తెలంగాణలో సంచలన సృష్టిస్తోన్న ఫార్ములా-E రేస్ కేసులో మరోసారి ఐఏఎస్ అరవిందు కుమార్‌కు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కేసులో అరవింద్ కుమార్ పలుమార్లు ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. అరవింద్ కుమార్ నుండి ఏసీబీ అధికారులు ఈ కేసుకు సంబంధించి కీలక సమాచారాన్ని గతంలో రాబట్టారు. ఆయన స్టేట్‌మెంట్లను సైతం ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. తాజాగా మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అయితే కొద్ది రోజులపాటు సెలవు నిమిత్తం అరవింద్ …
Read More »హైదరాబాద్‌లోనే జగన్నాథుడి దర్శనం.. పూరి వెళ్ళలేనివారికి బెస్ట్..
పూరి.. చార్‌ధామ్ యాత్రలో ఒకటి. అయితే హైదరాబాద్ వాసులు చాలామంది దూరం, బడ్జెట్ కారణంగా వెళ్లలేకపోతున్నారు. అలాంటి వారికోసం ఆ జగన్నాథుడు భాగ్యనగరంలో కూడా దర్శనం ఇస్తున్నాడు. మరి హైదరాబాద్‌లో పూరి జగన్నాథ ఆలయం ఎక్కడ ఉంది.? ఈ టెంపుల్ చరిత్ర ఏంటి.? హైదరాబాద్‌లోని శ్రీ జగన్నాథ ఆలయం కళింగ కల్చరల్ ట్రస్ట్ అద్భుతమైన సృష్టి. ఈ పవిత్ర స్థలం ప్రజల మనస్సులలో హృదయాలలో దైవిక ఆలోచనలను రేకెత్తిస్తుంది. ఇది అచ్చం పురిలో ఉన్న టెంపుల్ మాదిరిగానే ఉంటుంది. పూరి వెళ్లలేము అనుకునేవారికి ఇది మంచి ఎంపికనే చెప్పవచ్చు. …
Read More »పవన్ కల్యాణ్‌పై అనుచిత పోస్టులు.. ఏపీ, తెలంగాణకు చెందిన ముగ్గురు అరెస్ట్..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత పోస్టులు పెట్టిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. విశాఖపట్నంలో యోగా దినోత్సవం సందర్భంగా ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై సోషల్ మీడియలో అనుచిత పోస్టులు పెట్టిన పలువురిపై జనసేన నాయకులు, వపన్ ఫ్యాన్స్ పిఠాపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.. వారి ఫిర్యాదు మేరకు కాకినాడ జిల్లా పిఠాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ పై అనుచితంగా కామెంట్స్ చేసిన వారిని గుర్తించారు. …
Read More »పీఏసీ మీటింగ్‌లో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?
కాంగ్రెస్ అంటేనే నిలదీతలు.. నినాదాలు కామన్. కానీ మంగళవారం జరిగిన పీఏసీ సమావేశంలో ఇవేవీ కనిపించలేదు. అంజన్ కుమార్ లాంటి నేతలు పదవులపై ప్రశ్నిస్తే.. జగ్గారెడ్డి లాంటి నేతలు రేవంత్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తూనే కార్యకర్తలను ఖుషీ చేయాలంటూ సూచనలు చేశారు. మరోవైపు ధర్నా బ్యాచ్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం హాట్‌గా జరిగింది. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తమ సామాజికవర్గమంతా అసంతృప్తిగా ఉందన్నారు. తెలంగాణలో యాదవులకు కీలక పదవులు ఇవ్వలేదన్నారాయన. …
Read More »లెక్క మారింది.. ఆ బాధ్యత అంతా ఇన్‌ఛార్జ్ మంత్రులదే.. సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్..
నీట ముంచినా.. పాల ముంచినా మంత్రులదే బాధ్యత.! ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇకపై ఒకలెక్క. పరిస్థితిని సీరియస్‌గా తీసుకోకుంటే ఏ పరిణామాలకైనా బాధ్యత వహించాల్సిందే. ఇదీ క్లుప్తంగా మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన స్వీట్ వార్నింగ్. అలాగే గట్టుదాటిన పార్టీ నేతలను కూడా ఇకపై ఉపేక్షించేంది లేదని హెచ్చరికలు జారీ చేశారు.18 నెలల పాలనను పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం..స్థానిక ఎన్నికల రూపంలో త్వరలో అసలైన పరీక్షను ఎదుర్కొనబోతోంది. దీంతో పరిపాలన వ్యవస్థను సెట్‌రైట్ చేసే పనిలో పడ్డారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇప్పటికే మూడు …
Read More »స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా, ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో నల్గొండకు చెందిన సర్పంచ్‌ల పిటిషన్ దాఖలైంది. గత ఏడాది అంటే 2024 ఫిబ్రవరి 1వ తేదీతో సర్పంచ్‌ల పదవి కాలం ముగిసింది. కోర్టు ఆదేశాలతో రిజర్వేషన్లు, వార్డు డివిజన్ ప్రక్రియ మొదలు కానుంది. అయితే ప్రక్రియ పూర్తికి 25 రోజుల సమయం కావాలని ఇటీవల …
Read More »తేజేశ్వర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్..! బయటికొచ్చిన సంచలన నిజాలు
గద్వేల్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో కొత్త ట్విస్ట్‌లు బయటపడ్డాయి. తేజేశ్వర్ భార్య ఐశ్వర్య, బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు అరెస్టు అయ్యారు. తిరుమలరావు, ఐశ్వర్య కలిసి 75 వేల రూపాయలకు సుపారీ ఇచ్చి తేజేశ్వర్‌ను హత్య చేయించారని పోలీసులు తెలిపారు. ఐశ్వర్యకు తిరుమలరావుతో గతంలో సంబంధం ఉండేదని, తేజేశ్వర్‌ను హత్య చేసి తిరుమలరావుతో పారిపోవాలని ఐశ్వర్య ప్లాన్ చేసిందని దర్యాప్తులో తేలింది.తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు, ఊహించని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే …
Read More »ఉరుములు, మెరుపులతో అల్లకల్లోలం.. నేడు, రేపు జర భద్రం!
రాష్ట్రంలో పశ్చిమ, నైరుతి దిక్కు నుంచి గాలులు వీయనున్నాయి. ఈ రోజు, రేపు, తెలంగాణ లోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది..పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరంలో సగటు సముద్ర మట్టానికి 5.8 నుండి 7.6 కి.మీ మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దక్షిణ జార్ఖండ్, పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర …
Read More »ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకపై బస్సుల్లో వైఫై
ఈ ప్రతిపాదనలపై ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరాలను అందించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా బస్సులు, బస్టాండ్లు, రవాణాశాఖ కార్యాలయాల్లో వై-ఫై సదుపాయాలను అందించాలని ప్రైవేటు సంస్థ ప్రతిపాదించింది. ఇది సాధారణ ఇంటర్నెట్ యాక్సెస్ కాకుండా.. ముందుగా సెలక్ట్ చేసిన సినిమాలు, సాంగ్స్ వంటి కంటెంట్‌ను ప్యాసింజర్స్ తమ మొబైళ్లలో చూసేలా ఏర్పాటు చేస్తామని పేర్కొంది. వై-ఫై ద్వారా అందించే కంటెంట్ మధ్య అడ్వర్టైజ్‌మెంట్స్ కూడా వస్తాయి. ఈ ప్రకటనల ద్వారా ప్రైవేటు …
Read More »అమ్మ బాబోయ్..! 6 నెలలో ఇంత మంది లంచావతారులు పట్టుబడ్డారా..?
తెలంగాణ అవినీతి నిరోధక బ్యూరో (ACB) అవినీతి ప్రభుత్వ అధికారులపై కఠిన చర్యలను ముమ్మరం చేసింది, గత ఆరు నెలల్లో మొత్తం 122 కేసులు నమోదు చేసింది. ఇది గత సంవత్సరం మొత్తం కేసులను అధిగమించింది. ప్రధాన ట్రాప్ కేసుల్లో GHMC, నీటిపారుదల శాఖ అధికారులు ఉన్నారు. అవినీతికి పాల్పడే అధికారులకు సంబంధించి తమకు సమాచారం ఇవ్వాలని ACB పౌరులను కోరుతుంది.తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు అక్రమార్కులపై దృష్టి సారించారు. ఏసీబీ అధికారులు ఎన్నడూ లేని విధంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో …
Read More »