ఏకంగా 13 రోజులు దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. Dussehra Holidays తేదీలివే!

అక్టోబర్‌ నెలలో తెలంగాణలోని స్కూళ్లకు వరుసగా 13 రోజులు దసరా (Dasara Holidays) సెలవులు రానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దీంతో.. అక్టోబర్ 15వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. దీంతో ఈసారి ఏకంగా 13 రోజుల పాటు దసరా సెలవులు రానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి (Gandhi Jayanti 2024) నాడు సెలవులు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత నుంచి బతుకమ్మ, దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు వివరించారు.

తెలంగాణ ప్రభుత్వం మే 25వ తేదీన 2024-25 విద్యాసంవ‌త్స‌రానికి సంబంధించిన అకడమిక్‌ క్యాలెండ‌ర్‌ను విడుద‌ల చేసింది. ఆ క్యాలెండర్‌ ప్రకారం.. అక్టోబ‌ర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వ‌ర‌కు ద‌స‌రా సెల‌వులు.. డిసెంబ‌ర్ 23 నుంచి 27 వ‌ర‌కు క్రిస్మ‌స్ సెల‌వులు.. జ‌న‌వ‌రి 13 నుంచి 17వ తేదీ వ‌ర‌కు సంక్రాంతి సెల‌వులు ప్ర‌క‌టించారు. 2025 ఏప్రిల్ 23వ తేదీ వ‌ర‌కు పాఠ‌శాల‌లు కొన‌సాగ‌నున్నాయి. 2025 ఫిబ్ర‌వ‌రి 28వ తేదీ లోపు 10వ త‌ర‌గ‌తి ప్రీ ఫైన‌ల్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. 2025 మార్చిలో 10 త‌ర‌గ‌తి వార్షిక ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు.

About amaravatinews

Check Also

అబ్బో.. పోలీసుల సన్మానం మామూలుగా లేదుగా! ఖాకీలతో పూలదండలు, మర్యాదలంటే మాటలా..

ఎవరైనా కొత్తగా కొన్న బైకులో లేదా కారులో గాయపడిన వారిని, ప్రమాదంలో ఉన్న వారిని ఎక్కించుకుని తీసుకెళ్లడం అశుభంగా పరిగణిస్తారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *