తెలంగాణ

క్యారకల్ – ఐకామ్ భాగస్వామ్యంతో అత్యాధునిక చిన్న ఆయుధాల తయారీ కేంద్రం ప్రారంభం

యుఎఇకి చెందిన ప్రముఖ చిన్న ఆయుధ తయారీదారు, EDGE గ్రూప్‌లోని ఒక సంస్థ అయిన క్యారకల్, మేఘా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) గ్రూప్ కంపెనీ అయిన ఐకామ్ టెలి లిమిటెడ్‌తో కలిసి హైదరాబాద్‌లోని ఐకామ్ ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ ఫెసిలిటీలో ప్రపంచ స్థాయి చిన్న ఆయుధ తయారీ సౌకర్యాన్ని ప్రారంభించాయి.దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషించే ప్రపంచ శ్రేణి చిన్న ఆయుధాల తయారీ కేంద్రాన్ని మేఘా ఇంజనీరింగ్ అండ్  ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL ) గ్రూప్ సంస్థ ఐ కామ్ సోమవారం …

Read More »

మాజీ మంత్రి కేటీఆర్‌కు బిగ్‌ రిలీఫ్.. ఆ కేసులో FIR కొట్టివేసిన హైకోర్టు!

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఉట్నూరు పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. అయితే, రూ.లక్షన్నర కోట్లతో చేపడుతోన్న మూసీ ప్రాజెక్ట్ దేశంలో అతిపెద్ద కుంభకోణం అంటూ ఉట్నూర్‌లో జరిగిన ఓ సభలో కేటీఆర్ ప్రస్తావించారు. దేశంలో రాబోయే ఎన్నికలకు కావలసిన నిధుల కోసం కాంగ్రెస్‌ మూసీ ప్రాజెక్టును వాడుకోవాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. అప్పుడు కేటీఆర్ చేసిన ఆరోపణలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. కేటీఆర్ తమ పార్టీ ప్రతిష్ఠను …

Read More »

సై అంటే సై అంటున్న బీజేపీ-ఎంఐఎం.. 22 ఏళ్ల తర్వాత ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక!

22 ఏళ్ల తర్వాత ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరుగుతుండటంతో అందరి చూపు ఇప్పుడే గ్రేటర్ వార్ వైపేనే నెలకొంది. బలాబలాల్లో మజ్లిస్‌కు మొగ్గు ఉన్నా.. వార్ వన్ సైడ్ కాదంటోంది భారతీయ జనతా పార్టీ. ఇంతకీ ఎంఐఎం వర్సెస్ బీజేపీ పోరులో ఫలితం ఎలా ఉండబోతోంది? గాలిపటాన్ని అడ్డుకునేందుకు కమలం ముందున్న దారేది? అన్నదీ తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో 22ఏళ్లుగా మజ్లిస్ పార్టీ ఏఐఎంఐఎం పార్టీకే ఏకగ్రీవం. కానీ ఇప్పుడలా కుదరదంటూ బరిలోకి దిగింది భారతీయ …

Read More »

తెలంగాణలో మళ్లీ గెలిచే పార్టీ ఏది..? అప్పుడే మొదలైన పవర్ పాలిటిక్స్..

తెలంగాణలో మళ్లీ గెలిచే పార్టీ ఏది? అధికారంలోకి వచ్చేది ఎవరు? నేతలు మాత్రం ఇప్పటి నుంచే కర్చీఫ్ వేసుకుంటున్నారు. మళ్లీ సీఎం అయ్యేది తానే అని రేవంత్ అంటుంటే.. కేసీఆర్ సీఎం కావడం చారిత్రక అవసరమని గులాబీ పార్టీ అంటోంది. పవర్ గేమ్‌లో రెండు పార్టీల డైలాగ్ వార్ హాట్‌ టాపిక్‌గా మారింది.తెలంగాణలో మళ్లీ గెలిచే పార్టీ ఏది? అధికారంలోకి వచ్చేది ఎవరు? నేతలు మాత్రం ఇప్పటి నుంచే కర్చీఫ్ వేసుకుంటున్నారు. మళ్లీ సీఎం అయ్యేది తానే అని రేవంత్ అంటుంటే.. కేసీఆర్ సీఎం …

Read More »

ఇంటర్ ఫలితాలు విడుదల ఆ రోజే.. అధికారిక ప్రకటన వచ్చేసింది..

తెలంగాణలో విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డ్ సిద్ధమైంది. ఈ నెల 22న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డ్ తెలిపింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో 22న ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య సహా అధికారులు పాల్గొననున్నారు. …

Read More »

ఐపీఎల్‌లో ఫిక్సింగ్ ఆరోపణలపై క్లారిటీ ఇచ్చిన రాచకొండ సీపీ.. ఏమన్నారంటే?

ఐపీఎల్ 2025లో ఉత్కంఠ మ్యాచ్‌లు సాగుతున్నాయి. ప్రస్తుతం లీగ్‌లో సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ప్లే ఆఫ్స్ చేరే జట్లపైనా ఓ క్లారిటీ వచ్చేసింది. 34 మ్యాచ్‌లు పూర్తయ్యే సరికి ఢిల్లీ జట్టు అగ్రస్థానంలో నిలవగా, పంజాబ్ కింగ్స్ 10 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. అయితే, ఈ క్రమంలో ఓ వార్తతో ఐపీఎల్ ఫ్రాంచైజీలతోపాటు బీసీసీఐలో కలకలం రేపింది. హైదరాబాద్ కేంద్రంగా ఓ బిజినెస్ మెన్ ఫిక్సింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ వార్తలు వినిపించాయి. దీంతో ఒక్కసారిగా అభిమానులు కూడా షాక్ అయ్యారు. తాజాగా దీనిపై …

Read More »

టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 అభ్యర్ధులకు బిగ్‌షాక్‌.. నియామకాలు నిలిపివేస్తూ హైకోర్టు స్టే

తెలంగాణలో ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1 పరీక్ష నియామకాలు సర్వత్రా చర్చకు దారి తీశాయి. ఇప్పటికే దీనిపై టీజీపీఎస్సీ క్లారిటీ ఇచ్చినా.. కొందరు అభ్యర్ధులు హైకోర్టును సంప్రదించారు. దీంతో గ్రూప్ 1 నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయమని హైకోర్టు ఆదేశించింది. విచారణ పూర్తయ్యే వరకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించరాదని సూచించింది. అయితే ప్రస్తుతం నడుస్తున్న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగించవచ్చని పేర్కొంది. ముఖ్యంగా గ్రూప్‌ 1 మెయిన్స్‌ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్‌లో తాము తీర్పు వెలువరించే వరకు నియామక పత్రాలు …

Read More »

మొన్న MBBS.. నేడు ఇంజనీరింగ్‌.. ప్రాంతీయ భాషల్లోకి పాఠ్య పుస్తకాల ముద్రణ షురూ!

గతంలో ఎంబీబీఎస్‌ పాఠ్యపుస్తకాలు, మెడికల్ విద్యను ప్రాంతీయ భాషల్లో ప్రవేశ పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇంజినీరింగ్‌ విద్యలోనూ పలు మార్పులు చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా ఇంజనీరింగ్‌ డిప్లొమా, డిగ్రీ కోర్సులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను ప్రాంతీయ భాషల్లో అందించడానికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) చర్యలు చేపడుతోంది. స్థానిక భాషల్లో ఇంజినీరింగ్‌ పాఠ్య పుస్తకాలను అందించడానికి కసరత్తు చేస్తోంది. వివిధ విభాగాల్లో ఇప్పటికే కార్యచరణ ప్రారంభించారు కూడా. తద్వారా ప్రాథమిక, హైస్కూల్‌ విద్యను మాతృభాషలో చదువుకుని ఇంజినీరింగ్‌లో ఆంగ్లమాధ్యమంతో …

Read More »

నేడే జేఈఈ మెయిన్‌ తుది ర్యాంకుల విడుదల.. కటాఫ్‌ ఎంత ఉంటుందంటే?

జేఈఈ మెయిన్‌ 2025 తుది విడత ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) గురువారం (ఏప్రిల్ 17) విడుదల చేయనుంది. ఈ ఏడాది జనవరిలో జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షలు జరుగగా.. ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు తుది విడత పరీక్షలు జరిగాయి. ఏప్రిల్‌ 2, 3, 4, 7, 8 తేదీల్లో పేపర్‌-1 (బీఈ/ బీటెక్‌) పరీక్షలు, ఏప్రిల్‌ 9వ తేదీన పేపర్‌-2ఏ, 2బీ (బీఆర్క్‌/బీ ప్లానింగ్‌) ప్రవేశ పరీక్షలు జరిగాయి. అయితే ఈ రెండు విడతల పరీక్షల్లోని …

Read More »

ఇంటర్ సిలబస్ మారిందోచ్..! క్లారిటీ ఇచ్చిన ఇంటర్ బోర్డు!

వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ సిలబస్ మారుతుందన్న ప్రచారంపై తెలంగాణ ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య క్లారిటీ ఇచ్చారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిలబస్ మార్పు నిజమేనంటూ ఆయన తేల్చి చెప్పారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి మారిన సిలబస్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. అయితే పదేళ్ల నుంచి ఒకటే సిలబస్ ఉండటంతో జాతీయ విద్యావిధానంకు అనుగుణంగా మార్పులు చేయడం అనివార్యమైందన్నారు. ఇంటర్ సిలబస్ మార్పుపై సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్స్ కమిటీని గతంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆ కమిటీలో …

Read More »