ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తెలుగు ప్రజలకే కాదు.. దేశంలో రాజకీయాలంటే కనీస అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ పరిచయం అక్కర్లేని పేరు. నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం.. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైనం.. గతంలో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత.. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర.. ఇలా చెప్పుకుంటే పోతే చాలానే ఉంటుంది. చంద్రబాబును ఇన్నేళ్లుగా రాజకీయాల్లో చూస్తున్న వారికి.. పాత చంద్రబాబుకు, ప్రస్తుత చంద్రబాబుకు తేడా తెలుస్తూనే ఉంటుంది. భావోద్వేగాలకు అతీతంగా, పనే ప్రథమ కర్తవ్యంగా అధికారులను ఉరుకులు పరుగులు తీయించిన ఒకప్పటి చంద్రబాబుకు.. నేటి సీఎం చంద్రబాబుకు తేడా ఉంది. పనిలో వేగం తగ్గకపోయినా.. చంద్రబాబు పనితీరులో, అధికారులకు ఇచ్చే ప్రాధాన్యంలో మార్పు వచ్చింది. దానిని తెలియజేసే ఘటన తాజాగా జరిగింది.
Check Also
కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు సర్కార్.. ఇక యాక్షన్ షురూ..!
అమ్మభాషకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇకపై ఏపీలో ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో వెలువడనున్నాయి. తెలుగుభాష పరిరక్షణకు అందరూ కృషి …