మళ్లీ తగ్గిన బంగారం ధర.. 

ఆకాశమే హద్దుగా దూసుకుపోయినా బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తర్వాత బంగారం ధరలు కనివినీ ఎరగని రీతిలో పతనమవుతున్నాయి. ఒకానొక సమయంలో రూ. 80 వేల మార్కును దాటేసిన తులం బంగారం ధర ప్రస్తుతం రూ. 70 వేలలోపు నమోదవుతోంది. శుక్రవారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో…

ఆకాశమే హద్దుగా దూసుకుపోయినా బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తర్వాత బంగారం ధరలు కనివినీ ఎరగని రీతిలో పతనమవుతున్నాయి. ఒకానొక సమయంలో రూ. 80 వేల మార్కును దాటేసిన తులం బంగారం ధర ప్రస్తుతం రూ. 70 వేలలోపు నమోదవుతోంది. శుక్రవారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలలో తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 69,810కి చేరింది. దీంతో చాలా రోజుల తర్వాత తులం బంగారం ధర రూ. 70వేల లోపు నమోదైంది. అయితే రానున్న రోజుల్లో పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో బంగారం కొనుగోలుకు ఇదే సరైన సమయంగా నిపుణులు భావిస్తున్నారు. మరి ఈరోజు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 64,140ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 69,9940 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయి విషయానికొస్తే ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 63,990 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ. 69,810గా ఉంది.

* చైన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 64,290గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 70,140 వద్ద కొనసాగుతోంది.

* బెంగళూరులో శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,990గా ఉండగా, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.69,810 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

* హైదరాబాద్‌లో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 63,990గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 69,810 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో 10 గ్రాముల తులం బంగారం ధర రూ. 63,990కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 69,810గా ఉంది.

* ఇక సాగర నగరం విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 63,990 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 69,810గా ఉంది.

వెండి ధరలు కూడా..

దేశంలో వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండిపై ఈరోజు కూడా రూ. 100 వరకు తగ్గింది. దీంతో ఢిల్లీతో పాటు, ముంబయి, పుణెలో కిలో వెండి ధర రూ. 84,400 అలాగే హైదరాబాద్‌, చెన్నై, కేరళ, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 88,900 వద్ద కొనసాగుతోంది.

About amaravatinews

Check Also

మజ్లిస్‌ ఎంపీ ఒవైసీకి యూపీ కోర్టు నోటీసులు.. ఎందుకంటే…

ఎంపీగా ప్రమాణం చేసిన రోజు జై పాలస్తీనా అని నినాదాలు చేసినందుకు మజ్లిస్‌ ఎంపీ ఒవైసీకి యూపీలోని బరేలి కోర్టు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *