మన భారత వైమానిక దళం వద్ద ప్రస్తుతం 22 AH-64 అపాచీ హెలికాఫ్టర్లు ఉన్నాయి. బోయింగ్ అండ్ టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) మధ్య ఉమ్మడి వెంచర్ 900 మందికి పైగా ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను నియమించింది. వీటి నిర్మాణం కూడా అత్యధునిక టెక్నాలజీతో తయారు చేస్తున్నారు..
అంతర్జాతీయ విమానాల తయారీ సంస్థ బోయింగ్, భారత పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ సంయుక్తంగా ఈ జాయింట్ వెంచర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. అయితే హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఈ టాటా బోయింగ్ ఏరో స్పేస్ లిమిటెడ్ (TBAL) తన సత్తా చాటింది. ఈ ఫెసిలిటీ నుంచి ౩౦౦ వ హెలికాప్టర్ Fuselageను డెలివరీ చేసి అరుదైన మైలురాయిని అధిగమించింది. AH 64 APACHE ప్రపంచంలోనే అత్యంత అధనాతమైన మల్టీ రోల్ కాంబాట్ హెలికాప్టర్ ఇది.
2018 నుంచి ఈ ఫెసిలిటీలో ఉత్పత్తి ప్రారంభం:
ఇదిలా ఉండగా, 2018 నుంచి ఈ ఫెసిలిటీలో ఉత్పత్తి ప్రారంభమైంది. ఇక్కడ ప్రధానంగా బోయింగ్ కంపెనీ AH 64 APACHE కాంబాట్ హెలికాఫ్టర్ కీలక భాగామైన బాడీలను తయారు చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా బోయింగ్ సంస్థ విక్రయించే AH 64 APACHE హెలికాప్టర్ల fuselageలు ఇక్కడ నుంచే డెలివరీ అవుతాయి.
ఈ ఫ్యూజ్‌లేజ్‌లను ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల కోసం తయారు చేస్తారు. సుమారు 14,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ తయారీ కేంద్రంలో కంపెనీ AH-64 అపాచీ హెలీకాఫ్టర్ ఫ్యూజ్‌లేజ్‌లతో పాటు, సెకెండరీ స్ట్రక్చర్లను కూడా మ్యానిఫక్షరింగ్ చేస్తోంది.
ప్రపంచంలోనే అత్యంత అధునాన మల్టీ రోల్ కాంబాట్ హెలికాప్టర్:
AH 64 APACHE హెలికాప్టర్ ప్రపంచంలోనే అత్యంత టెక్నాలజీతో తయారు చేసిన మల్టీ రోల్ కాంబాట్ హెలికాప్టర్. యుఎస్ ఆర్మీ దీనిని ఎక్కువుగా ఉపయోగిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 16 దేశాలు తమ డిఫెన్స్ ఫ్లీట్‌లో ఉంచాయి. అలాగే భారత ఆర్మీ రంగంలో 22 అపాచీ హెలికాప్టర్లు ఉన్నాయి. మరో 6 హెలికాప్టర్ల కోసం బోయింగ్‌తో ఎంఓయూ కుదుర్చుకుంది. ౩౦౦ వ హెలికాప్టర్ డెలివరీ చేయడం ద్వారా సంస్థ సంబరాలు చేసుకుంది.
హైదరాబాద్ కేంద్రంగా 900 మందికిపైగా ఇంజనీర్ టెక్నిషియన్లు:
మన భారత వైమానిక దళం వద్ద ప్రస్తుతం 22 AH-64 అపాచీ హెలికాఫ్టర్లు ఉన్నాయి. బోయింగ్ అండ్ టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) మధ్య ఉమ్మడి వెంచర్ 900 మందికి పైగా ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను నియమించింది. వీటి నిర్మాణం కూడా అత్యధునిక టెక్నాలజీతో తయారు చేస్తున్నారు. ఏరో స్ట్రక్చర్‌లను అసెంబుల్ చేయడానికి ఉపయోగపడే విడి భాగాల్లో దాదాపు 90 శాతం వరకు దేశీయంగానే తయారవుతాయి.
దేశ ఏరోస్పేస్ రంగంలో దీర్ఘకాలిక వృద్ధిని పెంపొందించుకుంటూనే భారతీయ కస్టమర్లకు అధునాతన ఏరోస్పేస్ పరిష్కారాలను అందించడానికి బోయింగ్ అంకితభావంతో ఉంది. ఈ కంపెనీ స్థానిక సరఫరాదారులను మరింతగా అభివృద్ధి చేస్తుంది. బోయింగ్ ప్రస్తుతం భారతదేశంలో 6,000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకుంటోంది.