విజయవాడలో డయేరియా కేసుల పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ ఓవైపు బాధితులు కోలుకుని ఇంటికి వెళ్తుంటే మరోవైపు కొత్త కేసులు నమోదవుతున్నాయి. న్యూ రాజరాజేశ్వరి పేట వైద్య శిబిరంలో ఈ రోజు కొత్తగా మరో 5 గురు అడ్మిట్ అయ్యారు. దీంతో 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరి పేటలో సచివాలయాల వారీగా..
విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియా బాధితులు కోలుకుంటున్నారు. ఇప్పటివరకు మొత్తం 115 కేసులు నమోదైనాయి. వీరిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారు 61 మంది. చికిత్స తీసుకొని మరో 54 మంది డిశ్చార్జ్ అయినారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అక్కడ మెడికల్ క్యాంప్ కొనసాగుతుంది. డయేరియా కారణంగా స్థానికులు కాచి చల్లార్చిన నీరే తాగాలని వైద్యాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బాధితులకు మెడికల్ టెస్ట్‌లు కొనసాగుతున్నాయి.
ఇక్కడి డయేరియా కేసుల పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ ఓవైపు బాధితులు కోలుకుని ఇంటికి వెళ్తుంటే మరోవైపు కొత్త కేసులు నమోదవుతున్నాయి. న్యూ రాజరాజేశ్వరి పేట వైద్య శిబిరంలో ఈ రోజు కొత్తగా మరో 5 గురు అడ్మిట్ అయ్యారు. దీంతో 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరి పేటలో సచివాలయాల వారీగా బృందాలు ఇంటింటి సర్వే చేస్తున్నాయి. ఎంపీడీవో స్థాయి అధికారి పర్యవేక్షణలో బృందాలుగా ఏర్పడి ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. జ్వర పీడితులు, వాంతులు, విరేచనాలతో ఎవరైనా బాధపడుతున్నారా? అనే సమాచారాన్ని సేకరించే పనిలో అధికార గణం పని చేస్తుంది.
100 దాటిన డయేరియా కేసులు
విజయవాడ పాత రాజరాజేశ్వరి పేటలో పెరుగుతున్న డయేరియా కేసులు.. ఇప్పటివరకు 100 దాటిన డయేరియా బాధితుల సంఖ్య. నిన్న రాత్రి మెడికల్ క్యాంప్‌లో 30 మంది చికిత్స కోసం వచ్చారు. మరికొందరు బాధితులు వైద్యానికి ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తున్నారు. ఇప్పటికే పైప్‌లైన్ ద్వారా నీటి సరఫరా నిలిపివేసిన అధికారిక యంత్రాంగం.
‘డయేరియాతో ఎవరూ చనిపోలేదు.. వదంతులు నమ్మకండి’ మంత్రి సత్యకుమార్
విజయవాడలోని న్యూరాజరాజేశ్వరిపేటలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. మంచినీటి పైపులైన్, అండర్ గ్రౌండ్ నీటి నమూనాలను పరీక్షకు పంపించామన్నారు. మరోవైపు ల్యాబ్ రిపోర్ట్ నెగెటివ్ రావడంతో మంచినీటి సరఫరా కూడా నిలిపివేశామన్నారు. ఇప్పటి వరకు డయేరియాతో ఎవరూ చనిపోలేదని, వదంతులు నమ్మొద్దని మంత్రి సత్యకుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.