అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా.. ఫలితాలు వెలువడుతున్నాయి. ఆరంభంలో దూకుడు ప్రదర్శించిన డొనాల్డ్ ట్రంప్.. కమలా హ్యారిస్ కంటే 100 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు లీడ్‌లో ఉన్నారు. కానీ, క్రమంగా పుంజుకున్న డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధి కమలా హ్యారిస్.. 200 మార్క్ దాటారు. దీంతో ఇరువురి మధ్య ప్రస్తుతం కేవలం 20 ఓట్ల తేడా మాత్రమే ఉంది. అయితే, స్వింగ్ స్టేట్స్‌లో ట్రంప్ ఆధిక్యంలో ఉండటంతో ఆయనకు గెలుపు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. 24 రాష్ట్రాల్లో గెలిచి.. మరో ఐదు రాష్ట్రాల్లో ఆధిక్యంలో ఉన్నారు ట్రంప్. కమలా 17 రాష్ట్రాల్లో గెలిచి.. మరో 6 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.
అధ్యక్ష ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు సమాంతరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు 39 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు మొదలైంది. ఇందులో డొనాల్డ్ ట్రంప్ 24, కమలా హ్యారిస్ 16 రాష్ట్రాట్లో ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం వెలువడిన ఫలితాల సరళిని చూస్తే ట్రంప్ తిరుగులేని విజయం సాధించే అవకాశం ఉంది. కానీ, ఇంకా ఓటింగ్ ప్రక్రియ సాగడంతో పరిస్థితి మారుతుందని భావిస్తున్నారు. ట్రంఫ్ 230, కమలా 210 ఎలక్టోరల్ ఓట్లు గెలుపొందారు. కీలక రాష్ట్రం నెవాడాలో ఇంకా ఓట్ల లెక్కింపు ప్రారంభం కాలేదు. అక్కడ మరికొద్ది సేపట్లో ఓట్లను లెక్కించనున్నారు. అయితే, ఇవి తేలడానికి రెండు రోజుల సమయం పడుతుంది.
కాలిఫోర్నియా రాష్ట్రంలో డెమొక్రాటిక్ అభ్యర్ధి కమలా హ్యారిస్ విజయం సాధించారు. అక్కడ మొత్తం 54 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా.. కమలా గెలుపుతో ఆ ఓట్లు డెమొక్రాట్లకు వచ్చాయి. ప్రస్తుతం 13 రాష్ట్రాల్లో విజయం సాధించిన కమలాకు.. 187 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. డొనాల్డ్ ట్రంప్ 24 రాష్ట్రాల్లో మొత్తం 230 ఓట్లు సాధించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా మారిన స్వింగ్ స్టేట్స్ జార్జియా, పెన్సిల్వేనియా, జార్జియా, విస్కాన్సిస్, ఆరిజోనా, నార్త్ కరోలినా, నెవాడో ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి. ప్రస్తుతం ఆరిజోనా మినహా మిగతా ఆరు రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. పెన్సిల్వేనియాలో ట్రంప్ ముందు వెనుకబడినా.. తర్వాత పుంజుకుని ప్రస్తుతం లక్ష ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.