పసిడి ప్రియులకు అలర్ట్.. వరుసగా తగ్గి షాకిస్తున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే?

పసిడి ప్రియులకు అలర్ట్. ఇటీవలి కాలంలో గోల్డ్, సిల్వర్ రేట్లు పెద్ద మొత్తంలో పతనమైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం మళ్లీ పుంజుకుంటున్నాయి. కిందటి రోజు తగ్గిన రేట్లు ఇవాళ మళ్లీ ఎగబాకాయి. అయితే భారీ మొత్తంలో ఎగబాకడం ఆందోళన కలిగిస్తోంది. సమీప భవిష్యత్తులో మళ్లీ పెరగనున్నట్లు సంకేతాలు అందాయి. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను ఈసారి కూడా స్థిరంగా ఉంచినప్పటికీ.. సెప్టెంబర్ మీటింగ్ సమయంలో కచ్చితంగా వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాల్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ కారణంతో బంగారం ధరలు ఎగబాకుతున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే.. అప్పుడు యూఎస్ డాలర్, బాండ్ ఈల్డ్స్ డిమాండ్ పడిపోయి.. సురక్షిత పెట్టుబడి సాధనంగా అప్పుడు ఇన్వెస్టర్లు బంగారంవైపు ఆకర్షితులవుతారు. తదనుగుణంగా బంగారం డిమాండ్ పెరిగి రేటు పెరుగుతుంది. ప్రస్తుతం అదే జరుగుతోంది.

హైదరాబాద్ గోల్డ్ రేట్లు..

దేశీయ మార్కెట్లో ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో చూస్తే బంగారం ధర 22 క్యారెట్లపై రూ. 800 పెరిగి తులం ప్రస్తుతం రూ. 64 వేల మార్కుకు చేరింది. ఇది కిందటి రోజు రూ. 200 తగ్గింది. ఇక 24 క్యారెట్లకు చెందిన స్వచ్ఛమైన గోల్డ్ రేటు విషయానికి వస్తే రూ. 870 పెరగ్గా 10 గ్రాములకు ప్రస్తుతం రూ. 69,820 వద్ద ఉంది. ఇది అంతకుముందు రోజు రూ. 210 తగ్గింది. ఇక బడ్జెట్ తర్వాతి నుంచి ఈ గోల్డ్ రేట్లు దాదాపు రూ. 6 వేలకుపైగా తగ్గగా.. మళ్లీ 3-4 రోజులుగా పెరిగాయి.

ఢిల్లీ బంగారం ధరలు..

ఢిల్లీ నగరంలో గోల్డ్ రేట్లు 22 క్యారెట్లపై రూ. 800 పెరిగి ప్రస్తుతం 10 గ్రాములకు రూ. 64,150 వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ ధర తులం రూ. 870 ఎగబాకి రూ. 69,970 వద్ద ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. ఢిల్లీలో ఒక్కరోజులో రూ. 2000 పెరిగి ప్రస్తుతం కేజీ రూ. 86,500 వద్ద ఉంది. కిందటి రోజు ఇది రూ. 500 తగ్గింది. ఇక హైదరాబాద్ నగరంలో చూస్తే సిల్వర్ ధర రూ. 2 వేలు పెరిగి కిలోకు రూ. 91 వేల వద్ద కొనసాగుతోంది.

ఫెడ్ వడ్డీ రేట్లు..

ఇక ఫెడ్ వడ్డీ రేట్లపైప్రకటన తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ ధరలు ఒక్కసారిగా ఎగబాాకాయి. స్పాట్ గోల్డ్ రేటు ప్రస్తుతం 2456 డాలర్ల వద్ద ఉండగా.. స్పాట్ సిల్వర్ ధర 29 డాలర్లకు చేరింది. ఇక డాలర్‌తో చూస్తే రూపాయి మారకం విలువ రూ. 83.74 వద్ద ఉంది.

About amaravatinews

Check Also

మన మోదీయే బాస్.. భారత ప్రధానిపై ప్రపంచ నాయకుల ప్రశంసలు.. ఎవరేమన్నారంటే..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. సెప్టెంబర్ 17, 2025తో 75వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. సెప్టెంబర్ 17న మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో మెగా టెక్స్‌టైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *