మనుషుల్లా జంతువులకు, పక్షులకు అనారోగ్య సమస్యలు వస్తాయి. అవి తమ ఆహారం కోసం నిరంతరం తిరుగుతూ ఉంటాయి. కనుక వాటికీ శరీరానికి ఆ శ్రమ సరిపోతుంది. ఐతే జూలు , ఆలయాల్లోనూ ఉండేవి , ఇళ్లలో పెంచుకునే జంతువులకు నడక చాలా అవసరం అని చెబుతున్నారు. ఈ నేపధ్యంలో చిన వెంకన్న ఆలయంలో గజలక్ష్మిగారు మావటిల పర్యవేక్షణలో రోజూ ఉదయమే సరదాగా వాకింగ్ చేస్తున్నారు.
రోజుకు ఏడువేల అడుగులు నడిస్తే మనిషి ఆయుఃప్రమాణం పెరుగుతుందని చెబుతున్నారు. కుర్చీలకే పరిమితమయ్యే ఉద్యోగాల వల్ల వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవటం వల్ల ఊబకాయం, షుగర్ లతో పాటు పలు అనారోగ్య సమస్యలను మనిషి ఎదుర్కొంటున్నాడు. వీటి నుంచి బయటపడేందుకు ఉదయం, సాయంత్రం నడక అలవాటు చేసుకోవటం, యోగా లేదంటే ఇటీవల జిమ్ లకు ఎక్కువమంది వెళుతున్నారు. ఇక మనుషుల్లా జంతువులు , పక్షులకు అనారోగ్య సమస్యలు వస్తాయి. అవి తమ ఆహారం కోసం నిరంతరం తిరుగుతూ ఉంటాయి కనుక వాటి శరీరానికి ఆ శ్రమ సరిపోతుంది. ఐతే జూల్లో నివసించే జంతువులకో లేదా ఆలయాల్లో ఉండేవి, ఇళ్లలో పెంచుకునే జంతువుల పరిస్థి ఏంటి. ఖచ్చితంగా వాటికి నడక చాలా అవసరం అని చెబుతున్నారు.
ఈ క్రమంలోనే ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో గజలక్ష్మిని ను అక్కడి మావటీలు రోజుకు 5 కిలోమీటర్లు వాకింగ్ కి తీసుకు వెళుతున్నారు. ఇప్పటువరకు ఈ గజలక్ష్మి కొండపైన ఉండేది. అన్నదానం, శివాలయానికి వెళ్లే భక్తులు, పిల్లలు అక్కడ ఆగి గజలక్ష్మిని చూస్తారు. కొందరు తమ వద్ద వున్న అరటి పండ్లు , ఫలహారాలు పెట్టి ఆశీర్వాదం తీసుకుంటారు. ఉత్సవాలు, సేవల సమయం మినహా మిగతా సమయం మొత్తం గజలక్ష్మి షెడ్ కే పరిమితం అవుతుంది.
ఈ నేపధ్యంలో ఆలయ అధికారులు వైద్యుల సూచనల మేరకు గజలక్ష్మిని వాకింగ్ చేయించాలని నిర్ణయించారు. ఈ మేరకు మావటీలు నిత్యం చినవెంకన్న కొలువైన కొండ ప్రాంతాల్లో ఏనుగుకు నడక అలవాటు చేశారు. గజలక్ష్మి వీధుల్లోకి వచ్చి వయ్యారంగా వాకింగ్ చేస్తుండడంతో భక్తులు సైతం ఆసక్తికరంగా దాన్ని చూస్తున్నారు. కాగా ఆలయంలో ఈ ఏనుగు గత 25 ఏళ్లుగా స్వామి వారి సేవలో తరిస్తుంది. భక్తులను ఆశీర్వదిస్తుంది.