స్పందన కార్యక్రమం పేరును పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్‌గా మారుస్తూ ఉత్తర్వులు..

“స్పందన”(Spandana) కార్యక్రమం పేరును “పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్‌”(Public Grievance Redressal System)గా పునరుద్ధరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్వర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని సీఎస్ పేర్కొన్నారు.

అమరావతి: “స్పందన”(Spandana) కార్యక్రమం పేరును “పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్‌”(Public Grievance Redressal System)గా పునరుద్ధరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్(CS Nirab Kumar Prasad) ఉత్వర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని సీఎస్ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజా సమస్యలు, ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఫిర్యాదులు, సూచనల స్వీకరణకు స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో అనేక లోపాలు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దీంతో 2014లో చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్డ్రసల్ సిస్టమ్ పేరునే పునరుద్ధరిస్తూ టీడీపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

About amaravatinews

Check Also

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. ఆ పేపర్లపై హాల్‌టికెట్లు ప్రింట్‌ తీస్తే అనుమతి రద్దు: ఇంటర్‌ బోర్డు

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కొందరు విద్యార్ధులు ఫోన్‌కే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *