దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన లాటరీ ప్రక్రియను అధికారులు చేపట్టారు. ఇందుకు సంబంధించి విద్యార్ధుల ఎంపిక జాబితా తాజాగా విడుదలైంది. మార్చి 7 నుంచి 21వరకు ఒకటో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. దరఖాస్తు చేసుకున్న తల్లిదండ్రులు మీ పిల్లలు ఎంపిక జాబితా తెలుసుకొనేందుకు కేవీ సంఘటన్ అధికారిక వెబ్‌సైట్‌ను దరఖాస్తు చేసిన సమయంలో వినియోగించిన మొబైల్ నంబర్/ఈ-మెయిల్‌కు వచ్చిన లాగిన్ కోడ్, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, క్యాప్చా …
Read More »అసెంబ్లీకి రానివారికి జీతం ఎందుకు..? తెలుగు రాష్ట్రాల సీఎంలు ఫైర్..
ప్రజల పక్షాన పనిచేసేందుకు అసెంబ్లీకి రానివారికి జీతం ఎందుకు దండగ అంటున్నారు తెలుగు రాష్ట్రాల సీఎంలు. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకుంటున్నారని చంద్రబాబు, స్పీకర్ విమర్శిస్తే..తెలంగాణలో కేసీఆర్ తీరును ఎండగట్టారు సీఎం రేవంత్. ఆ వివరాలు ఇలా..ప్రజా ప్రతినిధులంటే ప్రజా సేవకులు.. వారుకూడా ఒకవిధంగా ప్రభుత్వ ఉద్యోగులే.. ప్రజలు కట్టే పన్నుల నుంచి ప్రతి నెలా జీత భత్యాలు తీసుకునే వారు ఎన్నుకున్న ప్రజల కోసం అసెంబ్లీ సమావేశాలకి రాకపోతే ఎలా? అనే ప్రశ్న అసెంబ్లీలో లేవనెత్తారు సీఎం చంద్రబాబు, …
Read More »అన్నదాతలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. రైతు భరోసాకు ఎన్ని వేల కోట్లు కేటాయించారో తెలుసా?
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది ఫిబ్రవరిలో తొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అయితే ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసింది. అన్ని సంక్షేమమే తమ ధ్యేయంగా ముందుకు సాగింది. రాష్ట్రంలో రైతులకే కాకుండా ఇతర రంగాల వారికి కూడా అధిక బడ్జెట్‌ను కేటాయించినట్లు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తన ప్రసంగంలో వెల్లడించారు. మరి ఈ బడ్జెట్‌లో ఏ రంగానికి ఎంత బడ్జెట్ కేటాయించారో చూద్దాం.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో ఆర్థిక శాఖ …
Read More »ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత: భట్టి విక్రమార్క
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ మొత్తం రూ.3 లక్షల కోట్లు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి.. తెలంగాణ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 3 లక్షల 4 వేల 965 కోట్లతో బడ్జెట్‌కు రూపకల్పన చేశారు. తెలంగాణ సుస్థిర అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో …
Read More »నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రెవెన్యూలో 10,954 గ్రామస్థాయి పోస్టులు వస్తున్నాయ్!
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం (మార్చి 19) శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఇందులో విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్ర భట్టి ఇచ్చన బడ్జెట్ ప్రసంగంలో పలు కీలక అంశాలు ప్రస్తావించారు. ముఖ్యంగా రాష్ట్ర నిరుద్యోగులకు..తెలంగాణ శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం (మార్చి 19) ప్రవేశ పెట్టారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత ప్రవేశ పెట్టిన రెండో బడ్జెట్ ఇది. ఇందులో విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమానికి …
Read More »నీట్ పీజీ పరీక్ష తేదీ వచ్చేసిందోచ్.. పూర్తి షెడ్యూల్ ఇదే?
పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (పోస్ట్ గ్రాడ్యుయేట్) NEET-PG 2025 పరీక్షను రెండు షిఫ్టులలో నిర్వహించాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా కంప్యూటర్ ఆధారిత ప్లాట్‌ఫామ్‌పై ఆన్‌లైన్ విధానంలో NEET-PG 2025ను నిర్వహిస్తుందని తెలిపింది. బోర్డు ఇలా NEET-PG పరీక్షను రెండు షిఫ్టులలో నిర్వహించడం ఇది రెండోసారి కావడం గమనార్హం..నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ – పోస్ట్‌గ్రాడ్యుయేట్ (నీట్ పీజీ) 2025 పరీక్ష …
Read More »పోసాని కృష్ణమురళికి మరో షాక్… ఉద్యోగం పేరుతో రూ.9 లక్షలు కాజేశాడని టీడీపీ కార్యాలయంలో కంప్లైంట్
టీడీపీ కేంద్ర కార్యాలయంలో పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదు చేశారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం కల్లూరుకు చెందిన కె. సత్యనారాయణ శెట్టి సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చారు. పోసాని కృష్ణమురళీ, మహేశ్ అనే వ్యక్తులు వైసీపీ ప్రభుత్వం హయాంలో తనకు ఉద్యోగం ఇప్పిస్తానని రూ. 9 లక్షలు తీసుకొని మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై గచ్చిబౌలిలో కేసు పెట్టినా తనకు ఎటువంటి న్యాయం జరగలేదని చెప్పారు. డబ్బులు మోసపోవడంతో ఐదేళ్లనుండి తన …
Read More »పిట్ట కొంచెం.. కూత ఘనం.. సీఎం నారా చంద్రబాబు మనుమడు రికార్డును తిరగ రాసిన బుడుతడు..
బాలల మేధో వికాసానికి చదరంగం ఎంతో దోహదపడుతుంది. ఈ చదరంగంలో కొందరు బాలలు అద్భుతాలు సృష్టిస్తున్నారు. చదరంగంలో సరికొత్త ప్రపంచ రికార్డును సాధించి నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించాడు ఓ బుడతడు.180 బోర్డులపై వేగంగా పావులు కదుపుతూ 5,334 ప్రాబ్లమ్స్, కాంబినేషన్స్ అండ్ గేమ్స్ ఇన్ లాస్లో పోల్గారు ను విజయవంతంగా పూర్తి చేసి నోబెల్ ప్రపంచ రికార్డుల్లో చోటు సంపాదించాడు. అయితే ఈ రికార్డు ఇప్పటి వరకూ ఓ సీఎం మనవడి పేరిట ఉండగా.. ఆ రికార్డును తిరగరాశాడు …
Read More »తెలుగు యూనివర్సిటీ పేరు మార్పుపై రగడ.. పెళ్లుబికిన ఆగ్రహం
తెలుగు యూనివర్సిటీకి ఉన్న పొట్టి శ్రీరాములు పేరును తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్‌లోని శ్రీరాములు జయంతి సందర్భంగా కేంద్ర బండి సంజయ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు గొప్ప దేశభక్తుడు. అలాంటి మహనీయుని పేరును తొలగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు..ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు త్వరలో మారనుంది. బదులుగా ప్రముఖ తెలంగాణ కవి సురవరం ప్రతాప్‌రెడ్డి పేరును ఆ …
Read More »ఎండలు మండిపోతున్నాయ్ బాబోయ్.! ఏయే జిల్లాల్లో అత్యధికం అంటే.?
మార్చిలోనే మాడు పగులతోంది. ఇక ఏప్రిల్, మేలో పరిస్థితి ఎలా ఉంటుందో. ఊహించుకుంటేనే భయం వేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఎలా ఉన్నాయి. ఏ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు.? వాతావరణశాఖ హెచ్చరికలు ఏంటో చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం తొమ్మిది దాటితే చాలు.. ఎండవేడిమికి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. రెండు రాష్ట్రాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. ఒకవైపు ఎండవేడిమి, మరోవైపు ఉక్కపోతతో చుక్కలు చూస్తున్నారు. అత్యవసర పనుల కోసం బయటకు వచ్చేవారు.. వేడి గాలులకు తీవ్ర …
Read More »