నెల్లూరు సమీపంలో వ్యాన్‌ను ఆపిన అధికారులు.. అందులో ఉన్నది చూసి షాక్..!

నెల్లూరు సమీపంలో వెళ్తున్న ఓ వ్యాన్‌ను ఆపిన అధికారులు.. అందులో తరలిస్తున్న వస్తువులు చూసి అవాక్కయ్యారు. ఎందుకంటే చైనా నుంచి దిగుమతి అయిన వెల్లుల్లిని అక్రమంగా తరలిస్తుండగా.. పట్టుకున్నారు. అయితే ఈ చైనా వెల్లుల్లిని కేంద్ర ప్రభుత్వం 20 ఏళ్ల క్రితమే నిషేధించడం గమనార్హం. చైనాలో వెల్లుల్లిని అపరిశుభ్రమైన వాతావరణంలో పండిస్తారని.. దాన్ని తినడం వల్ల మానవ ఆరోగ్యానికి ప్రమాదం అని ఇప్పటికే ఎంతో మంది తేల్చారు. అయినా ఇప్పటికీ దేశంలోకి చైనా వెల్లుల్లి అక్రమంగా వస్తుండటం తీవ్ర దుమారం రేపుతోంది. చైనా నుంచి అక్రమ మార్గాల్లో దేశ సరిహద్దులను దాటించి.. యధేచ్ఛగా వివిధ రాష్ట్రాలకు ఈ చైనా వెల్లుల్లిని విక్రయిస్తూ భారీగా డబ్బులు దండుకుంటున్నారు.

ఇటీవల వివిధ రాష్ట్రాల్లో ఈ చైనా వెల్లుల్లి ఎక్కడికక్కడ సీజ్ చేస్తుండటం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. నిషేధం ఉన్నా దేశంలోకి చైనా వెల్లుల్లి రావడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. నెల్లూరుకు సమీపంలో వెళ్తున్న వ్యాన్‌ను కస్టమ్స్ అధికారులు అడ్డుకుని తనిఖీలు నిర్వహించారు. అందులో 333 బస్తాల చైనా వెల్లుల్లిని తరలిస్తున్నట్లు గుర్తించారు. మొత్తం 10వేల కిలోల వెల్లుల్లిని తీసుకెళ్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వీటి విలువ రూ.21.97 లక్షలు ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్లాంట్ క్వారంటైన్ 2003 ఉత్తర్వుల ప్రకారం చైనా వెల్లుల్లిని దిగుమతి చేసుకోవడం, విక్రయించడం నిషేధం. బీహార్‌లోని జహంజర్పూర్ నుంచి ఈ చైనా వెల్లుల్లిని తమిళనాడులోని కోయంబేడుకు తీసుకెళ్తుండగా పట్టుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.దీంతో ఆంధ్రప్రదేశ్‌లోకూడా చైనా వెల్లుల్లిని విచ్చలవిడిగా విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

About amaravatinews

Check Also

వైసీపీ సంచలన నిర్ణయం.. పీఏసీ ఛైర్మన్ పదవికి నామినేషన్, మాజీ మంత్రికి ఛాన్స్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో కీలక పరిణామం జరిగింది. ఇవాళ శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, అండర్ టేకింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *