తెలంగాణ

విద్యుత్ కమిషన్‌ కొత్త ఛైర్మన్‌గా.. ఏపీ మాజీ ప్రధాన న్యాయమూర్తి.. 

తెలంగాణలో ఏర్పాటు చేసిన విద్యుత్ కమిషన్‌కు కొత్త ఛైర్మన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ఛైర్మన్‌గా గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ మదన్ బీ లోకూర్‌ను నియమిస్తూ.. మంగళవారం (జులై 30న) ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ మదన్ బీ లోకూర్.. 2011లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించారు. మొదట నియమించిన జస్టిస్ నర్సింహా రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కొత్త ఛైర్మన్‌‌గా జస్టిస్ మదన్ …

Read More »

జేసీ ప్రభాకర్ రెడ్డి, వైఎస్ విజయమ్మల భేటీలో మరో ట్విస్ట్..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం జరిగింది. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మలు భేటీ కావడం చర్చనీయాంశమైంది. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి లోటస్‌పాండ్‌లోని వైఎస్ విజయమ్మ ఇంటికి వెళ్లి కలిసినట్లు ప్రచారం జరిగింది. విజయమ్మ యోగ క్షేమాల గురించి అడిగి.. ఆమె ఆరోగ్య పరిస్థితిపై జేసీ ఆరా తీసినట్లు వార్తలొచ్చాయి. అయితే జేసీ విజయమ్మ ఇంటికి వెళ్లడం ఇక్కడ హాట్ టాపిక్ అయ్యింది. జేసీ పనిగట్టుకుని మరీ వెళ్లి …

Read More »

హైదరాబాద్‌లో పంజా విసురుతున్న డెంగీ.. 

తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ సిటీలో అయితే డెంగీ పంజా విసురుతోంది. ముఖ్యంగా చిన్న పిల్లలపైనే దీని ప్రభావం ఎక్కువగా ఉంటోంది. నల్లకుంట ఫీవర్‌ హాస్పిటల్, నిలోఫర్‌లోని చిన్న పిల్లల విభాగానికి డెంగీ జ్వరంతో వచ్చే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వారం రోజుల క్రితం మూసాపేటలో ఓ 10 ఏళ్ల ఓ చిన్నారి డెంగీతో ప్రాణాలు కోల్పోయింది. సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేయవద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. అలా నిర్లక్ష్యం …

Read More »

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. KCR రికార్డ్ బ్రేక్‌ చేసిన సీఎం రేవంత్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. సోమవారం (జులై 29) ఐదో రోజు అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో దద్దరిల్లింది. ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కాగా.. అసెంబ్లీలో పద్దులపై సుదీర్ఘంగా చర్చ కొనసాగింది. ప్రశ్నోత్తరాలు కార్యక్రమాన్ని రద్దు చేసి బడ్జెట్ పద్దుపై చర్చించారు. 19 శాఖల పద్దులపై సోమవారం అసెంబ్లీలో చర్చ కొనసాగింది. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభ మంగళవారం ఉదయం 3:15 వరకు సుదీర్ఘంగా కొనసాగింది. సాయంత్రం 4.40 నుంచి 5. 50 వరకు టీ …

Read More »

తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మరో రెండ్రోజుల పాటు వానలు, ఈ జిల్లాలకు హెచ్చరికలు

తెలంగాణలో గత వారం పది రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు, చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. అయితే ఇప్పట్లో వర్షాలు రాష్ట్రాన్ని వీడేలా కనిపించటం లేదు. తెలంగాణకు మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేశారు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు. రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయన్నారు. రాజన్న సిరిసిల్ల, వరంగల్‌, …

Read More »

పలు రాష్ట్రాలకు గవర్నర్లు నియమాకం.. తెలంగాణకు ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం

పలు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రాత్రి ఆమోదం తెలిపారు. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లతో పాటు మరో ముగ్గుర్ని వేరే రాష్ట్రాల నుంచి బదిలీ చేశారు. తెలంగాణకు సీనియర్ బీజేపీ నేత, త్రిపుర మాజీ డిప్యూటీ సీఎం జిష్ణు దేవ్ వర్మ నూతన గవర్నర్‌గా నియమితులయ్యారు. మహారాష్ట్ర మాజీ స్పీకర్ హరిభౌ కిసన్‌రావ్‌ బాగ్డేను రాజస్థాన్ గవర్నర్‌గా, కేంద్ర మాజీ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వార్‌ను ఝార్ఖండ్‌కు.కర్ణాటకకు చెందిన మాజీ ఎంపీ సి.హెచ్‌.విజయశంకర్‌‌ను మేఘాలయ గవర్నర్‌గా నియమించారు. రాజస్థాన్ …

Read More »

హైదరాబాద్‌ను వణికిస్తోన్న నొరో వైరస్.. వేగంగా పెరుగుతున్న కేసులు.. 

ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకోకముందే ప్రజలను మరో కొత్త వైరస్ భయపెడుతోంది. అత్యంత వేగంగా వ్యాపించే నొరో వైరస్.. ఇప్పుడు హైదరాబాద్‌లోకి ఎంట్రీ ఇవ్వటమే కాకుండా వేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ కారణంగా.. కేవలం పాతబస్తీ ప్రాంతంలోనే రోజుకు 100 నుంచి 120 కేసులు నమోదవుతున్నట్టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) వెల్లడించింది. ఈ నొరో వైరస్ విషయంలో ప్రజలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. నొరో వైరస్‌తో జాగ్రత్తగా ఉండాలంటూ ట్విట్టర్ వేదికగా జీహెచ్ఎంసీ పలు సూచనలు చేసింది. …

Read More »

విద్యార్థులను భుజాన ఎక్కించుకుని వరద ప్రవాహాన్ని దాటించిన మాస్టారు

ఉపాధ్యాయుడంటే కేవలం పాఠ్యపుస్తకాల్లో ఉన్న విషయాలను బోధించటమే కాదు.. విద్యార్థులకు మంచి చెడుల వ్యత్యాసాన్ని నేర్పించి.. మంచి మార్గాన్ని చూపించటం కూడా. అవసరమైతే.. చేయి పట్టుకుని ఆ మార్గం వెంట నడిపించి గమ్యం చేరేలా చేయటం కూడా గురువు బాధ్యతే. అచ్చంగా అదే పని చేశాడు ఓ ఉపాధ్యాయుడు. విద్యార్థులను తమతమ జీవితాల్లో గమ్యాలను చేర్పించటం ప్రస్తుత కాలంతో కొంచెం కష్టమైన విషయమే కానీ.. అడ్డుగా నిలిచిన వరద ప్రవాహాన్ని సురక్షితంగా దాటించి గమ్యస్థానాలకు చేర్చి.. మా మంచి మాస్టారు అనిపించుకున్నాడు. కుమురం భీం …

Read More »

ఎల్ఆర్ఎస్‌ కొత్త విధివిధానాలు.. రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం..!

తెలంగాణలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన “లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం”(LRS) అమలుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్ వల్ల ప్రజలపై తీవ్ర భారం పడనుందంటూ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో విమర్శించిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త విధివిధానాలు (LRS Guidelines) తీసుకురావాలని యోచిస్తోంది. ఈ మేరకు.. ఎల్‌ఆర్‌ఎస్‌ అమలుపై సచివాయలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఎల్ఆర్‌ఎస్ విధివిధానాల‌ కసరత్తుపై సమీక్షించారు. ఎల్‌ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు …

Read More »

ట్రైన్ ప్రయాణికులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల మధ్య పలు రైళ్లు రద్దు

తెలుగు రాష్ట్రాలతో పాటు హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు ట్రైన్ ప్రయాణాలు సాగించేవారికి సౌత్ సెంట్రల్ రైల్వే అలర్ట్ ఇచ్చింది. పలు ట్రైన్లు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా సికింద్రాబాద్‌-పుణె మధ్య తిరిగే శతాబ్ది సహా గోల్కొండ, శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లతో పాటు మరికొన్ని ట్రైన్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సెంట్రల్‌ రైల్వే జోన్‌ పరిధిలోని దౌండ్‌ మార్గంతో పాటు సౌత్ సెంట్రల్ రైల్వేలోని విజయవాడ డివిజన్‌లోనూ మూడో ట్రైన్ లైను పనుల కారణంగా ప్రయాణికులకు ట్రైన్ సేవల్లోనూ అంతరాయం …

Read More »