టెక్నాలజీ

తీగలాగితే డొంక కదులుతోంది.. ఇకపై ఆటలు సాగవంటున్న సైబర్ పోలీసులు!

సైబర్ క్రైమ్.. ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే. టెక్నాలజీ పెరుగుతున్నట్లుగానే సైబర్ కేటుగాళ్లు సైతం అదే స్థాయిలో రెచ్చిపోతున్నారు. ఈ మోసాలకు చెక్‌ పెట్టేందుకు ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు..తెలంగాణ పోలీసులు. దీంతో కలుగులో దాక్కున్న సైబర్‌ కేటుగాళ్లు..పట్టుబడుతున్నారు.సైబర్‌ కేటుగాళ్లపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు.. తెలంగాణ పోలీసులు. ఆన్‌లైన్‌ ఫ్రాడ్స్‌పై ఓవైపు ప్రజల్లో అవగాహన కల్పిస్తూనే..మరోవైపు నేరాలకు పాల్పడుతున్నవారిని ఎప్పటికప్పుడు అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టిన పోలీసులు..గత రెండు నెలల వ్యవధిలో 161 మంది సైబర్ నేరగాళ్లను …

Read More »

నేటితో ముగియనున్న కుల గణన సర్వే! ఇంకా వివరాలు ఇవ్వని వాళ్లు ఏం చేయాలంటే..

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కుల గణన సర్వే గడువు నేటితో ముగుస్తుంది. ఇంకా పాల్గొనని వారు వెంటనే సర్వేలో పాల్గొనాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ కోరారు. టోల్ ఫ్రీ నంబర్, ఆన్లైన్ పోర్టల్, ఎంపీడీవో కార్యాలయాలు ద్వారా సర్వేలో పాల్గొనవచ్చు.గతంలో జరిగిన కుల గణన సర్వేలో పాల్గొనని వారికి ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 16 నుండి 28 వరకు ఇంతకు ముందు సర్వేలో పాల్గొనని వారి కోసం కుల గణన సర్వే …

Read More »

ప్రధాని నోట ఆదివాసీ మాట.. దేశ వ్యాప్తంగా మారుమోగుతున్న ఆదిలాబాద్ పేరు..!

భారతదేశంలో AI ప్రాధాన్యత పెరుగుతుందని.. మారుమూల గిరిజన గ్రామాల్లోను ఏఐని వినియోగిస్తున్నారని.. అందుకు ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ ఉపాధ్యాయుడు తొడసం కైలాసే నిదర్శనమని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తొడసం కైలాస్.. అడవుల జిల్లా ఆదిలాబాద్, మావల మండలం వాఘాపూర్, గ్రామానికి చెందిన గోండి (భాష) రచయిత.ఆదిలాబాద్ జిల్లా పేరు మరోసారి దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది. ఓ ఆదివాసీ ఉపాధ్యాయుడి చేసిన కృషిని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించడంతో ఆదిలాబాద్ జిల్లా ఆనందంలో మునిగితేలుతోంది. తమ భాష యాసను బ్రతికించుకునేందుకు ఆదివాసీ ఉపాధ్యాయుడు …

Read More »

ఆన్‌లైన్‌లో తత్కాల్ రైల్వే టిక్కెట్లు త్వరగా బుక్‌ కావాలంటే సులభమైన ట్రిక్స్‌

టిక్కెట్లను బుక్ చేసుకునే ముందు యాప్‌ను కనీసం రెండుసార్లు తెరిచి, మీ గమ్యస్థానాన్ని సెర్చ్‌ చేయండి. తద్వారా మీరు టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి యాప్‌ను తెరిచిన వెంటనే మీరు వెతుకుతున్న ప్రదేశాలు కనిపిస్తాయి. ‘తత్కాల్’ ఎంపికను ఎంచుకుని గమ్యస్థానాన్ని ఎంచుకోవడానికి ‘సెర్చ్‌’ బటన్‌పై క్లిక్ చేయండి.. తత్కాల్ టిక్కెట్లు అనేవి అత్యవసర లేదా చివరి నిమిషంలో ప్రయాణాలకు తక్కువ సమయంలో బుక్ చేసుకోగల రైలు టిక్కెట్లు. అయితే, అధిక డిమాండ్ కారణంగా IRCTC రైల్ కనెక్ట్ యాప్‌ని ఉపయోగించి ఆన్‌లైన్‌లో తత్కాల్ టిక్కెట్లను బుక్ …

Read More »

ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక యూపీఐ ద్వారా పీఎఫ్‌ విత్‌డ్రా!

ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత వినియోగదారులు డిజిటల్ వాలెట్ నుండి డబ్బును సులభంగా బదిలీ చేయగలరు. దీని ప్రాసెసింగ్‌లో తక్కువ సమయం పడుతుంది. చందాదారులకు మెరుగైన సౌకర్యం లభిస్తుంది. దీని వలన బ్యాంకింగ్ వివరాలు, ధృవీకరణకు సంబంధించిన ఇబ్బంది కూడా తప్పుతుంది.. దేశంలోని అన్ని రంగాలలో పనిచేస్తున్న లక్షలాది మందికి శుభవార్త వచ్చింది. EPFO ​చందాదారులు ఇకపై తమ PF ఖాతా నుండి డబ్బును ఉపసంహరించుకోవడానికి పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు. వారు UPI ద్వారా PF డబ్బును ఉపసంహరించుకోవచ్చు. …

Read More »

రేషన్ కార్డులపై బిగ్ అప్‌డేట్.. ఇది తెలిస్తే ఎగిరి గంతేస్తారు..

రాష్ట్రమంతటా కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన అర్జీలు, కులగణనతో పాటు గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులు, మీ-సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలన్నారు.రాష్ట్రమంతటా కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన అర్జీలు, కులగణనతో పాటు గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులు, మీ-సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలన్నారు. అర్హులైన …

Read More »

మీ వద్ద చిరిగిపోయిన నోట్లు ఉన్నాయా..? కొత్త నోట్లను పొందడం ఎలాగంటే..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమాల ప్రకారం.. మీరు మ్యుటిలేట్ చేసిన నోట్లను కలిగి ఉంటే, మీరు వాటిని మార్చుకోవాలనుకుంటే మీరు ఏదైనా బ్యాంకుకు వెళ్లి ఈ పనిని చేయవచ్చు. మీరు మీ స్వంత బ్యాంకు మీ స్వంత శాఖను సందర్శించాలి. అయితే మీ వద్ద ఉండే పాత నోట్లను తీసుకునేందుకు బ్యాంకు..చాలా మంది దగ్గర పాత నోట్లు ఉంటాయి. అందులో చిరిగిపోయినవి.. లేక పూర్తిగా పాతబడినవి ఉంటాయి. అలాంటి చిరిగిపోయిన, పాతబడిపోయినా, లేదా నోట్లకు కలర్స్‌ అంటుకుంటే మార్కెట్లో తీసుకునేందుకు ఇష్టపడరు. దీంతో …

Read More »

 ప్రైవేట్ రంగ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..? ఈపీఎఫ్ వడ్డీ రేటు కొనసాగింపు

భారతదేశంలో జనాభాకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్య కూడా ఎక్కువ. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు ఆర్థిక భద్రతను కల్పించేందుకు కేంద్రం ఈపీఎఫ్ఓ ద్వారా పొదుపు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల పొదుపుపై ఇచ్చే వడ్డీ రేట్లను సవరిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో నూతన ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఫిబ్రవరి 28న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో ఈపీఎఫ్ఓ ​​2024-25 సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్ల …

Read More »

భారత వైమానిక దళంలో బ్రహ్మాస్త్రం.. F-35 ఫైటర్ జెట్స్‌తో మరింత బలోపేతం!

గగనతలం నుంచి సాగించే యుద్ధాల్లో ఆధిపత్యం ప్రదర్శించడంతో పాటు శత్రువుకు అత్యధిక నష్టాన్ని కలగజేయడం కోసం F-35 యుద్ధ విమానాలను రూపొందించారు. సింగిల్-సీట్, సింగిల్-ఇంజిన్‌తో కూడిన ఈ ఫైటర్ అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో సమర్థవంతంగా పనిచేయగల్గిన మల్టీరోల్ యుద్ధ విమానం.భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అగ్రరాజ్యం అమెరికా పర్యటనలో యావత్ ప్రపంచాన్ని ఆకర్షించి చర్చనీయాంశంగా మార్చింది ఒకే ఒక్క అంశం. అది ప్రపంచంలోని అగ్రశ్రేణి స్టెల్త్ ఫైటర్ జెట్లలో ఒకటైన లాక్‌హీడ్ మార్టిన్ F-35 లైటెనింగ్-II రకం యుద్ధ విమానాలను భారత్‌కు …

Read More »

మీ క్రెడిట్‌ స్కోర్‌ తగ్గిపోయిందా..? ఈ ట్రిక్స్‌తో పెంచుకోండి!

ప్రతి ఒక్కరికి క్రెడిట్‌ స్కోర్‌ చాలా ముఖ్యం. క్రెడిట్‌ స్కోర్‌ లేకుంటే బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవడం చాలా కష్టం. ఏదైనా రుణం తీసుకోవాలన్నా క్రెడిట్‌ స్కోర్‌ను చూస్తాయి బ్యాంకులు. అయితే స్కోర్‌ తగ్గితే దానిని పెంచుకునేందుకు కొన్ని ట్రిక్స్‌ ఉన్నాయి. ప్రతి వ్యక్తికి క్రెడిట్ స్కోర్ చాలా ముఖ్యం. మీకు మంచి స్కోర్ ఉంటే, మీకు సులభంగా రుణం లభిస్తుంది. మీకు అత్యవసరంగా పర్సనల్ లోన్ అవసరమైతే క్రెడిట్ స్కోర్ ఉపయోగపడుతుంది. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు తక్కువ వడ్డీ రేట్లకు పెద్ద …

Read More »