Assembly Elections 2024 Date: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్‌మీట్ నిర్వహించి ఎన్నికల తేదీలను వెల్లడించింది. మహారాష్ట్ర అసెంబ్లీకి ఒకే విడతలో ఎన్నికలు జరగనుండగా.. జార్ఖండ్‌లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. వీటితోపాటు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కూడా వెలువరించింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్
- నోటిఫికేషన్ – అక్టోబర్ 22
- నామినేషన్ల దాఖలకు చివరి తేదీ – అక్టోబర్ 29
- నామినేషన్ల స్క్రూటినీ – అక్టోబర్ 30
- నామినేషన్ల విత్ డ్రాకు చివరి తేదీ – నవంబర్ 4
- మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ – నవంబర్ 20
- మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీ – నవంబర్ 23
Amaravati News Navyandhra First Digital News Portal