బావ కళ్లల్లో ఆనందం కాదు.. భక్తుల కళ్లల్లో సంతోషం చూడండి పురందేశ్వరి గారూ..

ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల లడ్డూ వివాదం ఇప్పుడిప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. ఈ విషయమై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరిపై మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి రోజా సెటైర్లు వేశారు. తిరుపతి లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టు ప్రశ్నలు వేస్తే.. ముఖ్యమంత్రిగా ఏమైనా మాట్లడవచ్చంటూ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అనడం సిగ్గుచేటంటూ రోజా మండిపడ్డారు. దగ్గుబాటి పురందేశ్వరి.. బావ కళ్లల్లో ఆనందం కోసం కాకుండా భక్తుల కళ్లల్లో ఆనందం చూసేందుకు ప్రయత్నించాలన్నారు. అలాగే గతంలో ఏనాడూ హిందూయిజం గురించి మాట్లాడని పవన్.. ప్రస్తుతం వేస్తున్న వేషాలను జనం గమనిస్తున్నారని రోజా అన్నారు.

“పురందేశ్వరి గారు.. బావ కళ్లల్లో ఆనందం కంటే భక్తుల కళ్లల్లో ఆనందం చూడ్డానికి ప్రయత్నించండి. సుప్రీంకోర్టు అడిగిన ఏ ప్రశ్నకు కూడా ప్రభుత్వ తరుఫు లాయర్ సమాధానం చెప్పలేకపోయారు. అందుకే ఆధారం లేకుండా ఎలా మాట్లాడతారని సుప్రీంకోర్టు అడిగింది. అయితే ముఖ్యమంత్రి ఏదైనా మాట్లాడవచ్చంటూ మీరు మాట్లాడటం సిగ్గుచేటు. మీరు, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్.. ప్రెస్ మీట్లలో మాట్లాడిన మాటలు.. కోర్టులో ఎందుకు చెప్పలేకపోయారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఆధారాలు లేకుండా చంద్రబాబు తిరుమల లడ్డూ మీద నిందలు వేసినప్పుడు.. సుప్రీంకోర్టు అడగటంలో తప్పేముంది. మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలా.. టీడీపీ అధ్యక్షురాలా.. బావ కళ్లల్లో ఆనందం కోసం.. ఆయన చేసే తప్పులు వెనకేసుకుని రాకండి. చంద్రబాబు ప్రకటనను సరిదిద్దాల్సిన బాధ్యత మీకుంది. నిజానిజాలు తేల్చి.. తప్పుచేసిన వారిని శిక్షించాలి. లేదంటే తప్పుడు వ్యాఖ్యలు చేసిన వారిని శిక్షించాలని తిరుపతి అమ్మాయిగా డిమాండ్ చేస్తున్నా” అని రోజా అన్నారు.

About amaravatinews

Check Also

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలే.. కట్ చేస్తే.. కేక్ పట్టుకొని..

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలేదని అధికారుల తీరుకు నిరసనగా.. అమలాపురం కలెక్టరేట్లో బాధితుడు కేక్ కట్ చేసేందుకు వచ్చాడు. పిర్యాదు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *