వినాయకచవితికి బ్యాంక్ హాలిడే ఉందా? తెలుగు రాష్ట్రాల్లో శనివారం బ్యాంకులు పనిచేస్తాయా? లేదా?

సెప్టెంబర్ 7. నెలలో తొలి శనివారం. మరి బ్యాంకులకు సెలవు ఉంటుందా? ప్రతి నెలలో రెండో, నాలుగో శనివారాల్లో మాత్రమే బ్యాంకులకు సెలవు ఉంటుంది కదా ఇలా అడుగుతున్నారేంటి అనుకుంటున్నారా? బ్యాంకులకు సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవుల్ని నిర్ధరిస్తుంటుంది. జాతీయ సెలవులు సహా ఆదివారాలు, రెండు, నాలుగో శనివారాలు.. ఇతర ప్రాంతీయ పండగల సందర్భంగా ప్రాంతాల్ని బట్టి సెలవులు మారుతుంటాయి. జాతీయ సెలవులు మాత్రం.. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం.. జనవరి 26- గణతంత్ర దినోత్సవం, ఆగస్ట్ 15 స్వాతంత్య్ర దినోత్సవం, అక్టోబర్ 2- గాంధీ జయంతికి మాత్రమే ఉన్నాయి. మిగతా సందర్భాల్లో స్థానిక పండగలను బట్టి.. ఎక్కడెక్కడ ఎప్పుడు సెలవులు ఉండాలో.. నిర్ణయిస్తుంది.

అయితే ఇప్పుడు తొలి శనివారం అయినా.. సెప్టెంబర్ 7న పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంది. కారణం వినాయక చవితి. అవును ఈ హిందువుల పండగ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలతో సహా గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, గోవాల్లో బ్యాంకులకు శనివారం రోజు సెలవు ఉంది. ఇక మిగతా రాష్ట్రాల్లో మాత్రం యథాతథంగా బ్యాంకులు పనిచేస్తాయని చెప్పొచ్చు.

శనివారం బ్యాంకులకు సెలవు ఉండటంతో.. ఇప్పుడు వరుసగా రెండు రోజులు బ్యాంకులకు సెలవు ఉందన్నమాట. వరుసగా రెండు రోజుల సెలవు తర్వాత మళ్లీ సోమవారమే బ్యాంకులు తెరుచుకుంటాయి. అందుకే ఏదైనా పని ఉంటే.. శనివారం షెడ్యూల్ చేసుకోకుండా ఉంటే మంచిది.

ఇక సెప్టెంబర్ నెలలో మొత్తం ఆర్బీఐ ప్రకారం.. మొత్తం 15 సెలవులు ఉన్నాయి. ఇవి ప్రాంతాల్ని బట్టి మారుతుంటాయి. ఇందులో 2,4 వ శనివారాలు, ఆదివారాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. గణేశ్ చతుర్ధితో పాటు ఈ నెలలో ఫస్ట్ ఓనమ్, మిలాద్ ఉన్ నబీ వంటి స్థానిక పండగలు కూడా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం.. సెప్టెంబర్ 7న గణేశ్ చతుర్ధి సెలవుతో పాటు.. సెప్టెంబర్ 16 మిలాద్ ఉన్ నబీ హాలిడే ఉంది.

About amaravatinews

Check Also

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. ఆ పేపర్లపై హాల్‌టికెట్లు ప్రింట్‌ తీస్తే అనుమతి రద్దు: ఇంటర్‌ బోర్డు

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కొందరు విద్యార్ధులు ఫోన్‌కే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *