దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన పశ్చిమ బెంగాల్‌లోని ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై ఈ నెల 8 వ తేదీన జరిగిన రేప్, మర్డర్ ఘటనపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా సీరియస్ అయింది. ఇక ఈ హత్యాచార ఘటనపై ఆ రాష్ట్రంలో మొదలైన ఆందోళనలు, నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా బుధవారం అర్ధరాత్రి ఆర్‌జీ కర్ ఆస్పత్రిలోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు.. ఆస్పత్రిలో వీరంగం సృష్టించారు. ఈ ఘటనపై కలకత్తా హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ఈ …
Read More »Tax Deductions: తెలుగు రాష్ట్రాల్లోని వారిపై ఐటీ శాఖ గుర్రు.. నోటీసులు, పెనాల్టీ.. ఐటీఆర్ ఫైలింగ్‌లో ఇలా చేస్తున్నారా?
Tax Notices: ఆర్థిక వ్యవస్థలో పన్ను అనేది చాలా కీలకం. పరిమితికి మించి ఆదాయం ఉన్నట్లయితే వారు ఆదాయపు పన్ను చట్టం కింద టాక్స్ చెల్లించాల్సి వస్తుంది. దీనికి ఆదాయాన్ని బట్టి నిర్దిష్ట శ్లాబ్స్ ఉంటాయి. దాని ప్రకారం అంత శాతం మేర పన్ను కట్టాలి. అయితే ఈ పన్ను తగ్గించుకునేందుకు కొన్ని పెట్టుబడులపై టాక్స్ మినహాయించుకోవడం, తగ్గించుకోవడం చేసుకోవచ్చు. ఇదే అదునుగా కొందరు తప్పుడు డాక్యుమెంట్స్ పెట్టడం లేదా సరైన వివరాలు సమర్పించకుండా టాక్స్ క్లెయిమ్ చేస్తుంటారు. తప్పుడు టాక్స్ డిడక్షన్ (తగ్గింపు) …
Read More »Reliance Share: అంబానీ కంపెనీ అదుర్స్.. అప్పుడు వందల కోట్ల నష్టం.. ఇప్పుడు సీన్ రివర్స్.. దూసుకెళ్తున్న స్టాక్!
Reliance Power Shares: దిగ్గజ పారిశ్రామిక వేత్త, అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ నుంచి చాలానే స్టాక్స్ ఉన్నాయి. అయితే ఇవి ఒకప్పుడు ఒక వెలుగు వెలిగాయి. తర్వాత అనిల్ అంబానీ అప్పుల్లో కూరుకుపోవడంతో దాదాపు చాలా కంపెనీలు దివాలా స్థాయికి కూడా పడిపోయాయి. బ్యాంకులకు అప్పులు చెల్లించలేక ఇబ్బందులు పడ్డారు. తన దగ్గర సంపదేం లేదని ఆయన కూడా చేతులెత్తేశారు. దీంతో ఆయా స్టాక్స్ పడిపోయాయి. కానీ కొంతకాలంగా పరిస్థితి మారిపోతోంది. ఆయన కంపెనీలు క్రమక్రమంగా కోలుకుంటున్నాయి. వ్యాపారాలు మెరుగుపడుతున్నాయి. అంబానీ …
Read More »జమ్మూ కశ్మీర్ సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నేడే షెడ్యూల్
మహారాష్ట్ర సహా నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం మధ్యాహ్నం షెడ్యూల్ విడుదల చేయనుంది. ఈ మేరకు మధ్యాహ్నం 3 గంటలకు మీడియాను సమావేశానికి ఆహ్వానించింది. మహారాష్ట్ర, హరియాణా, ఝార్ఖండ్‌తో పాటు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలను నిర్వహించనున్నారు. సెప్టెంబరు 30లోగా జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు గడువు విధించింది. ఈ నేపథ్యంలో మిగతా మూడు రాష్ట్రాలతో పాటు కశ్మీర్‌లోనూ ఎన్నికలకు ఈసీ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఇక, హరియాణా అసెంబ్లీకి నవంబరు 3తోనూ.. మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబరు …
Read More »14 వేల మంది ఆదివాసీ చిన్నారులతో జాతీయ గీతాలాపన.. గిన్నిస్ రికార్డుల్లోకి భారతీయుడి ఆర్కెస్ట్రా
ప్రపంచ ప్రముఖ సంగీత దర్శకుడు, మూడుసార్లు గ్రామీ విజేత రిక్కీ కేజ్ (Ricky Kej).. స్వాతంత్ర్య దినోత్సవాన్ని (Independence Day) పురస్కరించుకొని అద్భుతమైన వీడియోను రూపొందించారు. పండిట్ హరిప్రసాద్ చౌరాసియా సహా సంగీత దిగ్గజాల సహకారంతో భారత జాతీయగీతం జనగణమనను (National Anthem) వైవిధ్యభరితంగా ఆలపించారు. బ్రిటిష్ ఆర్కెస్ట్రా, 14వేల మంది ఆదివాసీ చిన్నారులతో రూపొందించిన ఈ గీతాలాపన.. గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోను రిక్కీ కేజ్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు. పండిట్ హరిప్రసాద్ …
Read More »ఢిల్లీకి చంద్రబాబు.. హడావిడిగా వెళ్తున్న ఏపీ సీఎం, రేవంత్ కూడా హస్తినలోనే.. ఎందుకంటే!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళుతున్నారు. రెండు రోజుల పాటూ ఆయన హస్తినలో ఉంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం విజయవాడ నుంచి ఢిల్లీకి వెళతారు.. 16, 17న అక్కడే ఉంటారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటూ పలువుర్ని కలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి కేంద్ర సాయం, పెండింగ్ ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో ప్రస్తావించిన వివిధ అంశాల అమలుకు …
Read More »ఉగ్రవాదులకు చెక్ పెట్టేందుకు రంగంలోకి యాంటీ నక్సల్ స్పెషలిస్ట్.. జమ్ముకశ్మీర్ డీజీపీగా ఏపీ క్యాడర్ ఐపీఎస్
జమ్మూకశ్మీర్ శాంతి భద్రతలకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్ముకశ్మీర్‌లో ఈ మధ్య కాలంలో ఉగ్రదాడులు అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉగ్రమూకల దాడులను అరికట్టేందుకు కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన నళిన్ ప్రభాత్‌ను జమ్మూ కశ్మీర్ స్పెషల్ డీజీగా నియమించింది. సెప్టెంబర్ 30వ తేదీ ప్రస్తుతం డీజీగా ఉన్న ఆర్ఆర్ స్వైన్ పదవీ విరమణ చేయనున్నారు. ఆయన రిటైర్‌మెంట్ తర్వాత నళిన్ ప్రభాత్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీచేసింది. …
Read More »మహిళా ఉద్యోగులకు స్వాతంత్య్ర దినోత్సవం కానుక.. ప్రతి నెలా ఒకరోజు నెలసరి సెలవు
Odisha Govt Announced menstrual leave: నెలసరి సమయంలో మహిళలు పడే ఇబ్బందులు ఎలా ఉంటాయంటే సాటి మహిళలే వాటిని అర్థం చేసుకోగలరు. పైపెచ్చు ఉద్యోగం చేసే వారయితే ఆ సమయంలో వచ్చే చిరాకుకు తోడు పని ఒత్తిడి వారిని మరింత చికాకు పెడుతూ ఉంటుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా ఉద్యోగులకు ప్రతి నెలా ఒక రోజు నెలసరి సెలవు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఒడిశాలోని ఉద్యోగినులకు ఆ …
Read More »కోల్‌కతాలో అర్ధరాత్రి అనూహ్య పరిణామం.. వైద్యురాలిపై అత్యాచారం జరిగిన ఆస్పత్రి ధ్వంసం
కోల్‌కతాలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో వైద్యురాలి హత్యాచారం ఘటనపై మహిళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బుధవారం అర్ధరాత్రి 11.55 గంటలకు ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అర్ధరాత్రి మహిళల స్వాతంత్ర్యం’ పేరుతో ఆందోళన చేపట్టారు. ఈ సమయంలో ఆర్జీ కార్ హాస్పిటల్‌పై దాడి చేశారు. ఈ దాడిలో ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డు పూర్తిగా ధ్వంసమైందని పోలీసులు తెలిపారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి లాఠీఛార్జ్ చేసిన పోలీసులు.. టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. నిరసనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులకు గాయాలయ్యాయి. డజన్లుకొద్దీ గుర్తుతెలియని వ్యక్తులు ఆస్పత్రిలోకి చొరబడే …
Read More »జగన్ ఆస్తుల కేసులో సంచలనం.. విచారణ నుంచి తప్పుకున్న సుప్రీం కోర్టు జడ్జి
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఆస్తుల కేసుల విచారణలో కీలక పరిణామం జరిగింది. జగన్ ఆస్తుల కేసులో ప్రమేయం ఉన్న భారతి సిమెంట్ కార్పొరేషన్, జగతి పబ్లికేషన్స్, విజయసాయిరెడ్డిలకు వ్యతిరేకంగా ఈడీ దాఖలుచేసిన కేసు విచారణ నుంచి జస్టిస్ సంజయ్‌కుమార్ తప్పుకొన్నారు. గతంలో తెలంగాణ హైకోర్టు జగన్ ఆస్తుల కేసులకు సంబంధించి నమోదైన సీబీఐ కేసుల్లో తీర్పు వెలువడిన తర్వాతే ఈడీ కేసుల్లో తీర్పులు ఇవ్వాలని ఆదేశించింది. సీబీఐ, ఈడీ కేసులను విడివిడిగా లేదా సమాంతరంగా విచారించినా ఆ పద్థతినే అనుసరించాలని తెలిపింది. …
Read More »