సినిమా

రాజకీయాలకు దూరంగా ఉన్నా విమర్శిస్తున్నారు.. అందుకే స్పందించను.. మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు..

నేను రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నా.. అయినా.. కొందరు నాపై అకారణంగా విమర్శలు చేస్తున్నారు .. ఆ విమర్శలకు నేను చేసిన మంచి పనులే జవాబు.. అంటూ మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.. సోషల్‌ మీడియాలో వచ్చే ట్రోల్స్‌పై తాను మాట్లాడకపోయినా తాను చేసిన మంచి మాట్లాడుతుందని అగ్ర కథానాయకుడు చిరంజీవి చెప్పుకోచ్చారు.. ఫీనిక్స్‌ ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో ఏర్పాటుచేసిన బ్లడ్‌ డొనేషన్‌ డ్రైవ్‌కు మెగాస్టార్ చిరంజీవి, తేజా సజ్జా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాలకు …

Read More »

ఐబొమ్మకు మూడిందా..? రంగంలోకి పవన్ ఫ్యాన్స్

పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వచ్చిన తొలి సినిమా ‘హరి హర వీరమల్లు’ పైరసీ బారిన పడింది. సినిమా విడుదలై మూడురోజుల్లా కాకముందే Ibomma, Movierulz లాంటి వెబ్‌సైట్లలో లీక్ కావడంతో తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం హరిహర వీరమల్లు ఇప్పుడు పైరసీ బారిన పడింది. పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత థియేటర్లలో విడుదలైన మొదటి సినిమా ఇదే కావడంతో.. …

Read More »

బెట్టింగ్ మాఫియాపై ఈడీ ఫోకస్.. ఈ సెలబ్రిటీలే నెక్స్ట్ టార్గెట్..?

బెట్టింగ్స్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్లపై పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగడంతో వారిలో టెన్షన్ నెలకొంది. ఈ క్రమంలో ఈడీ టార్గెట్ ఏంటీ.? అన్నది ఉత్కంఠగా మారింది. బెట్టింగ్ యాప్ వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగడంతో సినీ సెలెబ్రిటీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు, యూట్యూబర్స్‌పై ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. తెలంగాణలో బెట్టింగ్ యాప్ బారిన పడి అమాయక ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటుండగా పోలీసులు బెట్టింగ్ …

Read More »

ఫిష్ వెంకట్‌కు టాలీవుడ్ హీరో ఆర్థిక సాయం.. ఎన్ని లక్షలు పంపాడంటే?

టాలీవుడ్ ప్రముఖ తెలుగు నటుడు, కామెడీ విలన్‌ ఫిష్ వెంకట్ ప్రస్తుతం తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నాడు. కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆయన ఆరోగ్యం రోజు రోజుకూ క్షీణిస్తోంది. ప్రస్తుతం ఫిష్ వెంకట్ బోడుప్పల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు. తనదైన నటనతో తెలుగు ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిన ఫిష్ వెంకట్ ఇప్పుడు దీన స్థితిలో ఉన్నాడు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బోడుప్పల్‌లోని ఆర్బీఎం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రెండు కిడ్నీలు పని చేయకపోవడంతో ప్రస్తుతం …

Read More »

ఆఫ్ట్రాల్ ఏసీ టెక్నిషియన్ అనుకోకండి.. ఇంత పెద్ద టాలీవుడ్‌ను షేక్ చేశాడు

సినిమా రిలీజ్‌య్యే రోజే టెలిగ్రామ్‌ గ్రూపుల్లో లీక్ చేస్తున్న కిరణ్‌కుమార్‌ను హైదరాబాద్‌లో సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు 65కు పైగా సినిమాలను పైరసీ చేసిన అతడు, ఒక్కో సినిమాకు 300 డాలర్లు వసూలు చేసేవాడిగా తేలింది. క్రిప్టో కరెన్సీలో కమిషన్లు తీసుకుంటూ నెలకు లక్షలోపల సంపాదించేవాడని అధికారులు వెల్లడించారు. ఫిలిం ఛాంబర్ ఫిర్యాదుతో పట్టుబడ్డ కిరణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పరిశ్రమ డిమాండ్ చేస్తోంది. తెలుగు చిత్రసీమను వణికిస్తున్న పైరసీ మాఫియాలో కీలక నిందితుడైన కిరణ్‌కుమార్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. …

Read More »

సత్యసాయి గ్రామంలో మ్యూజిక్‌ మాస్ట్రో AR రెహమాన్ సందడి.. సాయి సంఫనీ ఆర్కెస్ట్రాపై ప్రశంసల జల్లు!

సత్యసాయి గ్రామంలో నిర్వహించిన సాయి సింఫనీ ఆర్కెస్ట్రా కార్యక్రమాన్ని మ్యూజిక్‌ మాస్ట్రో ఏఆర్‌ రెహమాన్ సందర్శించారు. ఇందులో గ్రామీణ, పేద నేపథ్యాల నుంచి వచ్చిన 170 మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద స్వదేశీ ఆర్కెస్ట్రా. రెహమాన్ సత్యసాయి గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా విద్యార్థులు ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించారు..మ్యూజిక్‌ మాస్ట్రో, గ్రామీ, ఆస్కార్ విజేత ఏఆర్‌ రెహమాన్ సత్యసాయి గ్రామాన్ని సందర్శించారు. గ్లోబల్ హ్యుమానిటేరియన్, ఆధ్యాత్మికవేత్త మధుసూదన్ సాయి నేతృత్వంలోని వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ వివిధ మానవతా కార్యక్రమాలను పర్యవేక్షించారు. …

Read More »

 కన్నప్పగా మంచు విష్ణు ఎంతవరకు మెప్పించారు..?

సినిమా చరిత్రలో కొన్నిటిని క్లాసిక్స్ గా చెప్పుకుంటాం. తరాలు మారినా తరగని ఆస్తులుగా పరిగణిస్తుంటాం. అలాంటి క్లాసిక్స్ నవతరాన్ని ఎప్పుడూ ఊరిస్తూనే ఉంటాయి. ఓ సారి ట్రై చేయమని కన్నుగీటుతూనే ఉంటాయి. అలా ఊరించిన సబ్జెక్టే కన్నప్ప. రెబల్‌స్టార్‌ కెరీర్‌లో కలికితురాయి ఈ మూవీ. అలాంటి సబ్జెక్టును యంగ్‌ రెబల్‌ స్టార్‌ వదులుకుంటారా? అనే ప్రశ్నలన్నటినీ దాటి.. ఇప్పుడు సిల్వర్‌స్క్రీన్‌ మీద సరికొత్తగా ల్యాండ్‌ అయింది. ఇంతకీ మంచు విష్ణు మలిచిన ఈ కన్నప్ప కథ ఎలా ఉంది? ప్రభాస్‌ పాత్ర పొందిగ్గా కుదిరిందా? …

Read More »

సినిమాల్లో ఛాన్స్‌ కావాలా? ఐతే ఈ కోర్సులు చేయండి.. వయసు ఎంతైనా ఓకే!

సినిమాలు, షార్ట్‌ ఫిల్మ్‌లు పుణెలోని ఫిల్మ్ అండ్‌ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII)లో ప్రవేశాలు పొందండి. 2025-26 విద్యాసంవత్సరానికి సినిమా, టెలివిజన్ రంగాల్లో ఆసక్తి, అర్హత గల అభ్యర్థుల నుంచి మాస్టర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (MFA), ఏడాది పోస్టు గ్రాడ్యుయేట్‌ సర్టిఫికేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతూ FTII నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నటన మాత్రమే కాదు దర్శకత్వం, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, స్క్రీన్‌ రైటింగ్, ఎడిటింగ్, సౌండ్‌ రికార్టింగ్ ఇలా తదితర రంగాల్లో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే రాత పరీక్ష …

Read More »

ఏపీ సీఎం చంద్రబాబుతో తెలుగు సినీ ప్రముఖుల కీలక భేటీ.. ఎప్పుడంటే!

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో తెలుగు సినీ పరిశ్రమ పెద్దటు, నిర్మాతలు, నటులు భేటీ కానున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు వారు సీఎం చంద్రబాబును కలవనున్నారు. తొలుత డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో భేటీ అయిన ఆ తర్వాత సీఎం చంద్రబాబును కలవనున్నారు సినీ పెద్దలు. అయితే ఏపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఇంత వరకు సినీ ప్రముఖులు సీఎంను కలిసింది లేదు. కేవలం డిప్యూటీ సీఎం పవన్‌ను మాత్రమే కలిశారు. అయితే, ఇటీవల థియేటర్ల బంద్‌కు సంబంధించిన విషయంపై స్పందించిన నటుడు, ఏపీ …

Read More »

రజాకార్ సినిమాను తప్పకుండా చూడాలన్న బండి సంజయ్.. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోందంటే?

తెలంగాణ చరిత్రలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రం రజాకార్. యాటా సత్యనారాయణ తెరకెక్కించిన ఈ సినిమాలో అన‌సూయ‌, ఇంద్ర‌జ‌, బాబీ సింహా, వేదిక‌, ప్రేమ‌, మ‌క‌రంద్ దేశ్ పాండే, రాజ్ అర్జున్‌, తేజ్ స‌ప్రు, జాన్ విజ‌య్‌, దేవీ ప్ర‌సాద్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.తెలంగాణ సాయిధ పోరాటంలో అమ‌రులైన యోధుల కథతో తెరకెక్కిన చిత్రం రజాకార్. అప్పటి ర‌జాక‌ర్ల దురాగ‌తాలను అణచివేసి హైద‌రాబాద్‌ను ఇండియాలో విలీనం చేసేందుకు ప‌టేల్ చేసిన ప్ర‌య‌త్నాలను ఈ మూవీలో చూపించారు. గతేడాది మార్చి 15న థియేటర్లలో …

Read More »