ఏడిపించేశావయ్యా.. నాగ చైతన్య- సమంతలపై ఈ వీడియోలు చూశారా?

నాగ చైతన్య- శోభిత ధూళిపాళ నిశ్చితార్థం జరిగిన దగ్గరి నుంచి సోషల్ మీడియాలో ఒకటే చర్చ. సమంత దీనిపై ఎలా రియాక్ట్ అవుతుంది..? ఇదే పని సామ్ చేసి ఉంటే అందరూ ఏమనేవారు అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. నిజమే.. చైతూ హార్ట్ బ్రేక్ నుంచి ఇప్పుడు కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నాడంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. కానీ ఇదే సమంత ఎవరితోనైనా కొత్త జీవితం మొదలుపెట్టుంటే ఆమె గురించి ఏ రేంజ్‌లో పోస్టులు పెట్టేవారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే అక్కినేని ఫ్యాన్స్‌లో కూడా చాలా మంది సమంతకి అభిమానులే. నిజానికి సమంత ఈ టైమ్‌లో ఎంత బాధపడుతుందనే విషయం పక్కన పెడితే సామ్-చై కామన్ ఫ్యాన్స్ మాత్రం నెటిజన్లను ఏడిపించేస్తున్నారు.

ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలుండగా

‘ఏమాయ చేసావే’ చిత్రంతో మొదలైన సమంత-నాగ చైతన్యల బంధం చివరికి వారికి ఎంత బాధను మిగిల్చిందో అభిమానలకీ అంతే విషాదాన్ని మిగిల్చింది. చివరికి ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకున్నారులే అనుకుంటే చై మరొకరితో బంధంలోకి అడుగుపెడుతున్నారు. దీంతో వీళ్ల కామన్ ఫ్యాన్స్ చై-సామ్ పాత వీడియోలను తిరగదోడి అన్నీ మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. ఏమాయ చేసావే సినిమాలోని ఓ డైలాగ్ ఎప్పటికీ మర్చిపోలేం. “ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలున్నా నేను జెస్సీనే ఎందుకు లవ్ చేశాను” అంటూ చై చెప్పే డైలాగ్ నిజ జీవితంలో కూడా పలు సందర్భాల్లో సమంతను ఉద్దేశించి చెప్పారు. ఇప్పుడు అవే వీడియోలను ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు.

నేను సామ్‌నే ఎందుకు లవ్ చేశాను అంటూ చై అడిగితే ఎందుకంటే నేను నీకు వేరే ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి అంటూ ఓ ఇంటర్వ్యూలో సమంత నవ్వుతూ చెబుతుంది. దీనికి చై చెప్పిన ఆన్సర్ వేరే లెవల్లో ఉంది. అయినా నాకు సామ్ కాకుండా వేరే ఆప్షన్ కూడా వద్దు అంటూ చైతూ ఇచ్చిన ఆన్సర్‌కి సమంత ఐ లవ్ యూ అంటూ ముద్దుగా చెబుతున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అంతేకాకుండా సమంత-నాగ చైతన్య సినిమాల్లో సీన్స్, నిజజీవితంలో వారి పెళ్లి, రిసెప్షన్ వీడియోలు కలిపి ఎమోషనల్‌గా ఎడిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఈ ఫ్యాన్ మేడ్ వీడియోలు చూసిన నెటిజన్లు.. వాళ్లు ఎంత బాధపడ్డారో తెలీదు కానీ ఈ వీడియో చేసిన వాడు మాత్రం ఖచ్చితంగా చాలా ఫీల్ అయ్యాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా సామ్-చై జంట ఎప్పటికీ సూపర్ హిట్టే.. అది ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా అంటున్నారు అభిమానులు.

About amaravatinews

Check Also

మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే ప్రభుత్వం సీరియస్‌: రేవంత్ రెడ్డి

గంటలుగా కొనసాగుతున్న సీఎం, సినీ పరిశ్రమ పెద్దల భేటీ . బెనిఫిట్ షోలు ఉండవని తేల్చి చెప్పిన సీఎం రేవంత్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *