తెలంగాణ

నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇవ్వాలని డిమాండ్

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కుండపోత వానపడుతోంది. న‌గ‌రంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. అబ్దుల్లాపూర్‌మేట్, జీడిమెట్ల‌, సూరారం, అబిడ్స్‌, నాంప‌ల్లి, నాగోల్‌, అంబ‌ర్ పేట్‌, సుచిత్ర, బషీర్ బాగ్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హిమాయత్ నగర్, దిల్‌సుఖ్ నగర్, మలక్ పేట, షేక్ పేట, మెహదీపట్నం, వనస్థలిపురం, ఉప్పల్, పంజాగుట్ట, ఖైరతాబాద్ ఎర్రమంజిల్, లక్డికాపుల్, ఫిల్మ్ నగర్, నారాయణగూడ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ …

Read More »

ఆకతాయి వేధింపులు.. తమ్ముడికి రాఖీ కట్టి చనిపోయిన అక్క, ఎంత విషాదం

అన్నాచెళ్లలు, అక్కాతమ్ముళ్లు ఎంతగానే ఎదురుచూస్తున్న రాఖీ పౌర్ణమి వచ్చేసింది. ఏడాదికి ఒక్కసారి తోబుట్టువుల అనుబంధానికి ప్రతీకకగా రాఖీ పౌర్ణమిని జరుపుకుంటారు. అలాంటి పండగ పూట ఓ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఆకతాయి వేధింపులకు ఓ బలైపోయింది. చివరిసారిగా తన తమ్ముడికి రాఖీ కట్టి తనువు చాలించింది. గుండెల్ని పిండేసే ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండలంలోని ఓ తండాలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని ఓ తండా కు చెందిన మైనర్ బాలిక …

Read More »

సోదర బంధానికి రక్ష! రక్ష!

శ్రావణం ఐశ్వర్యప్రదమైన మాసం. దీని విశిష్టతను పరమశివుడు పార్వతికి వివరిస్తూ ‘‘అస్మిన్‌ మాసే కృతం యద్యత్తదనంతాయ కల్పతే… ఈ మాసంలో ఆచరించే క్రతువులు అనంతమైన ఫలాలను ఇస్తాయి’’ అని చెప్పాడు. నేడు రాఖీ పౌర్ణమి శ్రావణం ఐశ్వర్యప్రదమైన మాసం. దీని విశిష్టతను పరమశివుడు పార్వతికి వివరిస్తూ ‘‘అస్మిన్‌ మాసే కృతం యద్యత్తదనంతాయ కల్పతే… ఈ మాసంలో ఆచరించే క్రతువులు అనంతమైన ఫలాలను ఇస్తాయి’’ అని చెప్పాడు. ఎంతో మహిమాన్వితమైన ఈ నెలలో… పౌర్ణమి మరింత ప్రత్యేకమైనది. హయగ్రీవుడిగా శ్రీమహావిష్ణువు అవతరించినది శ్రావణ పౌర్ణమి నాడే. …

Read More »

రూ.2 లక్షల రుణమాపీ కాలేదా..? నో టెన్షన్ అంటున్న మంత్రి తుమ్మల

తెలంగాణలో రాజకీయాలు ప్రస్తుతం రైతు రుణమాఫీ చూట్టూనే తిరుగుతున్నాయి. అర్హులందరికీ రుణమాఫీ చేశామని.. కాంగ్రెస్ చెబుతుంటే రైతు రుణమాఫీ డొల్ల అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రతిపక్షాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గత నాలుగు రోజుల నుండి రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు అనేక విన్యాసాలు చేస్తూ, సోషల్ మీడియా సాక్షిగా, రైతాంగాన్ని తమ అసత్య ప్రచారాలతో ఆందోళన కు గురి చేస్తున్నారని ఫైరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటకు కట్టుబడి అమలు చేస్తున్న పథకాలతో ప్రజల్లో పార్టీ పట్ల …

Read More »

ఆర్జీవీ నాకు మంచి ఫ్రెండ్.. ప్రభాస్‌ అసలు‌ క్యారెక్టర్ అదే.. రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

రామ్ గోపాల్ వర్మ నాకు మంచి మిత్రుడు.. ప్రభాస్‌ ఉన్న గుణం కూడా అదే అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌లో క్షత్రియ సేవా సమితి నిర్వహించిన అభినందన సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. ఆ సమాజిక వర్గంలో ఉన్నతస్థాయికి చేరుకున్న వారిపై ప్రశంసలు కురిపించారు. విజయానికి, నమ్మకానికి క్షత్రియులు మారుపేరంటూ కొనియాడారు. కష్టపడే గుణం వల్లే క్షత్రియులు ఏ రంగంలో అయినా సక్సెస్ అవుతారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే.. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కృష్ణంరాజు, ప్రభాస్, రామ్ …

Read More »

నాకున్న ఢిల్లీ సోర్స్‌తో చెబుతున్నా.. రేవంత్ చేయబోయేది ఇదే: కేటీఆర్

బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కావటం ఖాయమని సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో చిట్ చాట్‌గా మాట్లాడిన ఆయన.. కేసీఆర్‌కు గవర్నర్ పదవి, కేటీఆర్‌కు సెంట్రల్ మినిస్టర్, కవితకు బెయిల్ ఇవ్వటంతో పాటు రాజ్యసభ సీటు కూడా ఇస్తారని.. హరీష్ రావుకు అసెంబ్లీలో అపొజిషన్ లీడర్ పదవి కట్టెబట్టనున్నట్లు ఆయన కామెంట్లు చేశారు. రేవంత్ చేసిన ఈ కామెంట్లపై తాజాగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తమ పార్టీ బీజేపీలో విలీనం కావటం కాదని.. …

Read More »

సిద్దిపేటలో హై టెన్షన్.. కాంగ్రెస్ కార్యకర్తల దాడి, బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనలు

సిద్దిపేటలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓవైపు కాంగ్రెస్ కార్యకర్తల దాడి, బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనలతో.. వాతావరణం హాట్ హాట్‌గా మారింది. 2 లక్షల మేర రైతు రుణమాఫీని ఆగస్టు 15వ తేదీలోపు అమలు చేస్తే తన ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తానని హరీష్ రావు చేసిన ఛాలెంజ్‌ను ఉటంకిస్తూ.. వైరా సభలో సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. దానికి హరీష్ రావు కూడా కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే.. రుణమాఫీ చేశాం.. హరీశ్‌రావు రాజీనామా చేయాలంటూ సిద్దిపేటలో ఫ్లెక్సీలు …

Read More »

రూ.2 లక్షల వరకు రుణమాఫీ.. ఆ పైన లోన్ ఉన్న వారి పరిస్థితేంటి..?

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో ప్రధానమైంది రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ. తాము అధికారంలోకి వస్తే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని.. వరంగల్ డిక్లరేషన్‌లో భాగంగా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆరు గ్యారంటీల్లోనూ ఇదే ప్రధానమైన హామీ. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ. 2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేసింది. మెుత్తం మూడు విడతల్లో ఈ హామీ అమలైంది. మూడో విడతలో భాగంగా రూ. లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు రైతులకు మాఫీ …

Read More »

HYD: ఘోర ప్రమాదం.. బస్సు కిందికి దూసుకుపోయిన ఆటో.. టెన్త్ అమ్మాయి మృతి

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హబ్సిగూడ‌ ప్రాంతంలో వేగంగా వచ్చిన ఓ స్కూల్ ఆటో.. అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో అతివేగంతో రావటం వల్ల.. బస్సు వెనకాల కిందకు దూసుకుని వెళ్లింది. ఈ ఘటనలో.. ఆటో డ్రైవర్‌తో పాటు అందులో ఉన్న పదో తరగతి విద్యార్థిని బస్సు కింద ఉరుక్కుపోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. క్రేన్ సహాయంతో ఆటోను బస్సు కింద నుంచి తొలగించారు. అమ్మాయితో పాటు ఆటో డ్రైవర్‌ను హుటాహుటిన …

Read More »

అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి.. 9 నెలల క్రితమే తండ్రి, ఇప్పుడు కొడుకు..!

అమెరికాలో మరో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. హనుమకొండ జిల్లా ఆత్మకూరుకు చెందిన ఏరుకొండ రాజేశ్ 2015లో ఉన్నత చదువుల నిమిత్తం అమెరికాకు వెళ్లాడు. ఎమ్మెస్ పూర్తి చేసిన తర్వాత అక్కడే ఉద్యోగం కూడా తెచ్చుకున్నాడు. మధ్యలో రెండుసార్లు స్వగ్రామానికి వచ్చి.. తిరిగి వెళ్లాడు. అయితే.. తొమ్మిది నెలల క్రితమే రాజేష్ తండ్రి చనిపోగా.. ఆయన అంత్యక్రియలకు కూడా రాజేష్ రాలేకపోయాడు. తలకొరివి పెట్టడానికి రాకపోవటంతో.. తండ్రి సంవత్సరికానికి వస్తానని చెప్పాడు. కానీ.. ఇంతలోనే రాజేష్‌ చనిపోయాడన్న విషాద వార్త కుటుంబాన్ని …

Read More »