పోలీసులు ఎంతలా అరికట్టాలని చూస్తున్నప్పటికీ నగరంలో డ్రగ్స్, గంజాయి పట్టుబడుతూనే ఉంది. మరోసారి పోలీసుల తనిఖీల్లో రూ.5 కోట్ల విలువైన గంజాయి పట్టుబడింది. హైదరాబాద్‌లోని బాటసింగారంలో భారీగా గంజాయి పట్టుకున్నారు. ఒడిశా, ఏపీ నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తుండగా రూ.5 కోట్ల విలువైన గంజాయి సీజ్ చేశారు పోలీసులు. 934 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుంది ఈగల్ టీమ్. DCM వాహనంలో పండ్ల బాక్స్‌ల మధ్యలో గంజాయిని తరలిస్తూ దొరికిపోయారు. ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితులు పరారయ్యారు. పారిపోయిన …
Read More »ఇరకాటంలో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు? గ్రూప్ 1 ఫలితాలు ఎంత పనిచేశాయ్..
రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 144 మండల పరిషత్ అభివృద్ధి అధికారు (ఎంపీడీవో)ల పోస్టులు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. కొత్తగా ఏర్పడిన 32 మండలాలకు సైతం ఇప్పటి వరకు ఎంపీడీవో పోస్టులు మంజూరు.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 144 మండల పరిషత్ అభివృద్ధి అధికారు (ఎంపీడీవో)ల పోస్టులు …
Read More »నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం… స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక చర్చ
తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం ఈరోజు జరగనుంది. మధ్యాహ్నం 2గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రిమండలి భేటీ కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ బిల్లు, గో సంరక్షణ విధివిధానాలపై మంత్రిమండలి చర్చించనుంది. — ప్రైవేట్ క్యాబ్ సేవలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావడంపైనా మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. కులగణన, రేషన్‌కార్డుల పంపిణీ, యూరియా నిల్వలు, సాగునీటి ప్రాజెక్టులపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. కాళేశ్వరంపై నివేదిక అందితే దానిపైనా చర్చించే …
Read More »బోగస్ పింఛన్లకు చెక్!..ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి – ప్రభుత్వ కీలక ఆదేశాలు!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోగస్ పింఛన్లపై ఫోకస్ పెట్టింది. వృద్ధులు, అర్హులైన లబ్దిదారులకు మాత్రమే పింఛన్లు అందేలా చూసేందుకు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఇకపై పింఛన్ పొందే ప్రతి ఒక్కరికి ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 29నుంచి రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ దారుల ఫేస్ రికగ్నిషన్ నమోదు ప్రక్రియ మొదలుకానుంది. ఇందుకోసం సెర్చ్ సంస్థ, డీఆర్డీవోలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాయి. బ్రాంచ్ పోస్టుమాస్టర్లకు అవసరమైన స్మార్ట్ ఫోన్లు, బయోమెట్రిక్ పరికరాలు పంపిణీ చేయాలని సూచించగా, ఇవి అందుబాటులో …
Read More »నిరుద్యోగులకు మరో ఛాన్స్… ఆర్‌ఆర్‌బీ రైల్వే పోస్టులకు దరఖాస్తు గడువు పెంపు! ఎప్పటివరకంటే?
రైల్వే రీజియన్లలో ఖాళీలగా ఉన్న టెక్నీషియన్ గ్రేడ్-1, గ్రేడ్-3 పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు గడువు జులై 28వ తేదీతో ముగియనుంది. తాజాగా ఈ తుది గడువును రైల్వేబోర్డు పొడిగిస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటన మేరకు ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్ పోస్టులకు.. దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో ఖాళీలగా ఉన్న టెక్నీషియన్ గ్రేడ్-1, గ్రేడ్-3 పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు గడువు జులై 28వ తేదీతో …
Read More »ఐబొమ్మకు మూడిందా..? రంగంలోకి పవన్ ఫ్యాన్స్
పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వచ్చిన తొలి సినిమా ‘హరి హర వీరమల్లు’ పైరసీ బారిన పడింది. సినిమా విడుదలై మూడురోజుల్లా కాకముందే Ibomma, Movierulz లాంటి వెబ్‌సైట్లలో లీక్ కావడంతో తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం హరిహర వీరమల్లు ఇప్పుడు పైరసీ బారిన పడింది. పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత థియేటర్లలో విడుదలైన మొదటి సినిమా ఇదే కావడంతో.. …
Read More »స్వాధీనం చేసుకున్న కారుపై ఎంపీ స్టిక్కర్… కొండాపూర్ రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్
హైదరాబాద్‌లోని కొండాపూర్ రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్ వెలుగు చూసింది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న కారుపై ఎంపీ స్టిక్కర్ దర్శనమిచ్చింది. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. రేవ్‌పార్టీ నిందితులకు రాజకీయంగా సంబంధాలు ఉన్నాయా అనేదానిపై పోలీసులు ఎంక్వైరీ చేశారు. స్టిక్కర్‌పై దర్యాప్తు చేపట్టిన పోలీసులు అది నకిలీదని నిర్ధారించారు. టోల్ చార్జీ కట్టకుండా తప్పించుకునేందుకే కారుకు ఎంపీ స్టిక్కర్ వేసుకున్నట్టు గుర్తించారు. ఎంపీ స్టిక్కర్ ఫేక్ అని ఎక్సైజ్ అధికారులు తేల్చారు. సీజ్ చేసిన కారు అశోక్ నాయుడిదిగా గుర్తించారు. ఆదివారం కొండాపూర్ SV …
Read More »ఏపీ, తెలంగాణలో వెదర్ రిపోర్ట్ ఇదిగో.. వచ్చే 3 రోజులు నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలు..
ఏపీలో నేడు రేపు, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అవకాశముంది. మిగతా జిల్లాలో చెదురుమదురుగా వానలు పడతాయి గోదావరి, కృష్ణా నది వరద ప్రవాహం పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. ఆగ్నేయ దిశలో తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతుంది.ఈ ప్రభావంతో ఇవాళ, రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తారు …
Read More »చిన్నారిపై లైంగిక దాడి.. కామాంధుడికి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష..
చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన కామాంధుడికి కోర్టు కఠిన శిక్ష విధించింది. ఇంటిబయట ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి మాయమాటలు చెప్పిన అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పక్కా ఆధారాలతో నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో అతడిని కఠిన శిక్ష విధించింది. దేశంలో ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం ఏదో ఓ చోట మహిళలు, ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. నిర్భయ, పొక్సో వంటి చట్టాలను సైతం కామాంధులు లెక్క చేయడం …
Read More »బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ఆర్డినెన్స్ – సస్పెన్స్ ఎందుకో తెలుసా?
తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బీసీ వర్గాల కోసం పెంచిన రిజర్వేషన్లను అమలు చేయాలని ఆలోచిస్తోంది. ఈ దిశగా పంచాయతీరాజ్ చట్టం, 2018కి సవరణలు చేయాలని నిర్ణయించి, తగిన ఆర్డినెన్సు ముసాయిదాను సిద్ధం చేసింది. జులై 11న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ విషయంపై నిర్ణయం తీసుకుని, ఆర్డినెన్సును గవర్నర్ ఆమోదానికి జులై 15న పంపించారు. అయితే గవర్నర్ జిష్ణదేవ్ పర్మ ఆ ఫైల్‌ను సమగ్రంగా పరిశీలించి, …
Read More »