మహారాష్ట్ర, ఝార్ఖండ్ శాసనసభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (EC) మంగళవారం మధ్యాహ్నం విడుదల చేయనుంది. ఇందు కోసం మధ్యాహ్నం 3.30 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నట్టు ఈసీ వెల్లడించింది. ఈ రెండు రాష్ట్రాలతో పాటు రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన వయనాడ్ లోకసభ స్థానం, దేశంలోని పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 45 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల తేదీలను ప్రకటించనుంది. వాస్తవానికి హర్యానా, జమ్మూ కశ్మీర్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పుడే మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లకు తేదీలను ప్రకటిస్తారని భావించారు. కానీ, ఈసీ కేవలం రెండు రాష్ట్రాలకు మాత్రమే షెడ్యూల్ ప్రకటించి, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లను పక్కనబెట్టింది.
Amaravati News Navyandhra First Digital News Portal