Kuwait లో అగ్నిప్రమాదం – స్వదేశానికి 45మంది భారతీయుల మృతదేహాలు

కువైట్‌ సిటీ : గత బుధవారం తెల్లవారుజామన కువైట్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 49 మంది మరణించారు. మరో 50 మంది వరకు గాయపడ్డారు.

మృతుల్లో 45 మందిని భారతీయులుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఆ మృతదేహాలను వాయుసేన విమానంలో కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. శుక్రవారం ఉదయం ఆ విమానం చేరుకుంటుందన్న సమాచారంతో బాధిత కుటుంబాలు ఎయిర్‌పోర్టుకు వచ్చాయి. దీంతో ఆ ప్రాంతమంతా ఉద్విగ్న భారభరితంగా మారిపోయింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, కేంద్రమంత్రి సురేశ్‌ గోపి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్‌తో పాటు పలువురు విమానాశ్రయంలో ఉన్నారు. అయితే ఈరోజు మధ్యాహ్నం సమయంలో ఆ విమానం 45 మంది మృతదేహాలతో కొచ్చి విమానాశ్రయానికి చేరుకుంటుంది. ఆ తరువాత మృతదేహాలను ఢిల్లీకి తీసుకెళ్లి.. ఢిల్లీ నుంచి వారివారి స్వస్థలాలకు మృతదేహాలను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

కువైట్‌ అగ్నిప్రమాదంలో మృతిచెందిన భారతీయులు 45 మందికాగా.. వారిలో కేరళ (23), తమిళనాడు (7), ఎపి (3), యుపి (3), ఒడిషా (2), బీహార్‌, పంజాబ్‌, కర్నాటక, బెంగాల్‌, తదితర రాష్ట్రాలకు చెందినవారు మరికొందరున్నారు. మృతుల్లో ఎపికి చెందిన వారు ముగ్గురు ఉండగా.. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవల్లి మండలానికి చెందిన ఇద్దరు ఆ దుర్ఘటనలో సజీవదహనం అయ్యారు. అన్నవరప్పాడుకు చెందిన మీసాల ఈశ్వర్‌, ఖండవల్లికి చెందిన ముల్లేటి సత్యనారాయణ అగ్నిప్రమాదంలో మరణించారు. దీంతో ఆ రెండు గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. కువైట్‌ అగ్ని ప్రమాదంలో ఉద్దానం వాసికూడా మృతిచెందారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకబద్ర గ్రామంకు చెందిన తామాడ లోకనాదం నాలుగేళ్లుగా కువైట్‌లో పని చేస్తున్నాడు. గత నెలలో సొంత గ్రామానికి వచ్చిన అతను.. ఈనెల 11వ తేదీన తిరిగి కువైట్‌ కు వెళ్లాడు. ఘటన జరిగిన ముందురోజు రాత్రే కంపెనీ అపార్ట్‌ మెంట్‌కు లోకనాధం చేరుకున్నారు. కంపెనీ రిజిస్టర్‌ లో ఎంట్రీ లేకపోవడంతో లోకనాదం మరణించినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్లుగా కువైట్‌ ఎన్‌బీటీసీ సంస్థలో లోకనాథం పనిచేస్తున్నాడు. లోకనాధం మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. గ్రామంలోనూ విషాదం నెలకొంది. ఈ అగ్నిప్రమాదం సమయంలో తెలంగాణకు చెందిన మరో ముగ్గురు భవనంపై నుంచిదూకి స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు.

About amaravatinews

Check Also

18 యేళ్ల తర్వాత.. జైలు నుంచి విడుదలైన పరిటాల రవి హత్య కేసు నిందితులు

18 యేళ్ల క్రితం టీడీపీ నేత పరిటాల రవి హత్య కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *