలర్ట్ జారీ.. 

ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో కురిసిన వర్షాలకు నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఇక, దేశ రాజధాని నగరం ఢిల్లీని బుధవారం సాయంత్రం వరుణుడు వణికించాడు. కేవలం గంటలోనే దాదాపు 13 సెం.మీ. వర్షపాతం నమోదయ్యింది. గురువారం కూడా అత్యంత భారీ వర్షాలకు అవకాశం ఉందన్న భారత వాతావరణ విభాగం.. రెడ్‌ అలర్ట్‌ జారీచేసింది. ఇక, బుధవారం కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమై.. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. సెంట్రల్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్ …

Read More »

పార్లమెంటును కుదిపేసిన ప్రధాని మోదీ ట్వీట్.. ఇంతకీ ఏం పోస్ట్ చేశారంటే?

Modi Tweet: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా చేసిన ఓ ట్వీట్.. అధికార విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారి తీసింది. ఈ అంశం పార్లమెంటులో ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి మధ్య తీవ్ర వాగ్వాదానికి కారణం అయింది. లోక్‌సభలో కులగణనకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై.. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇప్పటికే తీవ్ర దుమారానికి కారణం కాగా.. తాజాగా అనురాగ్ ఠాకూర్ ప్రసంగాన్ని ట్వీట్ చేసిన ప్రధాని మోదీ.. ప్రతీ …

Read More »

నేషనల్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌లో 102 ఉద్యోగాలు.. 

ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న నాబార్డు (National Bank For Agriculture And Rural Development) భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 102 అసిస్టెంట్ మేనేజర్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో 60 శాతం మార్కులతో డిగ్రీ, డిప్లొమా, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే.. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, …

Read More »

దేశంలోనే అతి పొడవైన నాన్ స్టాప్ రైలు.. 

కాలంతో పాటు రైల్వే వ్యవస్థలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.ప్రస్తుతం ఉన్న సాంకేతికతో అధునాతన సౌకర్యాలతో కోచ్‌లు, సెమీ-హైస్పీడ్ రైళ్లు పట్టాలెక్కుతున్నాయి. కొత్త రైలు మార్గాల నిర్మాణం, విమానాశ్రయాల తరహాలో స్టేషన్ల తీర్చిదిద్దుతోన్న కేంద్ర ప్రభుత్వం.. వందేభారత్, వందే సాధారణ్ లాంటి రైళ్లను ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలోని ప్రధాన నగరాల మధ్య నడుస్తోన్న ఈ రైళ్లు తక్కువ సమయంలో ప్రయాణికులను గమ్యానికి చేర్చడమే కాదు.. ఆహ్లాదకరమైన అనుభూతిని అందజేస్తున్నాయి. కాగా, వందేభారత్ కంటే ముందే ప్రారంభమైన ఓ సూపర్ ఫాస్ట్ రైలు కేవలం మూడు స్టేషన్లలో …

Read More »

జీవిత, ప్రమాద బీమాపై జీఎస్టీ ఎత్తేయండి… నిర్మలా సీతారామన్‌కు గడ్కరీ రిక్వెస్ట్

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన 2024-25 వార్షిక బడ్జెట్‌పై అనేక వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జీవిత, వైద్య బీమా పథకాల ప్రీమియంలపై విధించిన జీఎస్టీని ఉప-సంహరించుకోవాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి, సీనియర్ బీజేపీ నేత నితిన్ గడ్కరీ అభ్యర్ధించారు. ఈ మేరకు ఆయన.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ డివిజనల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి వచ్చిన విజ్ఞ‌ప్తి మేరకు ఆర్థిక మంత్రికి ఈ లేఖ రాస్తున్నట్లు గడ్కరీ …

Read More »

161కి చేరిన వాయనాడ్ మృతులు.. వారికోసం రంగంలోకి ఆర్మీ జాగిలాలు

ప్రకృతి ప్రకోపానికి అతలాకుతలమైన కేరళలో సహాయక చర్యలు కొనసాగుతుండగా.. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ వయనాడ్‌లోని మెప్పడిలో నాలుగు గ్రామాలపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకూ 161 మంది చనిపోయారు. శిథిలాల కింద వందల సంఖ్యలో చిక్కుకున్నారు. ఈ బాధితులను కాపాడేందుకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సహా రాష్ట్ర యంత్రాంగం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద, బురద ప్రవాహంలో కొందరు కొట్టుకుపోగా.. శిథిలాల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గల్లంతైన వారికోసం డ్రోన్లు, జాగిలాలతో అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో …

Read More »

ఐటీఆర్ గడువు పొడిగింపుపై.. ఐటీ శాఖ కీలక ప్రకటన.. 

 ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు ఇవాళ్టితో గడువు పూర్తవుతుంది. తమ అకౌంట్ ఆడిట్ అవసరం లేని పన్ను చెల్లింపుదారులందరూ జులై 31, 2024లోపు రిటర్న్స్ సమర్పించాల్సి ఉంటుంది. జులై 30వ తేదీ వరకు 6 కోట్లకుపైగా ట్యాక్స్ పేయర్లు తమ రిటర్నులు ఫైల్ చేసినట్లు ఐటీ శాఖ వెల్లడించింది. అయినప్పటికీ ఇంకా చాలా మంది తమ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉందని తెలుస్తోంది. అయితే, ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో టెక్నికల్ సమస్యలు తలెత్తడం ద్వారా రిటర్న్స్ దాఖలు చేయలేకపోతున్నట్లు గత కొన్ని రోజులుగా ట్యాక్స్ …

Read More »

పెన్షన్ల విషయంలో మోదీ సర్కార్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రూ.2 లక్షలు ఫైన్

Supreme Court: కేంద్ర ప్రభుత్వం వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పథకం అమలు చేయడంలో చేస్తున్న ఆలస్యంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సైన్యంలో పనిచేసి రిటైర్ అయిన సైనిక అధికారులకు వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌ పథకం ప్రకారం.. పింఛను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని తీవ్రంగా మండిపడింది. ఈ వన్ ర్యాంక్ వన్ పెన్షన్లపై నిర్ణయం తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం ఏళ్ల తరబడి జాప్యం చేస్తోందని సుప్రీం కోర్టు తీవ్రంగా విమర్శించింది. ఈ వ్యవహారంలో నరేంద్ర మోదీ సర్కార్‌కు చివరి అవకాశం ఇస్తున్నట్లు …

Read More »

బడ్జెట్‌లో చిన్నారుల కోసం కేంద్రం కొత్త స్కీమ్..

NPS Vatsalya Tax Benefits: 2024 బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. కొత్త స్కీమ్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. పిల్లల భవిష్యత్తు కోసం దీర్ఘకాలం పెట్టుబడి పెట్టాలనుకునే వారి కోసం NPS వాత్సల్య పథకం తీసుకొచ్చారు. 18 సంవత్సరాల లోపు బాలబాలికల పేరిట తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఈ అకౌంట్ తీసుకోవచ్చు. పిల్లలు మేజర్లు అయిన తర్వాత ఈ అకౌంట్ సాధారణ ఎన్‌పీఎస్ అకౌంట్‌గా మారుతుంది. పిల్లల భవిష్యత్ కోసం ముందు నుంచే పెట్టుబడుల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే ఈ స్కీం తీసుకొచ్చారు. …

Read More »