తెలుగు రాష్ట్రాలకు వెంకయ్యనాయుడు సాయం.. అశ్వినీదత్ భారీగా, ఎంత ప్రకటించారంటే!

తెలుగు రాష్ట్రాలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అండగా నిలిచారు. రెండు రాష్ట్రాల్లో వరద బీభత్సంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణలో తాజా పరిస్థితులపై ప్రధాని మోదీకి ఫోన్‌ చేసి వివరించారు.. వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆయన కూడా తన వంతు సాయంగా వ్యక్తిగత పింఛన్‌ నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 లక్షల చొప్పున పంపించారు. అలాగే వెంకయ్య కుమారుడు హర్షవర్దన్‌ నిర్వహిస్తున్న ముప్పవరపు ఫౌండేషన్‌ తరఫున రెండు రాష్ట్రాలకు రూ.2.5 లక్షల చొప్పున, కుమార్తె దీపా వెంకట్‌ నిర్వహిస్తున్న స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ నుంచి కూడా తెలుగు రాష్ట్రాలకు రూ.2.5 లక్షల చొప్పున సాయం అందించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కుండ పోత వర్షాలు, ఉధృతమైన వరదలతో వాటిల్లుతున్న నష్టం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు వెంకయ్యనాయుడు. ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని వివరించి.. వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇప్పటికే మాట్లాడానని.. అక్కడి ప్రభుత్వాల యంత్రాంగాలతో, కేంద్ర అధికారులు టచ్‌లో ఉన్నారని ప్రధాని తనతో చెప్పారన్నారు. రెండు రాష్ట్రాలకు తగిన సహాయ సహకారాలు అందజేస్తామని ప్రధాని హామీ ఇచ్చినట్లు తెలియజేశారు.

టాలీవుడ్ నిర్మాత అశ్వినీదత్ కూడా ఏపీకి అండగా నిలిచారు.. ఆయన రూ.25 లక్షలు ప్రకటించారు. టాలీవుడ్ నిర్మాత బన్నీవాసు ఆయ్ సినిమాలో 25శాతం షేర్‌ను సాయంగా ప్రకటించారు. ఏపీలోని వరదల్లో నిరాశ్రయులైన వారికి భరోసా కల్పించేందుకు సినిమా వసూళ్లలో 25 శాతం విరాళంగా అందించాలని ఆయ్‌ టీం నిర్ణయించింది. సోమవారం నుంచి వీకెండ్‌ వరకు వచ్చిన మూవీ షేర్స్‌లో 25 శాతాన్ని జనసేన పార్టీకి విరాళంగా అందించనున్నారు. ఆయ్ సినిమాకు వచ్చే షేర్లలో 25 శాతం అంటే తక్కువ మొత్తమే వస్తుందని అంచనా వేస్తున్నారు.

విజయవాడ వరద బాధితులకు దివీస్ సంస్థ చేయూతను అందించింది. అక్షయపాత్ర ద్వారా రోజూ 1.70లక్షల మందికి ఆహారం అందిస్తున్నట్లు దివీస్‌ ఎండీ మురళీకృష్ణ తెలిపారు. సుమారు రూ.2.5కోట్ల అంచనా వ్యయంతో ఐదు రోజులపాటు ఈ సాయం కొనసాగుతుందన్నారు.

About amaravatinews

Check Also

బ్రదరూ.! బీ కేర్‌ఫుల్.. 90 రోజుల్లో పెండింగ్ చలాన్లు కట్టకపోతే ఇకపై వెహికల్స్ సీజ్

ఇప్పటికే పలు రోడ్డు ప్రమాదాలు విషయంలో హెల్మెట్స్ పెట్టుకోకపోవడమే కారణం కావడంతో సీరియస్ అయిన హైకోర్టు.. పోలీసులకు కీలక ఆదేశాలను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *