ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత వైఎస్సార్‌సీపీకి వరుసగా షాక్‌లు తప్పడం లేదు. పార్టీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు.. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు గుడ్ బై చెప్పారు. తాజాగా వైఎస్సార్‌సీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవల పార్టీకి, ఎంపీ పదవులకు రాజీనామా చేసిన మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు తెలుగు దేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలో నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో.. మోపిదేవి, మస్తాన్ రావులు పసుపు కండువాలు కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.
ఆగస్టులో ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్‌రావు తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయగా.. వారి రాజీనామాలను రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ ఆమోదించిన సంగతి తెలిసిందే. అంతకముందు వీరిద్దరూ ఎంపీ పదవులతోపాటు వైఎస్సార్‌సీపీకి కూడా రాజీనామా చేశారు. మోపిదేవి టీడీపీలో చేరతానని అప్పట్లోనే స్పష్టంచేయగా.. తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తానన్న బీదా మస్తాన్ రావు కూడా టీడీపీలో చేరారు. వీరిద్దరు రాజీనామా చేసిన ఎంపీ పదవులు త్వరలోనే భర్తీ చేయనున్నారు.
Amaravati News Navyandhra First Digital News Portal