క్కోలు జిల్లా కుర్రాడు ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. టెక్కలికి చెందిన త్రిపురాన విజయ్‌ను.. ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ కేపిటల్స్ టీమ్ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ యువ ఆల్‌రౌండర్ అటు ఏపీఎల్‌తో పాటుగా ఇటు రంజీ మ్యాచ్‌ల్లోనూ రాణిస్తూ ఇప్పుడు ఐపీఎల్‌లో ఛాన్స్ దక్కించుకున్నాడు. విజయ్‌ను, కుటుంబ సభ్యుల్ని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు అభినందించారు. ‘శ్రీకాకుళం జిల్లా నుంచి ఐపీఎల్‌కు ఎంపికైన త్రిపురాన విజయ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ప్రయాణం చాలా మందికి స్ఫూర్తిదాయకం. ఈ కొత్త అధ్యాయంలో మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాను-శ్రీకాకుళం గర్వపడేలా కష్టపడండి’ అంటూ ట్వీట్ చేశారు.
తమ కుమారుడు విజయ్ ఐపీఎల్‌కు ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉందంటున్నారు తల్లిదండ్రులు లావణ్య, వెంకట కృష్ణంరాజు. తమకు ఎంతో గర్వంగా ఉందని.. ఆ దేవుడు శ్రమకు తగిన ఫలితాన్ని అందించాడన్నారు. ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉందని.. తన కల నిజమైందన్నారు. తనను టీమ్‌లోకి తీసుకున్న ఢిల్లీ కేపిటల్స్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. తనకు టీమ్‌లో అవకాశం ఇస్తే నిరూపించుకుంటానని.. ఈ నాలుగు నెలలు బాగా ప్రాక్టీస్ చేస్తానన్నారు. తనను ఎంతగానో ప్రోత్సహించిన తల్లిదండ్రులు, జిల్లా క్రికెట్ సంఘం, ఆంధ్రా క్రికెట్ సంఘ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.