శ్రీశైలం ఆలయంలో అపచారం జరిగింది.. ఓ ఉద్యోగి మద్యం సేవించి విధులకు హాజరయ్యాడు. ఉద్యోగి తీరు తేడాగా ఉండటంతో భక్తులకు అనుమానం వచ్చింది.. అతడ్నిపట్టుకుని భక్తులు చితకబాదారు. గురువారం రాత్రి 9 గంటలకు క్యూ కంపార్టుమెంట్‌లో ఈ ఘటన జరిగింది. అనంతరం కొంతమంది భక్తులు ఆలయ క్యూలైన్ల దగ్గర బైఠాయించి నిరసనను తెలియజేశారు. ఈ విషయం తెలియడంతో ఆలయ అధికారి జి.స్వాములు అక్కడికి వచ్చారు. ఆందోళన విరమించాలని భక్తుల్ని కోరారు.
ఆలయ అధికారి భక్తులకు సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. ఆలయ సిబ్బంది మద్యం తాగి విధుల్లో పాల్గొంటే ఏం చేస్తున్నారని భక్తులు ఆయన్ను కూడా నిలదీశారు. శ్రీశైలం మల్లన్న ఆలయ పవిత్రతను కాపాడటంలో అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై శుక్రవారం ఉదయం ఈవో పెద్దిరాజుకు భక్తులు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఈవో తెలిపారు.
Amaravati News Navyandhra First Digital News Portal