మినిమమ్ బ్యాలెన్స్ లేని ఖాతాల నుంచి 8500 కోట్ల ఫైన్ వసూలు.. నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు

Bank Account: బ్యాంకుల్లో సేవింగ్స్ ఖాతాలు ఉన్నట్లయితే వాటిల్లో కనీస బ్యాలెన్స్ మెయింటెన్ చేయాలని సూచిస్తుంటారు. ఒక వేళ బ్యాంక్ రూల్స్ ప్రకారం మినిమమ్ బ్యాలెన్స్ లేనట్లయితే పెనాల్టీలు విధిస్తారు. అయితే కొన్ని బ్యాంకు ఖాతాలకు మినహాయింపు ఉంటుంది. కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ వంటి దిగ్గజ బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్ లేని అకౌంట్ల నుంచి ఏకంగా రూ.8500 కోట్లు వసూలు చేశాయట. ఈ అంశంపై రాజ్యసభలో చర్చకు వచ్చింది. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ క్లారిటీ ఇచ్చారు.

జన్ ధన్ అకౌంట్లతో పాటు ప్రాథమిక సేవిగంస్ అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ ఉండాల్చిన అవసరం లేదని స్పష్టం చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. గత 5 సంవత్సరాల కాలంలో కనీస బ్యాలెన్స్ లేదనే కారణంగా ఖాతాదారుల నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులు వేల కోట్ల రూపాయలు పెనాల్టీగా వసూలు చేయడంపై రాజ్యసభలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ అంశంపై ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిచ్చారు. మినిమమ్ బ్యాలెన్స్ లేని అకౌంట్ల నుంచి పెనాల్టీలు వసూలు చేస్తున్నప్పటికీ.. పీఎం జన్ ధన్ అకౌంట్లు, పేద ప్రజలకు చెందిన బేసిక్ అకౌంట్లకు వీటి నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు.

2019- 20 ఆర్థిక సంవత్సరం నుంచి గడిచిన 5 సంవత్సరాల సమయంలో బ్యాంక్ ఖాతాదారుల నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులు కనీస బ్యాలెన్స్ లేదనే కారణందా ఏకంగా రూ. 8,500 కోట్లు వసూలు చేసినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఇందులో ఒక్క 2023-న24 ఆర్థిక సంవత్సరంలోనే ప్రభుత్వ బ్యాంకులు తమ ఖాతాదారుల నుంచి ఏకంగా రూ. 2,331 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. ఈ అంశంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఈ క్రమంలోనే రాజ్యసభలో ప్రశ్నించగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిచ్చారు. జన్ ధన్ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేదన్నారు.

About amaravatinews

Check Also

బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి చౌకైన ప్లాన్‌.. 6 నెలల వ్యాలిడిటీ.. 3600జీబీ డేటా

BSNL: ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ BSNL అత్యంత ప్రజాదరణ పొందిన టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌లలో ఒకటి. అది అందిస్తున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *