బిజినెస్

నెలకు రూ. 80,000 సంపాదిస్తున్న బైక్ డ్రైవర్.. అతడి మాటలు వింటే సెల్యూట్‌ చేయాల్సిందే..!

బెంగళూరుకు చెందిన ఉబెర్ బైక్ డ్రైవర్ నెలకు రూ. 80,000 సంపాదిస్తున్నట్లు చెప్పారు. అతడు తన సంపాదన గురించి చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతని నెల జీతం విని నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో కర్ణాటక పోర్ట్‌ఫోలియో (@karnatakaportf) అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయబడింది. ప్రస్తుతం వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో ఉబర్ బైక్ డ్రైవర్ హిందీలో మాట్లాడుతున్నాడు. అతని మాటల ప్రకారం.. నేను రోజుకు 13 గంటలు పనిచేసి నెలకు దాదాపు రూ.80,000 సంపాదిస్తున్నాను అని …

Read More »

యూపీఐ ట్రాన్సాక్షన్.. జనవరి 1 నుంచి కీలక మార్పులు.. ఆర్బీఐ ఉత్తర్వులు జారీ!

UPI Transaction Rules: జనవరి 1 నుండి యూపీఐ డబ్బు లావాదేవీ పరిమితులు మాత్రమే కాకుండా కొన్ని కొత్త నియమాలు కూడా అమలులోకి వస్తాయి. దీని ప్రకారం, UPI 123 పే ద్వారా చేసే లావాదేవీలకు ఎటువంటి సేవా ఛార్జీ విధించరు. అంతే కాకుండా..2024 సంవత్సరం ముగుస్తుంది. 2025 సంవత్సరం రాబోతోంది. ఈ పరిస్థితిలో యూపీఐ లావాదేవీలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముఖ్యమైన నోటిఫికేషన్‌లను విడుదల చేసింది. కొత్త ఆర్‌బీఐ ద్రవ్య విధానం 2025 జనవరి నుంచి అమల్లోకి రానుంది. యూపీఐ …

Read More »

వార్నీ.. అనసూయ వచ్చిందని ఆర్టీసీ బస్టాండ్‌‌ క్లోజ్..! ఎక్కడంటే

ఆర్టీసీ అధికారుల తీరుపై మండిపడుతున్నారు ప్రయాణికులు. షాపు ఓపెనింగ్ కు యాంకర్ అనసూయ వచ్చిందని ప్రజా రవాణాకు సంబంధించిన బస్టాండ్ ను బారికేట్లతో మూసేశారు అధికారులు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఎవరో రావడం ఏమిటి మా ప్రయాణాలను ఆపుకోవడం ఏమిటి అంటూ ఆర్టీసీ అధికారుల తీరును దుమ్మెత్తి పోశారు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసా..ఎవరైనా రాష్ట్ర స్థాయి నాయకులు, లేదా ముఖ్యమైన నేతలు వస్తేనో, లేదా కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి అప్పుడప్పుడు రోడ్లను భ్యారికేట్లతో మూసేస్తూ ఉండటం మనం …

Read More »

Anticancer Drugs: క్యాన్సర్ రోగులకు కాస్త ఊరట.. కేంద్రం చొరవతో తగ్గిన మందుల రేట్లు

మారిన జీవన విధానం, వాతావరణంలో మార్పులతో రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రస్తుతం వయసుతో సంబంధంలేకుండా క్యాన్సర్ బారిన పడుతున్న బాధితుల సంఖ్య మన దేశంలో రోజు రోజుకీ పెరుగుతోంది.క్యాన్సర్ కు చికిత్స అతి ఖరీదైనది. శరీరంలో పెరిగే క్యాన్సర్ కణాలను చంపడానికి మందులను కొనుగోలు చేయడం అనేది సామాన్యులకు భారంగా నేపధ్యంలో.. క్యాన్సర్ రోగులకు కేంద్రం గొప్ప ఉపశమనం కలిగించింది.ఖరీదైన వ్యాధిగా మారిన క్యాన్సర్ బాధితులకు కేంద్రం గొప్ప ఉపశమనం కలిగించింది. మూడు రకాల క్యాన్సర్‌ సంబంధిత మందులపై కస్టమ్ డ్యూటీని తొలగిస్తున్నట్లు …

Read More »

మోదీ హయాంలో దేశంలోని ఆ ప్రాంతాలకు మహర్దశ

ఈశాన్య భారతం మోదీ హయాంలో ఎంతో ఆర్థిక, సామాజిక పురోగతి సాధించిందని కేంద్ర మంత్రి మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. మరింత వృద్ధి దిశగా ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల చేస్తోందన్నారు.2014 నుంచి ఈశాన్య భారతం అద్భుతమైన పురోగతి దిశగా సాగుతుందని.. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. మౌలిక సదుపాయాలు, రవాణా, విద్య, సేంద్రీయ వ్యవసాయంలో అపూర్వమైన పురోగతిని ఉందని చెప్పారు. బడ్జెట్ పెరుగుదల: 300% పెరుగుదల 2014లో రూ. 36,108 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరగ్గా…. 2023-24 ఆర్థిక …

Read More »

Women Schemes: మహిళల కోసం మోడీ సర్కార్‌ బెస్ట్‌ స్కీమ్‌.. వారి ఖాతాల్లో రూ.32 వేలు!

ఈ పథకం ద్వారా రూ. మహిళలు లేదా బాలికల పేరుతో 2 సంవత్సరాల కాలానికి 2 లక్షలు అందజేస్తున్నారు. దీనిపై అధిక వడ్డీ చెల్లిస్తున్నారు. ఈ పథకం పోస్టాఫీసుతో పాటు అనేక బ్యాంకుల్లో..మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. వాటిలో ఒకటి ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్’ (MSSC). మహిళలను పెట్టుబడుల వైపు ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ మహిళల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టబడింది. మహిళలు …

Read More »

కాలం తీరిన మందులిచ్చి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న డాక్టర్లు.. గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్న యువకుడు..

హైదరాబాద్ పాతబస్తీలో అపెండిక్స్‌ ఆపరేషన్‌ కోసం ఆస్పత్రిలో సర్ఫరాజ్‌ అనే యువకుడు చేరాడు. ఆ యువకుడికి ఆపరేషన్ చేసిన డాక్టర్లు కాలం చెల్లిన సెలైన్‌తో పాటు ఇంజెక్షన్లు, మందులు ఇచ్చారు. దీంతో యువకుడి ఆరోగ్యం క్షీణించింది. రోజు రోజుకి ఆ యువకుడి ఆరోగ్యం చేయిదాటిపోవడంతో కుటుంబ సభ్యులకు వైద్యులపై పలు అనుమానాలు వచ్చాయి. మందులపై దృష్టిపెట్టగా 9 నెలల క్రితమే కాలం చెల్లిన మందులు ఇచ్చినట్టు తేలింది. దీంతో ఆధారాలతో సహా మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్‌లో బంధువులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ …

Read More »

ఆల్‌టైమ్‌ రికార్డ్‌ స్థాయికి యూపీఐ చెల్లింపులు.. రూ. లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్‌

దేశంలో యూపీఐ సేవలు ఓ రేంజ్‌లో విస్తరిస్తున్న విషయం తెలిసిదే. టీ కొట్టు మొదలు పెద్ద పెద్ద దుకాణాల వరకు అన్ని యూపీఐ పేమెంట్స్‌ను ఆహ్వానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా యూపీఐ సేవలు ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. నవంబర్‌ నెలలో యూపీఐ ట్రాన్సాక్షన్స్‌ ఏకంగా 15.48 బిలియన్లకు చేరుకోవడం విశేషం. ఇది 38 శాతం వృద్ధితో సమానం. ఈ లావాదేవీల మొత్తం విలువ ఏకంగా రూ.21.55 లక్షలు కావడం గమనార్హం. ఈ విషయాలను నేషనల్ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆదివారం విడుదల …

Read More »

ఆకర్షణీయమైన ప్యాకేజీలకు ఆకర్షితులయ్యారో.. గోవిందా! విహార యాత్రల పేరుతో నయా దందా

టూర్స్ ట్రావెల్స్ ప్యాకేజీల పేరుతో ఈమధ్య కాలంలో దేశ వ్యాప్తంగా భారీ మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఇప్పటికే పలు చోట్ల వందల సంఖ్యలో అమాయకులను మోసం చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌లోనూ, నోయిడా లోనూ ఈ తరహా ఘటనలు వెలుగులోకి వచ్చాయి.స్పెషల్ హాలిడే ప్యాకేజీ.. ఆకర్షణీయమైన ఆఫర్‌.. మంచి తరుణం మించిన తొరదకదు. షో.. ఈక్షణమే బుక్ చేసుకోండి. ఆల్రెడీ 90పర్సెంట్ సీట్లు బుక్‌ అయ్యాయి.. ఇంకా ఆలస్యమయ్యారో గోల్డెన్‌ ఛాన్స్ మిస్‌ అవుతారు. ఇలాంటి బురిడీ మాటలకు అట్రాక్ట్ అయ్యారో.. అడ్డంగా బుక్‌ అవుతారు. …

Read More »

అంతరిక్ష రంగంలో స్టార్టప్‌ల సంఖ్య 250 దాటింది.. గ్లోబల్ మార్కెట్‌లో భారత్ వాటా పెరిగిందిః ఇస్రో ఛైర్మన్‌

ఇస్రో ఇప్పటి వరకు 431 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించామని, అంతరిక్ష రంగంలో భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని సోమనాథ్ పేర్కొన్నారు.భారతదేశంలో అంతరిక్ష కార్యకలాపాలను ప్రోత్సహించడంలో ప్రైవేట్ రంగం, స్టార్టప్‌లు కీలక పాత్ర పోషిస్తాయని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ అన్నారు. వారి సహకారంతో గ్లోబల్ మార్కెట్‌లో దేశం మరింత వాటాను పొందగలదని ఆయన అభిప్రాయపడ్డారు. గ్లోబల్ మార్కెట్‌లో మరింత వాటాను కైవసం చేసుకునేందుకు భారత్ తన అంతరిక్ష కార్యకలాపాలను పెంచుకోవాలని చూస్తోంది. శుక్రవారం(నవంబర్ 29) కేరళ స్టార్టప్ మిషన్ నిర్వహించిన దేశ ఫ్లాగ్‌షిప్ స్టార్టప్ …

Read More »