ధనుష్ రాయన్ సినిమా మీద ఇప్పుడు నేషనల్ వైడ్‌గా ఫోకస్ ఉంది. ధనుష్‌కు ఇంటర్నేషనల్ వైడ్‌గా మార్కెట్ ఉందన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్, హాలీవుడ్ వరకు ధనుష్ క్రేజ్ వెళ్లింది. ఇక ఇప్పుడు రాయన్ సినిమాతో మరోసారి తన దర్శకత్వ ప్రతిభను చాటుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ధనుష్ రాసిన ఈ కథలో రాయన్ అనే పాత్రలో మెప్పించేందుకు వచ్చాడు. నటుడిగా, దర్శకుడిగా ధనుష్‌కు రాయన్ ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి.
రాయన్ రిలీజ్ సందర్భంగా ధనుష్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ట్విట్టర్ మొత్తం రాయన్ సందడే కనిపిస్తోంది. ధనుష్ ఫ్యాన్స్ అయితే రాయన్ మీద పూర్తి నమ్మకంతో ఉన్నారు. బ్లడ్ బాత్ ఖాయమని కామెంట్లు చేస్తున్నారు. బుక్ మై షోలో బుకింగ్స్ జోరుగా ఉండటంతో మరింత ఖుషీ అవుతున్నారు. గంటలోనే లక్షల టికెట్లు తెగుతున్నాయని సంబరపడుతున్నారు. ఇంకా రాయన్ షోలు పడలేదని, అంతా షో కోసం వెయిట్ చేస్తున్నామని ట్వీట్లు వేస్తున్నారు..
ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని, సెకండ్ హాఫ్ మరింత అద్భుతంగా ఉందని, టైటిల్ కార్డ్ సూపర్ అని, ధనుష్ ఎంట్రీ పిచ్చ మాస్‌గా ఉందని ఓ ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్వీట్ పడింది. ఇంటర్వెల్, క్లైమాక్స్ బ్యాంగ్ అదిరిపోయిందని, ధనుష్, సూర్యల నటన అద్భుతమని ఇలా అందరూ రాసేట్టుగా జనరలైజ్ చేసి ఓ ట్వీట్ పెట్టేశాడు. అయితే ఈ ట్వీట్ మాత్రం నమ్మేలా అనిపించడం లేదు. అప్పుడు షో అయిపోవడం ఏంటి? ఇలా ట్వీట్ పెట్టడం ఏంటి? అనేలా ఉంది. ఇది ఫేక్ ట్వీట్ అని అర్థమవుతోంది. ఇది రీచ్ కోసమే చేసిన పనిలా ఉందనిపిస్తోంది.
చూస్తుంటే ఇంకా ఎక్కడా కూడా షోలు పడలేదనిపిస్తోంది. ఇండియాలో మొదటి ఆట తొమ్మిది గంటలకు ప్రారంభం అయ్యేలా ఉంది. ఓవర్సీస్ నుంచి టాక్ ఇంకా బయటకు రానట్టుగానే కనిపిస్తోంది. ట్విట్టర్‌లో మాత్రం రాయన్ సందడి కనిపిస్తోంది కానీ.. పర్‌ఫెక్ట్ టాక్ మాత్రం ఇంకా బయటకు రాలేదు. ట్విట్టర్ టాక్ తెలియాలంటే ఇంకాసేపు ఆగాల్సిందే.