విద్యుత్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. మళ్లీ ఆ యాప్‌లలో బిల్లులు కట్టొచ్చు.. కానీ..!

విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్. మునుపటిలాగే.. మొబైల్‌లో ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లాంటి యాప్‌ల ద్వారా కరెంట్ బిల్లులు కట్టేందుకు మార్గం సుగమమైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ఫలితంగా.. జులై 1 నుంచి కరెంట్ బిల్లుల చెల్లింపులు.. థర్డ్ పార్టీ యాప్‌లలో నిషేదించిన విషయం తెలిసిందే. అయితే.. విద్యుత్తు బిల్లుల చెల్లింపులను సరళీకృతం చేసేందుకు తెలంగాణలోని టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్, ఆంధ్రప్రదేశ్‌లోని ఏపీసీపీడీసీఎల్‌లు భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టం(BBPS)లో చేరిపోయాయి. డిస్కంలు బీబీపీఎస్‌లోకి రావడంతో ఇకపై బ్యాంకులు, ఫిన్‌టెక్‌ యాప్‌లు, వెబ్‌సైట్‌లతో పాటు బీబీపీఎస్‌ ఆధారిత ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కూడా కరెంట్ బిల్లులను సురక్షితంగా చెల్లించవచ్చని అధికారులు ప్రకటించారు. విద్యుత్‌ సంస్థలు బీబీపీఎస్‌లోకి చేరుతుండటంతో యూపీఐ చెల్లింపులకు మార్గం సుగమం అవుతోంది.

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న టీజీఎస్పీడీసీఎల్‌ ఇప్పటికే ఫోన్‌ పే ద్వారా చెల్లింపులను స్వీకరిస్తోంది. మిగతా సంస్థలతోనూ చర్చిస్తున్నామని.. గూగుల్‌ పే, అమెజాన్‌ పే ద్వారా కూడా రాబోయే రోజుల్లో చెల్లించవచ్చని ఓ అధికారి తెలిపారు.

ఇదిలా ఉంటే.. ఈ యూపీఐ యాప్‌ల ద్వారా కరెంట్ బిల్లుల చెల్లింపుల వల్ల డిస్కంలపై భారం పడనుంది. ప్రతీ లావాదేవీకి రూ.2 తో పాటు అదనంగా జీఎస్టీని కూడా.. భారత జాతీయ చెల్లింపుల సంస్థకు డిస్కంలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో.. ప్రతి నెలా 15 కోట్ల వరకు రెండు డిస్కంలపై అదనపు భారం పడనుంది. ఆర్బీఐ మార్గదర్శకాలు రానంతవరకు గూగుల్, ఫోన్ పే లాంటి డిజిటల్ పేమెంట్ యాప్‌లో కరెంట్ బిల్లులు కడిటే.. డిస్కంలు అదనంగా చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండేది కాదు. కాగా.. ఆర్బీఐ మార్గదర్శకాలతో.. డిస్కంలపై అదనపు భారం పడుతోంది.

ఇదిలా ఉంటే.. కరెంట్ చెల్లింపులకు థర్డ్ యాప్‌ల కంటే డిస్కంల యాప్‌లే సురక్షితమని అధికారులు చెప్తున్నారు. గూగుల్ ప్లే స్టోర్‌లో టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్ యాప్‌లు లేదా సంబంధిత వెబ్‌సైట్‌లలోకి వెళ్లి బిల్లులు చెల్లించటం సేఫ్ అని అధికారులు సూచిస్తున్నారు. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినా… నేరుగా అధికారులను సంప్రదించే అవకాశం ఉంటుదని అధికారులు చెప్తున్నారు.

About amaravatinews

Check Also

అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో

ఆంధ్రాకు ఇంకా వర్షాలు వీడలేదు. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి. కోస్తా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *