Cyber Crime: రూ.1.22 కోట్లు పోగొట్టుకున్న ప్రైవేటు ఉద్యోగి.. నిమిషాల్లోనే రికవరీ చేసిన పోలీసులు

ఇటీవల కాలంలో సైబర్ మోసాలు ఎక్కువయ్యాయి. రకరకాల పద్దతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులను టార్గెట్‌గా చేసుకొని చాలా ఈజీగా దోచేస్తున్నారు. సామాన్యుల అత్యాశను పెట్టుబడిగా చేసుకొని కోట్లు కొల్లగొడుతున్నారు. మెున్నటి వరకు ఈ కేవైసీ, గిఫ్ట్ కార్డులు, లక్కీ డ్రాలు, డ్రగ్స్ పార్సిల్స్ పేరుతో సైబర్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడ్డారు. ఇటీవల కాలంలో చాలా మంది యువత, ఉద్యోగులు ట్రేడింగ్ వైపు మెుగ్గు చూపుతుండటంతో అటుగా వారి ఫోకస్ పడింది. ఆన్‌లైన్ ట్రేడింగ్ పాఠాలు, చిట్కాలు, పెట్టుబడులు అంటూ చాలా ఈజీగా మోసాలు చేస్తున్నారు.

తాజాగా.. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో చిక్కుకొని రూ.1.22 కోట్లు పోగొట్టుకున్నాడు. హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులు వేగంగా స్పందించి రూ.1.05 కోట్లను రికవరీ చేశారు. నిమిషాల వ్యవధిలోనే డబ్బులు తిరిగి అకౌంట్లలో జమ చేయించారు. వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన ఓ వ్యక్తి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అయితో ఇటీవల బాధితుడికి సైబర్ మోసగాళ్లు ఓ లింక్‌ పంపించారు. తమ పేరుతో అకౌంట్ ఓపెన్ తెరిచి ఆన్‌లైన్ ట్రేడింగ్‌ చేస్తే కళ్లు చెదిరే లాభాలు వస్తాయని నమ్మించారు. దాంతో వారి మాటలు నమ్మిన సదరు వ్యక్తి.. చెప్పునట్లుగానే ఖాతా తెరిచాడు.

పలు ధపాలుగా మెుత్తం రూ.1.22 కోట్లు పెట్టుబడులు పెట్టాడు. అయితే లాభాలు చూపించకపోగా.. అసలు కూడా ఇవ్వకపోవటంతో బాధితుడు మోసపోయిన్నట్లు గ్రహించాడు. ఆలస్యం చేయకుండా వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన సైబర్‌ క్రైం డీసీపీ కవిత నేతృత్వంలో సైబర్‌ క్రైం కంట్రోల్ టీం.. బాధితుడు డబ్బు ఏ అకౌంట్లకు వెళ్లిందో తెలుసుకొని ఆ బ్యాంకు అకౌంట్లను స్తంభింపజేశారు. ఆ అకౌంట్‌లోని రూ.1.05 కోట్లు ఫ్రీజ్‌ చేయించారు. అనంతరం ఆ డబ్బును బాధితుడి అకౌంట్‌లో జమ చేయించారు.

About amaravatinews

Check Also

తమిళనాడులో విద్యార్థినిపై లైంగిక దాడి యత్నం.. రాజకీయంగా రచ్చ రేపుతోన్న తాజా ఘటన..

మహిళలపై జరిగే లైంగిక దాడి ఘటనలు ఒక్కోసారి ప్రభుత్వాలను ఇరకాటంలో పడేస్తుంటాయి. తాజాగా చెన్నై నగరంలో జరిగిన ఇలాంటి ఘటనతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *