హైదరాబాద్ నగరానికి కొత్త రూపు.. కూడళ్ల విస్తరణ, ఫుట్ పాత్‌ల అభివృద్ధికి భారీగా నిధులు

హైదరాబాద్ మహా నగరం విశ్వనగరంగా అభివృద్ది చెందుతోంది. ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరానికి క్యూ కడుతున్నాయి. ఇక నగరాన్ని మరింతగా అభివృద్ది చేసేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోంది. ఫోర్త్ సిటీ ఏర్పాటుతో పాటు మూసీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటుంది. నగరంలోని ప్రధాన రహదారుల అభివృద్ధిపై జీహెచ్‌ఎంసీ (GHMC) ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా నగరంలోని ప్రధాన కూడళ్లను విస్తరించి, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని డిసైడ్ అయింది.

అందులో భాగంగా ఇంజినీరింగ్, యూబీడీ విభాగాల ఆధ్వర్యంలో 329 పనులను చేపట్టింది. అభివృద్ధి పనులకు భారీగా నిధులు కేటాయించింది. రూ.178.87 కోట్లతో నగరానికి న్యూలుక్ తెచ్చేందుకు కమిషనర్‌ ఆమ్రపాలి కాట ఇటీవల ఆమోదం తెలిపారు. రెండు ప్రాంతాల్లో నైట్‌బజార్‌ అభివృద్ధికి జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆకర్షణీయమైన విద్యుద్దీపకాంతులు, స్ట్రీట్‌ ఫర్నీచర్‌తో ఆయా ప్రాంతాల సుందరీకరణ పనులు చేపట్టారు. ఈ ఏడాది చివరికి పనులు పూర్తి చేస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు వెల్లడించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సర్కిళ్ల బ్యూటిఫికేషన్ పనులను కొనసాగిస్తూనే.. మరిన్ని కొత్త వాటికి తాజాగా జీహెచ్‌ఎంసీ ఆమోద ముద్ర వేసింది. ఇప్పటికే కొన్నిచోట్ల పనులు పూర్తి కాగా.. మరో 125 కూడళ్లలో పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. 89 పనులు టెండరు దశలో ఉన్నట్లు చెప్పారు. పంజాగుట్ట, ట్యాంక్‌బండ్‌ అంబేడ్కర్‌ సర్కిల్, తదితర కూడళ్లలో విస్తరణ పనులు తాజాగా మెుదలయ్యాయన్నారు. డిసెంబరు, జనవరిలో నగరంలోని రోడ్ల వెంట పూల మెుక్కలు నాటనున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.

ప్రధాన కూడళ్లలో కొత్త కరెంట్ స్తంభాలు, డిజిటల్‌ బోర్డులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్లైఓవర్లకు ప్రకృతి, ప్రముఖులు, వేర్వేరు వృత్తులు, తెలంగాణ రాష్ట్ర కళలను ప్రతిబింబించే చిత్రాలతో డిజైన్లు వేస్తున్నట్లు తెలిపారు. ప్రధాన రహదారులపై ఏ ప్రాంతానికి ఎంత దూరం అని తెలిపే సైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఆయా పనులు వేగంగా పూర్తి చేసి నగర వాతావరణాన్ని ఆహ్లాదకరంగా, అందంగా తీర్చిదిద్దుతామని జీహెచ్‌ఎంసీ అధికారులు వెల్లడించారు.

About amaravatinews

Check Also

రతన్ టాటా రూ.15 వేల కోట్లు ఎవరికి వస్తాయి? వీలునామాలో ఎవరి పేర్లు ఉన్నాయి?

రతన్‌టాటా ప్రస్తుతం మన మధ్య లేరు. గొప్ప వ్యాపారవేత్త.. అంతకుమించిన మహా మనిషి. వ్యాపారానికి, విలువలు జోడించిన వ్యక్తి. దిగ్గజ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *