School Holiday : మంగళవారం కూడా స్కూళ్లకు, కాలేజీలకు సెలవు ఉందా? లేదా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సోమవారం సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఇంకా వర్ష బీభత్సం కనిపిస్తోంది. వాగులు వంకలు వరదతో పోటేత్తాయి. వర్షపు నీళ్లు ప్రవాహంలా మారి రోడ్లపైకి వచ్చేశాయి. చాలా చోట్ల ఇళ్లలోకి నీళ్లు వచ్చేశాయి. వాహనాలు ముగినిపోయాయి. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. అయితే.. ఎన్టీఆర్ జిల్లాలో వర్షాలు, వరద తీవ్రత దృష్ట్యా రేపు (బుధవారం) స్కూళ్లకు సెలవు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖాధికారి సుబ్బారావు తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలతో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఈ క్రమంలో ప్రభుత్వాలు మంగళవారం స్కూళ్లకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో.. ఈ జిల్లాలో విద్యాసంస్థలకు మంగళవారం సెలవు ప్రకటించారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా మంగళవారం విద్యాసంస్థలకు సెలవుగా ప్రకటించారు. అయితే.. మిగిలిన ప్రాంతాల్లో పరిస్థతిని బట్టి ఈరోజు (సెప్టెంబర్ 2) సాయంత్రం లోపు అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయా జిల్లాల్లో పరిస్థితులను బట్టి జిల్లా కలెక్టర్లు స్కూళ్లకు సెలవులపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
ఈ క్రమంలో.. పాఠశాలలకు సెలవులపై నిజామాబాద్, నిర్మల్ కలెక్టర్లు కీలక ఆదేశాలు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో.. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు రేపు (సెప్టెంబర్ 3, మంగళవారం) కూడా సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో.. విద్యార్థులు భద్రత దృష్ట్యా.. జిల్లాలోని అన్ని విద్యా సంస్థలు సెలవు పాటించాలని ఆయన సూచించారు.
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రోజున ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్,నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలెర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే ఏపీలో కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి. విజయవాడ, ఎన్టీఆర్ వంటి పలు జిల్లాల్లో భారీ వానలు పడుతున్నాయి. కొండ చరియాలు కూడా విరిగిపడి ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు కనిపించకుండానే నీళ్లు ప్రవహిస్తున్నాయి.