తిరుపతిలోని శ్రీలక్ష్మీ శ్రీనివాస మ్యాన్‌పవర్ కార్పొరేషన్ (SLSMPC) ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD Temple)లో రెండేళ్ల కాంట్రాక్ట్ ప్రాతిపదికన మిడిల్ లెవెల్ కన్సల్టెంట్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 7 దరఖాస్తులకు చివరితేది.
ఇతర ముఖ్యమైన సమాచారం :
- మిడిల్ లెవల్ కన్సల్టెంట్ పోస్టులు: 03
- అర్హత: ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు జనరల్ అడ్మినిస్ట్రేషన్ లేదా ఆఫీస్ మేనేజ్‌మెంట్ లేదా రెలీజియస్ ఆర్గనైజేషన్ తదితరాల విభాగంలో 10 నుంచి 15 ఏళ్ల పని అనుభవం ఉండాలి. ఐటీ/ అనలిటికల్/ కమ్యూనికేషన్ తదితరాల్లో నైపుణ్యం కూడా ఉండాలి.
- వయోపరిమితి: అభ్యర్థుల వయసు 45 ఏళ్లు మించకూడదు.
- జీత భత్యాలు: నెలకు రూ.2 లక్షలతో జీతంతో పాటు అవసరమైన వసతి, ల్యాప్‌టాప్ సౌకర్యం కల్పిస్తారు.
- ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- పని చేసే స్థలం: తిరుపతి లేదా తిరుమలలో పనిచేయాల్సి ఉంటుంది.
- దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు దరఖాస్తులను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, శ్రీలక్ష్మీ శ్రీనివాస మ్యాన్‌పవర్ కార్పొరేషన్, పాత అలిపిరి గెస్ట్ హౌస్, తిరుపతి చిరునామాకు పంపించాలి.
- దరఖాస్తు పంపాల్సిన ఈ-మెయిల్ చిరునామా: recruitments.slsmpc@gmail.com
- దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: అక్టోబర్ 7, 2024