Hallmarking: బంగారు ఆభరణాలు కొంటున్నారా? వీటికి హాల్‌మార్కింగ్ అవసరం లేదు.. ఫుల్ లిస్ట్ ఇదే..

Gold Hallmark Check: బంగారు ఆభరణాలు సహా ఇతర బంగారు కళాకృతులకు హాల్‌మార్కింగ్ అనేది కచ్చితంగా ఉండాలన్న సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడో హాల్ మార్కింగ్ తీసుకురావాలని చూసినా.. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇది వాయిదా పడింది. ఎట్టకేలకు ఏడాది కిందట దీనిని తీసుకొచ్చింది. ఇప్పుడు హాల్ మార్కింగ్ లేని బంగారు ఆభరణాలు విక్రయించేందుకు జువెల్లరీలకు అనుమతి లేదు. అందుకే గోల్డ్ జువెల్లరీ కొనుగోలు చేసే వారు.. ఈ హాల్ మార్కింగ్ గురించి తెలుసుకోవాలి. ఆభరణాలపైనే.. ఈ హాల్ మార్కింగ్ సంకేతాలు మనం గుర్తించాల్సి ఉంటుంది. 14 క్యారెట్లు, 18 క్యారెట్లు, 20 క్యారెట్లు, 22 క్యారెట్లు, 24 క్యారెట్లు ఇలా దేనికైనా హాల్ మార్కింగ్ తప్పనిసరి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) దీనిని ప్రామాణికం చేసింది.

హాల్ మార్కింగ్ అంటే.. ఆరంకెల హాల్ మార్కింగ్ నంబర్ (ఆల్ఫాన్యూమరిక్), బీఐఎస్ లోగో, బంగారం స్వచ్ఛత అక్కడ గోల్డ్ జువెల్లరీపై కనిపిస్తుంది. అయితే.. హాల్ మార్కింగ్ తప్పనిసరి చేసినప్పటికీ.. కొన్నింటికి మాత్రం ఇందులో మినహాయింపు కల్పించింది. అంటే.. కొన్ని ఆభరణాలకు హాల్ మార్కింగ్ అవసరం లేదన్నమాట.

BIS మార్గదర్శకాల ప్రకారం.. కుందన్, పోల్కి, జడాయు జువెల్లరీకి హాల్ మార్కింగ్ అవసరం లేదు.
రెండు గ్రాముల కంటే తక్కువ బరువు ఉన్న జువెల్లరీకి కూడా హాల్ మార్కింగ్ అవసరం లేదంట. గోల్డ్ థ్రెడ్ కూడా హాల్ మార్కింగ్ అవసరం లేని జాబితాలో ఉంది.

పైన పేర్కొన్న గోల్డ్ జువెల్లరీలతో పాటుగా… బార్ల రూపంలో ఉన్న గోల్డ్ బులియన్ సహా గోల్డ్ ప్లేట్, షీట్, ఫాయిల్, వైర్, స్ట్రిప్, ట్యూబ్ లేదా కాయిన్ వంటి వాటికి కూడా హాల్ మార్కింగ్ అవసరం లేదని బీఐఎస్ వెల్లడించింది. గోల్డ్ వాచీలు, ఫౌంటెయిన్ పెన్స్ కూడా హాల్ మార్కింగ్ అవసరం లేని లిస్టులోనే ఉంది.

About amaravatinews

Check Also

ఆల్‌టైమ్‌ రికార్డ్‌ స్థాయికి యూపీఐ చెల్లింపులు.. రూ. లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్‌

దేశంలో యూపీఐ సేవలు ఓ రేంజ్‌లో విస్తరిస్తున్న విషయం తెలిసిదే. టీ కొట్టు మొదలు పెద్ద పెద్ద దుకాణాల వరకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *