అది విజయవాడ రైల్వే స్టేషన్. ప్రయాణీకుల రద్దీ విపరీతంగా ఉంది. పోలీసులను రెగ్యులర్ తనిఖీలు చేస్తున్నారు. ఇంతలో చెకింగ్స్ సమయంలో సాయపడే డాగ్ ఒకటి.. మూడు బ్యాగుల వద్దకు వెళ్లి ఆగింది. దాన్ని చూడగానే వాటిని తీసుకొచ్చిన మహిళలు.. అక్కడి నుంచి వెళ్లిపోడానికి యత్నించారు. ప్రయాణికుల మాటున గంజాయి తరలిస్తున్న ముగ్గురు మహిళలను విజయవాడ రైల్వే స్టేషన్‌లో నార్కో డాగ్ ‘లియో పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టించింది. 30 కిలోల గంజాయిని ముగ్గురు మహిళల నుంచి స్వాధీనం చేసుకుని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. …
Read More »143 లవర్స్ కాదు.. 420 కేడీలు.. ఈ ప్రేమ పక్షులు ఏం చేశారో తెలుసా..?
బెజవాడలో వరుస చోరీలు బెంబేలెత్తిస్తున్నాయి.. అయితే ఈ చోరీల్లో ఓ ప్రేమ దొరకడం సంచలనంగా మారింది. వీళ్లు మామూలోళ్లు కాదు.. దొంగలుగా మారిన ప్రేమజంట.. అని పోలీసులు వెల్లడించారు. చెడు వ్యసనాలకి బానిసైన ఓ ప్రేమ జంట సులువుగా డబ్బులు సంపాదించడం కోసం కలిసి దొంగతనాలు చేయడం ప్రారంభించారు.. గంజాయికి బానిసై పని పాట లేక తిరుగుతూ పగలు రెక్కీలు నిర్వహిస్తూ, రాత్రులు దొంగతనాలకు పాల్పడుతున్నారు.. ఈ దొంగలిద్దరూ కలిసి బెజవాడలో చేసిన వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. …
Read More »బడ్డీ కొట్టలో చాక్లెట్లు తెగ తింటున్న పిల్లలు… అధికారులు ఆరా తీయగా
విజయవాడలో బడ్డీ కొట్లలో అమ్ముతున్న చాక్లెట్లను.. పిల్లలు తెగ తింటున్నారు. అవే కొనిపెట్టాలని తల్లిదండ్రుల వద్ద మారాం చేస్తున్నారు. స్కూళ్లకు సమీపంలోని బడ్డీ కొట్లలో కూడా వీటిని విక్రయిస్తున్నారు. ఈ విషయం గురించి సమాచారం అందడంతో పోలీసులు వెళ్లి తనిఖీ చేయగా.. విస్మయకర విషయాలు వెలుగుచూశాయి. విజయవాడలో ఉంటున్న పిల్లల తల్లిదండ్రులూ జాగ్రత్తగా ఉండాలి. ఆ మాటకొస్తే ఏ ప్రాంతంలోని తల్లిదండ్రులు అయినా పిల్లలు విషయంలో ఇప్పుడు అలెర్ట్ అవ్వాల్సిన సమయం. ఇప్పుడు మీకు చెప్పబోయే న్యూస్ ఏమాత్రం లైట్ తీసుకోకండి. విజయవాడలో ఈగల్ …
Read More »బెజవాడలో పట్టపగలు జంట హత్యల కలకలం.. పరారీలో రౌడీ షీటర్!
విజయవాడలో నిన్న డబల్ మర్డర్లు చేసిన అనంతరం పరారైన రౌడీ షీటర్ జమ్మూ కిషోర్ కోసం 8 పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. క్యాటరింగ్ కు వెళ్లిన సమయంలో వచ్చిన డబ్బు పంపకాల్లో వచ్చిన వివాదంలో వెంకట్రావు, రాజుపై కిశోర్ కత్తితో దాడి చేశాడు. మృతుల వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. వెంకట్రావు బంధువులకు కబురు చేయగా.. మర్డర్ జరిగి 12 గంటలు అవుతున్న విజయవాడలో రాజు కుటుంబ సభ్యులు ఎవ్వరో తెలియక పోలీసులు తర్జన బర్జన పడుతున్నారు.. విజయవాడ పట్టణంలో పట్టపగలు ఇద్దరు …
Read More »ఇంద్రకీలాద్రిపై శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం.. 3 రోజులు వీఐపీ దర్శనాలు రద్దు
ఇంద్రకీలాద్రి పై అట్టహాసంగా శాకంభరి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. మొదటి రోజు ప్రత్యేక పూజలతో ప్రారంభం అయిన ఈ ఉత్సవాలు ఎల్లుండితో ముగియనున్నాయి… మూడు రోజులపాటు అమ్మవారితో పాటు ఆలయ ప్రాంగణం మొత్తం వివిధ రకాల కూరగాయలు ఆకుకూరలు పళ్ళతో అలంకరించనున్నారు.. అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ కనకదుర్గ కొలువైన ఇంద్రకీలాద్రిలో అంగరంగ వైభవంగా శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఇవాళ మొదటి రోజు కావడంతో కేవలం దాతలు ఇచ్చినటువంటి కూరగాయలు ఆకుకూరలు పళ్ళతోనే అలంకారం చేశారు ఆలయ అధికారులు. ఇవాల్టి అలంకరణకు దాదాపు …
Read More »బ్యాంకులో దుర్గమ్మ బంగారం డిపాజిట్.. ఎన్ని కిలోలు.. విలువ ఎంతంటే..?
బెజవాడ దుర్గమకు భక్తులు భారీ సంఖ్యలో కానుకలు సమర్పిస్తుంటారు. ఈ క్రమంలో దుర్గమ్మ బంగారాన్ని అధికారులు బ్యాంకులో డిపాజిట్ చేశారు. 29.5 కిలోల బంగారాన్ని అధికారులు ఎస్‌బీఐ బ్యాంకులో డిపాజిట్ చేశారు. అంతేకాకుండా భక్తులకు మరో గుడ్ న్యూస్‌ను కూడా ఆలయ అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ దుర్గమ్మ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. తమ మొక్కలు చెల్లించుకుని కానుకలు సమర్పిస్తుంటారు. ఈ క్రమంలో భక్తులు సమర్పించిన బంగారాన్ని ఆలయ అధికారులు బ్యాంకులో డిపాజిట్ …
Read More »వల్లభనేని వంశీకి మళ్లీ అస్వస్థత.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన కుటుంబసభ్యులు..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సోమవారం వంశీ శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు పడుతుండటంతో.. ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వంశీ ఉదయం కోర్టుకు హాజరైన అనంతరం అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు.. ప్రస్తుతం వంశీకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే, వల్లభనేని వంశీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని.. …
Read More »ఆంధ్రప్రదేశ్ స్త్రీనిధిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసైతే చాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న స్వయం సహాయక మహిళా గ్రూప్ (SHGs) స్త్రీనిధి క్రెడిట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా కోర్సులో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 170 పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తు విధానం, అర్హతలు, ఎంపిక విధానం వంటి ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోవచ్చు. …
Read More »ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తిరాజు సూసైడ్..! ఏం జరిగిందో..?
ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తి రాజు ఆత్మహత్య చేసుకున్నారు. విజయవాడలోని అయోధ్యనగర్ క్షత్రియభవన్‌లోని ఆయన నివాసంలో శుక్రవారం (జులై 4) రాత్రి సూసైడ్ చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్లు వ్యాపారాలు సాగిస్తున్న ప్రముఖ ఫార్మసీ కంపెనీ.. ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తి రాజు ఆత్మహత్య చేసుకున్నారు. విజయవాడలోని అయోధ్యనగర్ క్షత్రియభవన్‌లోని ఆయన నివాసంలో శుక్రవారం (జులై 4) రాత్రి సూసైడ్ చేసుకున్నారు. సమాచారం …
Read More »ఈ విషయం తెలుసా… కర్నూలు-విజయవాడ మధ్య విమాన సర్వీసులు షురూ
కర్నూల్ నుంచి విజయవాడకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇక్కడి నుంచి ఇండిగో విమాన సర్వీసులను కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రారంభించారు. విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అత్యధిక ఒత్తిడి ఈ విమాన సర్వీస్‌పైనే ఉందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు .ఏపీలో విమాన సర్వీసులు ప్రయాణికులకు వేగంగా అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా కర్నూల్ టు విజయవాడ విమాన సర్వీసులను వర్చువల్‌గా ప్రారంభించారు కేంద్ర విమానాయానశాఖమంత్రి రామ్మోహన్‌నాయుడు. ఇప్పటికే కర్నూలు నుంచి విశాఖ, చెన్నై, బెంగళూరుకు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు కర్నూల్ నుంచి విజయవాడకు …
Read More »