వాటే సీన్.. దేవీ.. హర్‌ ఘర్‌ తిరంగా సాంగ్ పాడుతుండగా.. ప్రధాని ఎంట్రీ..

నమో అమెరికా. అగ్రరాజ్యంలో భారతీయం ప్రతిధ్వనించింది. ప్రధాని మోదీకి ఆత్మీయ స్వాగతం పలికారు ఎన్నారైలు. మోదీ మోదీ అనే నినాదాలతో న్యూయార్క్‌ మార్మోగింది. భిన్నత్వంలో ఏకత్వం. భాష ఏదైనా మనందరి మనసు భారతీయం…అన్న మోదీ ప్రసంగానికి ముగ్దులయ్యారు ఎన్నారైలు. A ఫర్‌ అమెరికన్స్‌..I ఫర్‌ ఇండియన్స్‌ అంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ కి సరికొత్త అర్ధం చెప్పారు మోదీ. భారత్‌-అమెరికా జోడి ప్రజాస్వామిక ప్రపంచానికి సరికొత్త దిశ-దశను చూపిస్తుందన్నారు.

సప్తసముద్రాల అవతల భారతీయం పరిమళించింది. అగ్రరాజ్యంలో దేశభక్తి ఉప్పొంగింది. తెలుగు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌, ఏకంగా ప్రధాని మోదీ సమక్షంలో న్యూయార్క్‌లో దేశభక్తి గీతం ఆలపించారు. హర్‌ ఘర్‌ తిరంగా పాటతో ప్రధాని మోదీ అభిమానం చూరగొన్నారు. న్యూయార్క్‌లో ప్రవాస భారతీయులు పాల్గొన్న “మోదీ అండ్‌ యూఎస్‌” కార్యక్రమంలో దేవిశ్రీ ప్రసాద్‌ పాట పాడటం ఒక హైలైట్‌ అయితే, సరిగ్గా అదే సమయంలో ప్రధాని మోదీ వేదిక మీదకు రావడం మరో హైలైట్‌. మన సంగీత దర్శకుడిని ప్రధానమంత్రి అభినందించారు.

ప్రధాని మోదీ సమక్షంలో హర్‌ ఘర్‌ తిరంగా పాట పాడటం గర్వకారణంగా ఉందన్నారు దేవిశ్రీ ప్రసాద్‌. తనను ప్రధాని మోదీ అభినందించారని TV9తో చెప్పారాయన. కార్యక్రమం తర్వాత కూడా మోదీ తనను అభినందించారని చెప్పారు. మోదీ శాంతియుతమైన, స్ఫూర్తిదాయకమైన నాయకుడు అని దేవిశ్రీ ప్రసాద్‌ కొనియాడారు. శ్రోతల అభిమానం, ప్రేమ వల్లే తనకు ఈ స్థాయి వచ్చిందని చెప్పారు.

About amaravatinews

Check Also

బాబోయ్..కరోనా కంటే 7 రెట్లు ఎక్కువ ప్రాణాంతకమైన అంటువ్యాధి రాబోతోంది..!- WHO హెచ్చరిక!!

1720లో ప్లేగు, 1817లో కలరా, 1918లో స్పానిష్ ఫ్లూ, 2019లో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది. ప్రపంచంలోని ఏ దేశమూ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *