తెలంగాణ

స్పెషల్‌ ఆపరేషన్‌ చేపట్టిన ఏసీబీ.. 18 బృందాలతో కొనసాగుతున్న సోదాలు..!

హైదరాబాద్‌లో స్పెషల్‌ ఆపరేషన్‌ చేపట్టింది అవినీతి నిరోధక శాఖ. 18 బృందాలుగా విడిపోయిన ఏసీబీ అధికారులు స్పెషల్‌ ఆపరేషన్‌ చేపట్టారు. విద్యుత్ శాఖలో పలువురు ఉన్నతాధికారులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ రంగంలోకి దిగింది. అందులో భాగంగా హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాలతో పాటు వివిధ జిల్లాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. మణికొండలో ఏడీఈగా విధులు నిర్వహిస్తున్న అంబేద్కర్ నివాసం, ఆయన బంధువుల నివాసాలతోపాటు ఆయన విధులు నిర్వహిస్తున్న కార్యాలయంలో సైతం సోదాలు చేపట్టారు. ఉదయం 5గంటల …

Read More »

తెలుగు రాష్ట్రాల్లో వైద్య సేవలకు బ్రేక్.. నిలిచిన ఆరోగ్య శ్రీ.. అసలు విషయం ఇదే..!

తెలుగు రాష్ట్రాల్లో ప్రజా ఆరోగ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌ అయ్యాయి. తెలంగాణలో ఇవాళ్టి నుంచి సేవలు నిలిచిపోనున్నాయి. బకాయిలు చెల్లించకపోవడంతో OPD సేవలు నిలిపివేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఆస్పత్రులు ప్రకటించాయి. ప్రభుత్వం నుంచి బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. వారంలోగా సమస్య పరిష్కరించాలంటూ వైద్య సేవ సీఈవోలకి లేఖ రాశారు ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కింద సేవలందించే ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ ఓపీ సేవలను నిలిపివేశాయి. తమకు …

Read More »

బలహీనపడిన అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. మంగళవారం వెదర్ రిపోర్ట్ ఇదిగో..

బంగాళాఖాతంలో అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు మళ్లీ విరుచుకుపడుతున్నాడు. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.. దీంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.. అల్పపీడనం బలహీనపడిందని.. దీని ప్రభావతంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడనం తూర్పు తెలంగాణ సమీపంలోని విదర్భ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతుంది.. సముద్రమట్టం నుండి 3.1 కి మీ ఎత్తువరకు కొనసాగుతూ.. ఉపరితల ఆవర్తనం ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి …

Read More »

కోరుకున్నచోటే ఆధార్ సెంటర్లు! పోస్టాఫీస్ కొత్త ప్లాన్ సూపర్!

హైదరాబాద్ లోని మలక్ పేట, నాంపల్లి వాసులకు గుడ్ న్యూ్స్.. ఇకపై ఆధార్ అప్ డేట్, నమోదు వంటి సేవల కోసం ఎక్కడికి వెళ్లే పని లేదు. పోస్టాఫీస్ స్టాఫ్ మీ స్ట్రీట్ కే వచ్చి ఆధార్ సేవలు అందిస్తారు. అంతేకాదు అప్లై చేసుకున్న చోట సెంటర్లు ఏర్పాటు చేస్తారు. మరిన్ని వివరాలు మీ కోసం.. దేశవ్యాప్తంగా ఆధార్‌ అప్ డేట్ అనేది పెద్ద సమస్యగా మారింది. ఆధార్ అప్ డేట్ కోసం బ్యాంకుల ముందు , ఆధార్ సెంటర్ల ముందు జనం క్యూలు …

Read More »

నిరుద్యోగులకు భలే న్యూస్..! అంగన్‌వాడీల్లో 15,274 ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌ త్వరలో

రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన అంగన్‌వాడీ సిబ్బంది నియామకాల భర్తీకి సంబంధించి ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న పద్ధతులపై సర్కార్ దృస్టిసారించింది. దక్షిణాది రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను శిశు సంక్షేమశాఖ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదించింది. అంగన్వాడీ టీచర్ల నియామకాలకు సంబంధించి.. తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో భారీ సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటిని త్వరలోనే భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంగన్‌వాడీల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా పదోన్నతులు, ఉద్యోగ విరమణతో ఏర్పడిన ఖాళీల …

Read More »

భారీ వర్షంతో అతలాకుతలం.. హైడ్రా విలువ ఇప్పుడు ప్రజలకు తెలిసి వస్తోంది: రంగనాథ్‌ కీలక వ్యాఖ్యలు..

కుండపోత వర్షం హైదరాబాద్‌ని షేక్‌ చేసింది. ఆదివారం రాత్రి ఫ్లాష్‌ఫ్లడ్స్‌.. వల్ల అనేక కాలనీలను ముంచెత్తాయి. ఆసిఫ్‌నగర్‌ మాంగర్‌బస్తీలో ఇద్దరు కొట్టుకుపోవడం… స్థానికంగా కలకలం రేపుతోంది. దాంతో, జిల్లా కలెక్టర్‌తోపాటు హైడ్రా కమిషనర్‌ రంగంలోకి దిగారు. మాంగర్‌బస్తీలో తిరుగుతూ అక్కడి పరిస్థితిని పరిశీలించారు. మరోసారి అలాంటి ప్రమాదం జరగకుండా ఏం చేయాలో యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధంచేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో నాలాల కబ్జాపై హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మాంగర్‌బస్తీలోనే కాదు.. చాలాచోట్ల నాలాలు కబ్జాలో ఉన్నాయన్నారు. మాంగర్‌బస్తీలాంటి ఘటనలు జరగకూడదనే …

Read More »

తెలంగాణలో నేటి నుంచి ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్.. కారణం ఇదే

ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలతో తెలంగాణ ప్రభుత్వం కీలక చర్చలు నిర్వహించింది. చర్చలు సానుకూలంగా జరిగాయని.. బంద్‌ను విరమించాలని ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలను కోరినట్లు ప్రకటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి. ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు పూర్తయినట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు సానుకూలంగా జరిగినట్లు వెల్లడించారు. చర్చల్లో భాగంగా విద్యాసంస్థల యాజమాన్యాలను సమ్మె విరమించాలని కోరినట్లు భట్టి పేర్కొన్నారు. విద్యాసంస్థల యాజమాన్యాల సమస్యలపై …

Read More »

‘పార్టీ మారినా, భావజాలం మారలేదు..’ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంటర్వ్యూ హైలెట్స్

తాను పార్టీ మారినా, భావజాలం మాత్రం మారలేదని బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. ఖాకీ, ఖద్దర్ రెండూ తనకు సమానమని, ఏ వేదికలో ఉన్నా సరైన దిశలోనే ముందుకు సాగుతానని తెలిపారు. బహుజన వర్గాల హక్కుల కోసం పోరాటం తన జీవిత లక్ష్యమని, చివరి శ్వాస వరకు అదే దిశగా కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణ రాజకీయాల్లో కొత్త దిశగా అడుగులు వేస్తున్న మాజీ IPS అధికారి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్.. తన ప్రయాణం, తన ఆలోచనలను టీవీ9 తెలుగు మేనేజింగ్ …

Read More »

తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్.. త్వరలోనే తక్కువ ధరకే కాశి, అయోధ్యలను చుట్టేయండి..

తిరుమల తిరుపతి, శ్రీశైలం, విజయవాడ వంటి పుణ్య క్షేత్రాలను వెళ్లేందుకు.. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి RTC బస్సులు పర్యాటకులకు నిరంతరం అందుబాటులో ఉన్నాయి. దీంతో అప్పటికప్పుడు ఈ క్షేత్రాలకు వెళ్లేందుకు కూడా రెడీ అవుతూ ఉంటారు. అయితే కాశి , అయోధ్య వంటి పుణ్యక్షేత్రాలను చూడాలని ఉన్నా.. ముందుగా రైల్వే రిజర్వేషన్ చేయించుకోవాలి. తర్వాత ఆయా ప్రదేశాల్లో సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలి. ఇది అందరికీ సాధ్యం అయ్యే విషయం కాదు.. దీంతో TGSRTC సరికొత్త ఆలోచనలో ముందు కొచ్చింది. త్వరలో అయోధ్య, వారణాసి …

Read More »

లక్కీ భాస్కర్‌ను మించిపోయావ్ కదా మావ.! కిలోల బంగారం హుష్ కాకి..!

ప్రజల్లో ప్రభుత్వ బ్యాంకులపై నమ్మకాన్ని వమ్ము చేసే ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో ఎస్‌బీఐ గోల్డ్ లోన్ గోల్‌మాల్ ఘటన మరువక ముందే నిర్మల్ జిల్లాలోని ఎస్‌బీఐలో మరో గోల్డ్ లోన్ గోల్ మాల్ వ్యవహారం బట్టబయలైంది. సేమ్ టూ సేమ్ ఇక్కడ కూడా ఆడిట్‌లోనే అక్రమాల భాగోతం బయటపడింది. నిర్మల్ లోనూ ఇంటి దొంగే బ్యాంకుకు కన్నం వేసి 20 లక్షల రూపాయలకు పైగా స్కామ్‌కు పాల్పడ్డాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరో బ్యాంకు మోసం బట్టబయలైంది. మంచిర్యాల …

Read More »