తెలంగాణ

రేవంత్ సర్కార్‌కు సవాల్..హీరో నాగార్జున?

హైదరాబాద్ మాదాపూర్‌లో హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. అక్రమంగా నిర్మించిన ఎన్ కన్వెన్షన్‌పై చర్యలు తీసుకోవాలని హైడ్రాకు ఫిర్యాదులు రావటంతో ఇవాళ ఉదయం అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. మాదాపూర్‌లో మెుత్తం 10 ఎకరాల్లో N కన్వెక్షన్ నిర్మాణం ఉంది. అయతే 29 ఎకరాల్లో ఉన్న తమ్మిడి కుంట చెరువును ఆక్రమించి ఈ కన్వెన్షన్ నిర్మించినట్లు ఫిర్యాదులు అందాయి. చెరువు ఎఫ్ టీఎల్, బఫర్ జోన్‌ కబ్జా చేసి ఈ కన్వెన్షన్ నిర్మించటంతో హైడ్రా అధికారులు నేలమట్టం …

Read More »

పబ్లిక్‌లో అలా చేస్తే చుక్కలే.. హైదరాబాద్ పోలీసుల వార్నింగ్

ప్రస్తుతం యువత పరిస్థితి ఎలా తయారైందంటే.. ఒక్క పూట తినకుండా అయినా ఉండగలరు కానీ.. సోషల్ మీడియా లేనిదే బతుకు భారమనేలా పరిస్థితి తయారైంది. ఉదయం లేచిన దగ్గర నుంచి నేటి యువత సోషల్ మీడియా వెనుక పరుగులు తీస్తున్నారు. పొద్దున లేచింది మొదలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో షార్ట్స్, రీల్స్ అంటూ సెల్‍‌ఫోన్ పట్టుకుని చక్కర్లు కొడుతున్నారు. సరే ఎవరిష్టం వారిది అనుకున్నా.. తమ రీల్స్, షార్ట్స్ లైకుల కోసం మరీ తెగించేస్తున్నారు. ప్రాణాలకు తెగించి రిస్క్ చేసేది కొంతమంది అయితే.. పక్కోడి ప్రాణాలను …

Read More »

చిన్నారులతో నిండిపోయిన ఆస్పత్రులు.. బెడ్లు లేక తీవ్ర ఇబ్బందులు

వర్షాకాలం నేపథ్యంలో.. తెలంగాణలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రధానంగా చిన్నారులు సీజన్ వ్యాధుల బారిన పడుతున్నారు. దీంతో.. చిన్నారులతో ఆస్పత్రులు నిండిపోయాయి. ఏ ఆస్పత్రి చూసినా.. చిన్నపిల్లలతో వార్డులన్ని నిండిపోయాయి. ఈ క్రమంలోనే.. హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రి అయిన నీలోఫర్ హాస్పిటల్‌లోని.. ఎమర్జెన్సీ వార్డులో బెడ్లు లేక పిల్లల తల్లిదండ్రుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓకే బెడ్డుపై ముగ్గురు నలుగురు పిల్లలను వైద్యులు పడుకోబెట్టి వైద్యం చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. దీంతో.. ఒకరి జబ్బు ఇంకొకరికి వచ్చే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం …

Read More »

మార్కెట్‌లోకి కొత్త వైరస్.. తెలంగాణ సర్కార్ అలెర్ట్.. హైదరాబాద్‌లో ఆస్పత్రులు సిద్ధం..!

Monkeypox alert: కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే మానవాళి కోలుకుంటున్న నేపథ్యంలో.. మరో కొత్త వైరస్ (మంకీపాక్స్) వణికిస్తోంది. ఇప్పటికే ఆఫ్రికా దేశాల్లో శరవేగంగా ఈ కొత్త వైరస్ వ్యాపిస్తోంది. మిగతా దేశాలకు కూడా అంతేవేగంగా విస్తరిస్తోంది. ఈ మంకీపాక్స్ (ఎంపాక్స్‌)పై అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ మంకీపాక్స్ వైరస్‌ మన దేశంలోకి రాకుండా అడ్డుకోవటమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని రాష్ట్రాలకు కీలక సూచనలు …

Read More »

సీఎం రేవంత్‌ రెడ్డికి కోర్టు నోటీసులు.. ఆ వ్యాఖ్యలు చేసినందుకు, హైకోర్టు ఎంట్రీతో..!

Revanth Reddy Defamation Case: సీఎం రేవంత్‌ రెడ్డికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే కోర్టు నోటీసులకు కారణమయ్యాయి. అయితే.. హైకోర్టు ఎంట్రీతోనే.. సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి స్పెషల్ జ్యుడిషియల్ ఫస్ట్‌ క్లాస్ మెజిస్ట్రేట్‌ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను వచ్చే నెల 25వ తేదీలోపు అందజేయాలని అధికారులను ధర్మాసనం ఆదేశించింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు వేసిన పరువు నష్టం దావా విచారణలో భాగంగా ఈ ఉత్తర్వులను …

Read More »

‘అందుకు మీ సలహాలు కావాలి’.. CPM నేతలను రిక్వెస్ట్ చేసిన సీఎం రేవంత్‌

తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకు రేయింబవళ్లు కష్టపడి పని చేస్తున్నామన్నారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీపీఎం నేతలు రాఘవులు, జూలకంటి రంగారెడ్డిలతో సీఎం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వ్యక్తిగత పనుల నిమిత్తం రాఘవులు సెక్రటేరియట్‌కు వెళ్లగా.. అక్కడే ఉన్న సీఎం ముఖ్య సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి వారిని రేవంత్ రెడ్డి వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పలు అంశాలపై రేవంత్ సీపీఎం నేతలకు వివరించారు. ఇటీవలె రూ. 2 లక్షల …

Read More »

ట్రైన్ ప్రయాణికులకు అలర్ట్.. హైదరాబాద్ నుంచి వెళ్లే పలు రైళ్లు రద్దు, వివరాలివే..

హైదరాబాద్, సికింద్రాబాద్‌ల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ట్రైన్ ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు అలర్ట్ జారీ చేశారు. పలు ట్రైన్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు. సికింద్రాబాద్, హైదరాబాద్‌ రైల్వే డివిజన్ల పరిధిలో పలు ప్రాంతాల్లో నిర్వహణ పనుల కారణంగా ట్రైన్లు రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించారు. రద్దయిన ట్రైన్ల వివరాలను వెల్లడించారు. వరంగల్‌- హైదరాబాద్‌ మెమూ, కాజీపేట- బల్లార్ష, సికింద్రాబాద్‌- వరంగల్ ట్రైన్లు సెప్టెంబరు 1 నుంచి అక్టోబరు 30 వరకు మెుత్తం …

Read More »

అర్హులైనా రుణమాఫీ కాలేదా..? గుడ్‌న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్

తెలంగాణ ప్రభుత్వం రూ. 2 లక్షల పంట రుణమాఫీ పథకం అమలు చేసిన సంగతి తెలిసిందే. మూడు విడతల్లో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. జులై 18న తొలి విడతలో రూ. లక్షలోపు, జులై 31న రెండో విడతలో రూ. లక్షన్నర లోపు.. ఆగస్టు 31న మూడో విడతలో రూ.లక్షన్నర నుంచి రూ. 2 లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేశారు. అయితే చాలా మంది రైతులకు అర్హులైనప్పటికీ రుణమాఫీ సొమ్ము జమ కాలేదు. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా రుణమాఫీ …

Read More »

జీవితాంతం ఉచిత బస్సు ప్రయాణం.. ఆ చిన్నారికి ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్, నర్సుకు కూడా..!

రాఖీ పౌర్ణమి రోజున గ‌ద్వాల డిపోన‌కు చెందిన ఆర్టీసీ బ‌స్సులో జ‌న్మించిన చిన్నారికి టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఆ చిన్నారి జీవిత కాలంపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్‌ అందిస్తున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్‌లలో పుట్టిన పిల్లలకు జీవిత కాలపు ఉచిత బస్ పాస్‌ను ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు.. ఈ ఆడపిల్లకు బర్త్ డే గిఫ్ట్‌గా లైఫ్ టైం ఫ్రీ బస్ పాస్‌ను మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. …

Read More »

వర్షాల వేళ స్కూళ్లకు సెలవులు.. కలెక్టర్లకు మంత్రి కీలక ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో మరో వారం రోజుల పాటు కూడా ఇలాగే కుండపోత వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రధానంగా వచ్చే నాలుగైదు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో.. పలు జిల్లాలకు ఎల్లో, రెడ్ అలర్టులను ప్రకటించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సీఎస్ శాంతి కుమారి, జిల్లా కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి …

Read More »