పాలిటిక్స్

హైదరాబాద్‌లో పోసాని కృష్ణమురళి అరెస్ట్.. ఏపీకి తరలింపు.!

ఏపీలో మరో పొలిటికల్ వికెట్ పడింది. కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించారు. పోసాని అరెస్ట్‌తో మరోసారి వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న పోసాని ఇంటికి వెళ్లి నిన్న రాత్రి నోటీసులు ఇచ్చారు. పోసానిని అరెస్ట్ చేస్తున్నట్లు.. కుటుంబ సభ్యులకు చెప్పారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి.. అదుపులోకి తీసుకున్నారు. పోసాని …

Read More »

 వైసీపీకి భారీ ఎదురుదెబ్బ.. జనసేనలోకి 20 మంది కార్పోరేటర్లు

ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒంగోలులో వైసీపీకి మరో షాక్‌ తగిలింది. ఒంగోలు కార్పొరేషన్‌లో 20 మంది కార్పొరేటర్లు, ఇద్దరు కో ఆప్షన్‌ మెంబర్లు వైసీపీ కండువాను మార్చేశారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులుగా ముద్రపడిన వారంతా జనసేన చేరారు. బాలినేని ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు కార్పొరేటర్లు.ఒంగోలు డిప్యూటీ మేయర్‌ వెలనాటి మాధవ్‌తో పాటు పార్టీ …

Read More »

ప్రతిపక్షహోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాం.. వైసీపీ డిమాండ్‌పై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..

ప్రతిపక్ష హోదా విషయంలో తగ్గేదేలే.. అని వైసీపీ నేతలు అంటుంటే.. అసలు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చేదేలే.. అంటున్నారు కూటమి నేతలు.. ఏపీ బడ్జెట్‌ సమావేశాల వేళ వైసీపీ-కూటమి నేతల మధ్య విపక్ష హోదా మరోసారి అగ్గి రాజేసింది. ప్రతిపక్ష హోదా మా హక్కు అని ఫ్యాన్ పార్టీ డిమాండ్‌ చేస్తుంటే.. అడుక్కుంటే LOP హోదా ఇవ్వరని కౌంటర్ ఇస్తోంది సర్కార్‌.అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తొలిరోజు గవర్నర్ నజీర్ ప్రసంగించారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తూ.. స్వర్ణాంధ్ర విజన్‌ ఆవిష్కరణే లక్ష్యంగా …

Read More »

ఐటీ నుంచి ఏఐ రివల్యూషన్ దిశగా.. ఏపీ గవర్నర్ స్పీచ్ హైలైట్స్ ఇవే

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు వైసీపీ కూడా హాజరయింది. జగన్‌తో సహా ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష హోదాను డిమాండ్ చేశారు. అటు గవర్నర్ ప్రసంగం వైసీపీ నేతల నినాదాల మధ్యే కొనసాగింది. సంక్షేమం, అభివృద్ధి సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర కల సాకారం దిశగా అడుగులు వేస్తున్నట్టు చెప్పారు. ‘పెన్షన్లు రూ. 4 వేలకు పెంచాం. ఏడాదికి రూ. 3 …

Read More »

ఢిల్లీ సీఎంగా రేఖ గుప్తా ప్రమాణ స్వీకారం.. హాజరైన ప్రధాని మోదీ

ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతోపాటు ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. రేఖ గుప్తాతో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సక్సేనా ప్రమాణం చేయించారు. ఢిల్లీకి 9వ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా హిందీలో ప్రమాణం చేశారు. అలాగే.. పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ, మంజీందర్ సింగ్ సిర్సా, రవీంద్ర ఇంద్రరాజ్, కపిల్ మిశ్రా, ఆశిష్ సూద్, పంకజ్ సింగ్ కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరితో లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ప్రమాణం చేయించారు. రామ్‌లీలా మైదానంలో ఢిల్లీ సీఎం …

Read More »

అడకత్తెరలో గేమ్ ఛేంజర్లు.. శుద్దపూసలెవరు..? కనిపించని నాలుగో సింహాలెవరు?

బహిరంగ హెచ్చరికలు.. దాంతోపాటే ఓదార్పులు. నిజానికి.. అధికారులు, రాజకీయ నేతల మధ్య కోల్డ్‌ వార్‌ ఇప్పుడు మొదలైంది కాదు. నాలుగంకెల జీతంరాళ్లకు పనిచేసే హోమ్‌గార్డ్‌, క్లర్క్‌ నుంచి రాష్ట్ర పాలన, పోలీసు యంత్రాంగం మొత్తాన్ని చూపులువేలితో శాసించగల చీఫ్ సెక్రటరీ, డీజీపీ దాకా.. అందరిదీ ఒకటే కథ. అంతులేని పని ఒత్తిడి.గివ్ రెస్పెక్ట్.. టేక్ రెస్పెక్ట్..! గౌరవ మర్యాదలు అనేవి అడుక్కుంటే వచ్చేవి కావు. ఆజమాయిషీ చేస్తే దొరికేవి కావు. ఇచ్చిపుచ్చుకుంటే వచ్చేవి. పొలిటీషియన్ అండ్ బ్యూరోక్రాట్.. వీళ్ల ప్రొఫెషనల్ రిలేషన్ కూడా అచ్చంగా …

Read More »

జైలులో వల్లభనేని వంశీని పరామర్శించిన వైఎస్‌ జగన్‌..

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించేందుకు వైఎస్‌ జగన్‌ జైలు వద్దకు వస్తుండటంతో వైఎస్సార్‌సీపీ నేతలు భారీగా తరలి వస్తున్నారు. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వంశీని పరామర్శించేందుకు మంగళవారం ఉదయం విజయవాడ సబ్‌ జైలుకు వెళ్లారు..విజయవాడ జిల్లా జైలులో వల్లభనేని వంశీని పరామర్శించారు ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌. ములాఖత్‌లో వైఎస్‌ జగన్‌ వంశీని కలిశారు. జరిగిన పరిణామాల గురించి జగన్‌ వంశీని అడిగి తెలుసుకుంటున్నారు. కిడ్నాప్‌ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని ములాఖత్‌కు పేర్నినాని, కొడాలి …

Read More »

ఏఐసీసీలో మార్పులు చేర్పులకు కసరత్తు..! ప్రియాంకకు కీలక పదవి..?

వరుస ఓటములతో కాంగ్రెస్ శ్రేణులు ఢీలాపడుతున్నారు. మొన్నటికి మొన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన కాంగ్రెస్ ఒక్కటంటే ఒక్కస్థానంలోనూ గెలవలేకపోయింది. ఢిల్లీలో హ్యాట్రిక్ జీరో స్థానాలతో ఆ పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురైయ్యారు. ఈ నేపథ్యంలో మరికొన్ని మాసాల్లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు మంచుకొస్తున్నాయి. 2026లో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్, అసోంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐసీసీలో కీలక మార్పులు చేర్పులకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది.వరుస ఓటములతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీ.. ఆత్మపరిశీలన మొదలుపెట్టింది. …

Read More »

కూటమి నేతలు గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితి లేదు: వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..

రాష్ట్రంలో స్కామ్‌లు తప్ప ఏమీ జరగడంలేదని ఆరోపించారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి… చట్టవిరుద్ధంగా, అన్యాయాలు చేసేవారెవ్వరినీ తాము వదిలిపెట్టబోమని హెచ్చరించారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం కచ్చితంగా వస్తుందని.. నేతలంతా ధైర్యంగా ఉండాలన్నారు. కొన్నాళ్లుగా వేర్వేరు జిల్లాల నేతలతో సమావేశమవుతూ వస్తున్న వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. బుధవారం ఉమ్మడి గుంటూరు జిల్లా నాయకులతో సమావేశమయ్యారు.టీడీపీ నాయకులు గ్రామాల్లోకి వెళ్లే వెళ్లే పరిస్థితులు లేవని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు హామీలు నిలబెట్టుకోకపోతే చొక్కాలు పట్టుకోవాలని …

Read More »

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై ఫోకస్.. నేడు కీలక సమావేశం

త్వరలో జరిగే స్థానిక సంస్థల్లో ఏకగ్రీవాలు ఉంటాయా లేదా అనే దానిపై ఇవాళ కాస్త క్లారిటీ రానుంది. ఒకే ఒక్క నామినేషన్ దాఖలైన పరిస్థితుల్లో అక్కడ నోటా కూడా ఉంటుంది. అభ్యర్థికి ఓటు వేయడం ఇష్టం లేకపోతే.. ఓటర్లు నోటా బటన్‌ నొక్కొచ్చు. అటు సర్కార్‌ ఇటు స్టేట్ ఎలక్షన్‌ కమిషన్‌ తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై ఫోకస్ పెంచాయి. నేడు రాజకీయ పార్టీలతో తెలంగాణ ఎన్నికల సంఘం సమావేశం కానుంది. ఏకగ్రీవ ప్రక్రియ లేకుండా ఎన్నికల నిర్వహణ పై ఆయా పార్టీలతో SEC సమావేశంలో …

Read More »