స్వింగ్‌ స్టేట్స్‌లో కమలా హ్యారిస్ దూకుడు.. పోల్ సర్వేల్లో ట్రంప్‌పై ఆధిక్యం

గతంలో ఎన్నడూలేని విధంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధిత్వం నుంచి అనూహ్యంగా జో బైడెన్ తప్పుకోవడం.. ఆయన స్థానంలో భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ పోటీకి వచ్చారు. ఆగస్టు 19న జరిగే డెమొక్రాటిక్ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో కమలా పేరును లాంఛనంగా ప్రకటించున్నారు. ఎన్నికలకు మరో మూడు నెలలే సమయం ఉండగా.. డెమొక్రాట్లకు అన్నీ శుభశకునాలే ఎదురవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న పోల్‌ సర్వేల్లో రిపబ్లికన్ అభ్యర్ధి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కమలా హారిస్‌ ఆధిక్యంలో ఉన్నట్లు తాజా సర్వేలో వెల్లడయ్యింది.

స్వింగ్‌ స్టేట్స్‌ విస్కాన్సిన్‌, పెన్సిల్వేనియా, మిచిగాన్‌‌లో న్యూయార్క్‌ టైమ్స్‌, సియానా కాలేజ్‌ సంయుక్తంగా పోల్‌ సర్వేని నిర్వహించాయి. ఈ సర్వేలో ట్రంప్ కంటే కమలా 4 శాతం మేర ఆధిక్యంలో ఉన్నట్లు వెల్లడయ్యింది. మూడు రాష్ట్రాల్లో ఆగస్టు 5 నుంచి 9 మధ్య నిర్వహించిన ఈ సర్వేలో ట్రంప్‌నకు 46 శాతం మద్దతు, కమలా హ్యారిస్‌కు 50 శాతం మద్దతు ఉన్నట్లు తేలింది. డెమొక్రటిక్‌ పార్టీ వైస్‌ ప్రెసిడెంట్‌ అభ్యర్థిగా మిన్నెసొటా గవర్నర్‌ టిమ్‌వాల్జ్స్‌‌ను ఎంపిక తర్వాత ఈ సర్వే చేపట్టారు. మిచిగాన్‌లో 4.8 శాతం, పెన్సిల్వేనియాలో 4.2 శాతం, విస్కాన్సిస్‌లో 4.3 శాతం అటుఇటుగా కమలా ముందంజలో ఉండటం విశేషం.

ఎన్నికల బరి నుంచి జో బైడెన్ వైదొలగకముందు ఈ రాష్ట్రాల్లో జరిగిన సర్వేలో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. ఇక, తాజా సర్వేలో హ్యారిస్‌కు పెన్సిల్వేనియాలో 10 పాయింట్లు పెరిగి అనుకూలతలో గణనీయమైన వృద్ధిని సాధించారు. స్వతంత్ర ఓటర్లు ఆమెను సమర్దవంతమైన నాయకురాలిగా భావిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్వింగ్ స్టేట్స్‌లో ఓటర్లే అత్యంత కీలకం. రిపబ్లికన్‌లు ఎదురు దాడి చేస్తున్నప్పటికీ హ్యారిస్‌కు డెమొక్రాట్లు గట్టిగా మద్దతు ఇస్తున్నారు. మే నుంచి ఈ మూడు మధ్య పశ్చిమ రాష్ట్రాల్లో ఓటర్లు సంతృప్తి 27 పాయింట్లు పెరిగింది.

అయితే, దేశవ్యాప్తంగా డెమొక్రాట్ల ఓట్లపై హ్యారిస్ హారిస్ మరింత దృష్టిసారించాలి. గత పోల్‌లో 60% మంది ట్రంప్‌నకు.. 53% మంది హ్యారిస్‌కు స్పష్టమైన విధానం ఉందని అభిప్రాయపడ్డారు. ఎకనామీ, ఇమ్మిగ్రేషన్‌లో ట్రంప్‌దే ఆధిపత్యం కాగా.. అబార్షన్ విషయంలో హ్యారిస్‌కు అనుకూలంగా ఉంది. కాగా, ఇటీవల ప్రముఖ వార్తా సంస్థ నిర్వహించిన పోల్ సర్వేలో సైతం ట్రంప్‌ కంటే కమలా హారిస్ ఆధిక్యంలో ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆమెకు విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. నవంబరు 5న అమెరికా అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రిపబ్లికన్, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థుల ప్రచారాలు ఊపందుకున్నాయి. ఎన్నికల్లో భాగంగా సెప్టెంబరు 10 కమలా హ్యారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య డిబేట్ జరగనుంది.

About amaravatinews

Check Also

Adani Group: రూ.2100 కోట్ల లంచం ఆరోపణ.. అమెరికాలో కేసు.. అదానీ గ్రూప్ స్పందన ఇదే!

Adani Group: రూ.2100 కోట్ల లంచం, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం వంటి ఆరోపణలతో అదానీ గ్రూప్‌పై కేసు నమోదైన సంగతి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *